ఆర చేయియొక్క పొడవు వేళ్లకంటే ఎక్కువ గానున్న యెడల మనస్సెప్పుడు విశేష భావములతో నిండియుండును. వ్రేళ్లకంటే పొట్టిగా నుండిన తెలివిగలిగి పనులు చేయుటను, సూక్ష్మజ్ఞానము, చురుకుదన మును సూచించును.
హస్తము, వేళ్లు, సమాన పొడవుగా నుండిన, బుద్ధికుశలతయు, సమగ్ర భావమును, న్యాయా న్యాయ విచక్షణ జ్ఞానమును సూచించును.
అరచేయి పల్లము గుంటవలె మిక్కిలి లోతుగా నుండిన దురదృష్టమును, కష్టమును సూచించును.
అరచేయి ఎండుబారి కదలించుటకు సాధ్యముగాక యుండిన ఏకార్యమునందును ఆలస్యము గలిగియుండుటను సూచించును.
అర చేయి వర్ణము
తెల్లని రంగుగల చేయి చూచుటకు స్వచ్ఛముగాని తెలుపురంగు గలచేయి రక్త ప్రసారము తక్కు నగుట చేత కలుగును. ఇది విషయములందు వాంఛలేమి, ఆరోగ్యములేమి, ఉత్సాహ హీనత, మనశ్చాంచల్యము వీటిని దెలుపును.
పాలిపోయి అతితెల్లగా నుండిన వాత తత్వము, పాండు రోగము, చైతన్య హీనతను దెలుపును. పసుపురంగుగల అర చేయి పిత్తాశయ రోగమును దెలుపును. మరియు ఆడకువ, మితభాషిత్వము,
ఆధైర్యమును సూచించును.
గులాబిరంగుగల చేయి సంతోషము, ధైర్యము, సౌఖ్యము, భావోద్రేకము, చుఱుకుదనము, ఆరో గ్యైశ్వర్యమును సూచించును.
కుంకుమ వర్ణముగల చేయి కోపము, సాహసము, రక్తాధిక్యత, ఉద్రేకము వీటిని సూచించును.
నీలవర్ణముగల చేయి దౌర్బల్యము, శరీరము నందొక దీర్ఘ వ్యాధి వ్యాపనము, బలహీనము, దుఃఖము వీటిని సూచించును.
మిక్కిలి నలుపుగల చేయి ఈర్ష్య, అహంకారము, శీఘ్ర మృత్యువు, వీటిని సూచించును.
అరచేతియందు నల్లని డాగులు కనబడిన చర్మ వ్యాధులు, సుఖవ్యాధులు, చెడురక్తము, మనోదౌర్బ ల్యము వీటిని సూచించును.
అరచేతి యందు తెల్లని డాగులు కనబడిన జీర్ణించిన చర్మవ్యాధులని ఎఱుంగ రలయును. ఇది అట్ట శుభ సూచకము గానేరదు.
No comments:
Post a Comment