Adsense

Thursday, September 5, 2024

భగవంతుని నామం ఏఏ సమయాల్లో, ఏ ఏ నియమాల్లో చేయాలి? వాటికి ఉపదేశం ఉండాలా?

జవాబు : భగవన్నామ జపానికి ఇది సమయమనీ, ఇది నియమమనీ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ చేయవచ్చు. రామ, కృష్ణ, శివ, దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి ఏ నామమైనా, ఏ సమయంలోనైనా స్మరించవచ్చు. నియమాలూ, పద్ధతులూ మంత్రజపానికి మాత్రమే అవసరం. నామ జపానికి ఏ ఉపదేశాలూ అక్కర్లేదు. మంత్ర జపానికి మాత్రం ఉపదేశం అవసరం. సర్వకాల సర్వావస్థల్లోనూ నామ జపం చేయడం వల్ల భగవత్కృప తప్పక లభిస్తుంది.

No comments: