ప్రతీ మనిషి కర్మ, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వార్థ కర్మ.రెండోది పరమార్ధ కర్మ.
స్వార్ధ కర్మ అంటే - మనందరికీ తెలుసు. తన స్వప్రయోజనాల కోసం మాత్రమే, అధర్మమైన పని చేయడం.
పరమార్ధ కర్మ అంటే - భగవంతుడికి సంబంధించిన పని అని చాలామంది భావిస్తూంటారు. కాని అది పరిపూర్ణ అర్ధం కాదు. ఇతరుల ప్రయోజనం కోసం తన స్వప్రయోజనాలని వదులుకుని పని చేయడం కూడా పరమార్ధ కర్మ అవుతుంది.
స్వార్ధ కర్మని ఇంకో కోణం లోంచి కూడా చెప్పచ్చు. తన ఆధ్యాత్మిక పరిణామక్రమానికి వ్యతిరేకంగా చేసే పని స్వార్ధ కర్మ, అలాగే తన ఆధ్యాత్మిక పరిణామక్రమానికి అనుకూలంగా చేసే పని పారమార్ధిక కర్మ అవుతుంది. స్వార్ధ కర్మని పాపం అని, పరమార్ధ కర్మని పుణ్యం అని కూడా అంటూంటాం..
వివిధ శాస్త్రాల్లో కర్మలని విభజించారు. ఐతే అవన్నీ పై ఒకటి, రెండు తరహా కర్మల్లోని మూడు విభాగాల్లో ఏదో ఓ దానికి చెందినవే తప్ప వాటికి చెందనివి ఏవీ లేవు. వాటిలో ఓ విభజన...
1. నిత్య కర్మలు:
సంధ్యా స్నానం జపో హోమో దేవతానాంచ పూజనమ్!
ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే!!
పై శ్లోకం నిత్య కర్మలు ఏవో చెప్తోంది. అవి వరసగా -- స్నానం, సంధ్య, జపం, హోమం, దేవతార్చన, వైశ్వదేవాన్ని ఆచరించడం, అతిధులని ఆదరించడం, అనే ఏడు నిత్య కర్మలు.
ఇవన్నీ శుభ అగామి కర్మల కిందకి వస్తాయి. వీటిని ఆచరించడం వల్ల చిత్త శుద్ధి ఏర్పడి, మనశ్శాంతి లభిస్తుంది. మనిషి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా వీటిని నిత్యం చేయాలి.
*AI Generated Picture
2. నైమిత్తిక కర్మలు:
వివిధ నిమిత్తాలని అనుసరించి ఒక నిమిత్త కాలం, అంటే ఆ దినం మాత్రమే చేసే కర్మలు. ఉదాహరణకి గ్రహకాలంలో, మహాలయ అమావాస్య నాడు తర్పణాలు వదలడం, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడం మొదలైనవి నైమిత్తిక కర్మలు. ఇవన్నీ కూడా శుభ అగామి కర్మలు కిందకి వస్తాయి. నైమిత్తిక కర్మల వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. నిత్య, నైమిత్తిక కర్మలు పాప క్షాళనని చేస్తాయి కాబట్టి వీటిని చేయడం వదలకూడదని శాస్త్రం.
3. కామ్య కర్మలు:
చేసిన కర్మలకి ఫలాన్ని ఆశించి, వ్యక్తి ఇష్టాఇష్టాలని అనుసరించి చేసేవి కామ్య కర్మలు.
జప, తప, హోమ, యజ్ఞ, యాగాది కర్మలు - సంతానం, బంధు మిత్రులు, భార్య మొదలైన వాటిని, ధన ధాన్య వస్తు వాహనాది సంపదలని పొందాలని చేసేవి కామ్య కర్మలు. భౌతిక లేదా లౌకిక ఫలితం ఆశించి చేసేవన్నీ కామ్య కర్మల కిందకే వస్తాయి.
స్వర్గాన్ని కోరి జ్యోతిప్టోమాన్ని, పుత్ర సంతానం కోరుకుని పుత్రకామేష్టి యాగాన్ని, సత్యనారాయణ వ్రతం లాంటి ఫలం కోరుకుని చేసేవి, మొక్కులు కామ్య కర్మలు. జీతం కోరి చేసే ఉద్యోగం కూడా కామ్య కర్మే. ఇవి అశుభ అగామి కర్మలు. కామ్య కర్మల వల్ల మనశ్శాంతి లేకుండా పతనమవుతారు.
యోగశాస్త్రంలో కర్మలు రెండు రకాలుగా చెప్పారు.

No comments:
Post a Comment