Adsense

Tuesday, September 17, 2024

తెలుగు వారి భోజనంలో ఏది ఏ వరుసలో తినాలి?

సాధారణంగా తెలుగు వారి భోజనం లో ఉసిరిగపచ్చడి,ముద్దపప్పు,రెండు కూరలు,ఊరగాయ,పులుసు,చారు,పచ్చడి,గారెలు,బూరెలు,అప్పడాలు,వడియాలు,పాయసం,పెరుగుపచ్చడి,పెరుగు ఉంటాయి.

ముందుగా ఉసిరిగ పచ్చడి తో భోజనం మొదలు పెడతారు. దీనికి కారణం పులుపు మరియు కారం నాలికలోని రుచిని ఆస్వాదించటానికి ఉండేటువంటి టేస్ట్ బడ్స్ ను ఆక్టివేట్ చేస్తాయి.

తర్వాత ముద్ద పప్పు పులుసు లేదా ఊరగాయ నంచుకుంటూ తింటారు.

మరికొందరు గారెలు నంచుకుంటూ ముద్దపప్పు అన్నంతింటారు. ఇంకొందరు గారెలు పులుసులో నంచుకుంటూ తింటారు.

తర్వాత కూరలతో అన్నం తింటారు.

ఆంధ్రుల అభిమాన వంటకం గోంగూర పచ్చడి ఉల్లిపాయతో తింటారు.

పాయసం తాగి గారెలు బూరెలు తింటారు.

పెరుగుపచ్చడిలో గారెలు నంచుకుంటూ, నేతిలో బూరెలుముంచుకుంటూ తింటారు.

వడియాలు, అప్పడాలు నంచుకుంటూ చారన్నం తింటారు.

ఆఖర్న నిమ్మకాయ ఊరగాయతో పెరుగుఅన్నంతిని భోజనాన్ని ముగిస్తారు.

ఉత్తరాంధ్రవాళ్లు పెరుగుఅన్నంలో అరటిపండు తింటారు.

కొంతమంది పెరుగన్నం తిన్నతర్వాత పాయసం తాగుతారు.

ఇదేరకంగా తినాలని రూలేమీలేదు, వారివారి అభిరుచిని బట్టి, భోజనాన్ని ఆస్వాదించే తీరును బట్టి వరుసక్రమం మారుతూ ఉంటుంది.


No comments: