Adsense

Monday, September 23, 2024

మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి

మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి. వాటి నించి స్వచ్ఛందంగా ఋణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన సనాతన సాంప్రదాయం ఇలా చెపుతుంది."
దేవ ఋణం:
"ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడిని నిరంతరం స్మరించడం ద్వారా, పూజ ద్వారా దేవ ఋణాన్ని తీర్చుకోవచ్చును".
ఋషి ఋణం:
"మనకు ఋషులు సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రసాదించారు. వారి స్మరణతో ఆ ఋణ విముక్తి కలుగుతుంది."
పితృ ఋణం:
"ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రులు వంశ కర్తలు, వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించేట్లుగా ప్రవర్తించడం ద్వారా, అలాగే వారికి పితృ తర్పణాలు వదలడం ద్వారా వారి ఋణం తీర్చుకోవచ్చును".
భూత ఋణం:-
"మన జీవన యాత్రలో కనబడే పశు, పక్షి, వృక్ష, క్రిమి కీటకాదుల పట్ల దయ కలిగి ఉండటం, వాటికి ఆహారాది వితరణ చేయడం ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చును."
మనుష్య ఋణం:
"సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుని దీనులకి తగిన సహాయం చేసి వారి దుఃఖాన్ని తొలగించడం ద్వారా మనుష్య ఋణాన్ని తీర్చుకోవచ్చును".

"మనం ధర్మమైన కర్మాచరణ చేస్తే, అది కర్మ బంధం కాకపోగా, పాత కర్మలు తొలగి కర్మ బంధంలో చిక్కుకోం. పైగా ఆ చిక్కుల్లోంచి బయటపడతాము."

అసలు ధర్మం అంటే ఏమిటి?
"ధారణా ధ్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః!!"
భావం: "ఏది ఒక వ్యవస్థని విచ్ఛిన్నం కానీయకుండా ధరించి ఉంటుందో అదే ధర్మం. ధర్మమే ప్రజలని ఛిన్నాభిన్నం కానీయకుండా ధరించి కాపాడుతుంది. ఏది ధర్మమో, ఏది కాదో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసీ అధర్మం చేస్తూంటాం. ఎందుకు? దుర్యోధనుడు మనందరిలోనూ ఉన్నాడు కాబట్టి".

"జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః!
జానామి అధర్మం న చ మే నివృత్తిః!!"

భావం:
"ధర్మమని తెలిసీ ఆచరించలేను. అధర్మమని తెలిసీ వదలలేను. అని దుర్యోధనుడు చెప్పాడు."

"వ్యాసుడు ధర్మాన్ని ఇలా నిర్వచించాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించడం దుష్కర్మే అవుతుంది."

"యదన్యైద్విహితం నేచ్చేతో ఆత్మనః కర్మ పురుషః!*
*న తత్పరేషు కుర్వత ఏష ధర్మ స్సనాతనః!!"

"భావం:-
"ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు. ఇదే సనాతన ధర్మం.

"మహాత్ములు,  ఏది పాపం? ఏది పుణ్యం? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి ఒకే 'లిట్మస్ టెస్ట్' ఇచ్చారు".

"అధర్మం అంటే ఏమిటి?"
"ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే." "కర్మ బంధం"

'మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి. వాటి నించి స్వచ్ఛందంగా ఋణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన సనాతన సాంప్రదాయం ఇలా చెపుతుంది."

No comments: