Adsense

Sunday, September 22, 2024

విష్ణుసహస్రనామం, లలితాసహస్రనామం చదివేప్పుడు పాటించాల్సిన నియమాలు

  • స్నానం చేసి లేదా కనీసం చేతులు కాళ్లు ముఖము కడుక్కుని - చదవడానికి కూర్చోవాలి
  • అవకాశం ఉన్నంతవరకు ఒక నిర్దిష్ట సమయాన్ని - మీకు వీలైన సమయాన్ని నిర్దేశించుకుని, ప్రతిరోజు ఆ సమయానికే చదవడం అన్నది మంచి ఫలితాలను ఇస్తుంది.
  • అలాగే మీ దేవుడి గదిలో కానీ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని నిర్ధారించుకుని రోజు అదే ప్రదేశంలో కూర్చుని పారాయణ చేయడం మంచిది
  • అవకాశం ఉంటే స్తోత్ర పారాయణ కన్నా ముందే ఒక దీపాన్ని వెలిగించి, మీరు చదవడం పూర్తయ్యేంతవరకు ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అలాగే అగరబత్తీ కూడా. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దైవీశక్తులను బాగా ఆకర్షిస్తుందిట.
  • రోజు ఒక్కసారి అయినా చదవాలి - రెండు పూటలా చదవగలిగితే ఇంకా మంచిది.
  • ఉభయసంధ్యలు అంటే ఉదయం 6:00 మరియు సాయంత్రం 6:00 సమయం పారాయణలకి, ప్రార్థనలకి చాలా అనుకూలమైన సమయం.
  • భోజనం లేదా ఏదైనా ఘన ఆహారం తీసుకున్న మూడు గంటల వరకు పారాయణకు పనికిరాదు.
  • మాంసాహారం కనుక తీసుకుంటే మూడు నాలుగు గంటల తరువాత తల మీద స్నానం చేసి పారాయణకు కూర్చోవచ్చు.
  • ఇంట్లో చదువుకోవడానికి మడి తడి లాంటి అడ్డంకులు ఏవైనా ఉంటే - ఏదైనా దేవాలయంలో కూర్చుని పారాయణ చేసుకోవడం శ్రేష్టం.
  • చాలా నియమాలు ఉన్నాయి; ఇవన్నీ పాటించాలా అని కంగారు పడనవసరం లేదు. కుదిరినన్ని పాటించండి. ఎన్ని నియమాలు పాటిస్తారు అన్నది మీ భావ తీవ్రతను బట్టి, మీ సమస్య యొక్క తీవ్రతను బట్టి, మీ శారీరిక క్రమశిక్షణ బట్టి - అన్నింటికీ మించి మీకు ఎంత వీలు కుదురుతుంది అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

No comments: