- పాపిటలో ఉంటుంది.
- నుదుట బొట్టులో ఉంటుంది.
- జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది.
- రింగుల జుట్టు అమ్మాయిలు జడవేసుకుని రబ్బరు బ్యాండు పెట్టుకుని వదిలేసిన జుట్టు అంచు గుండ్రంగా పిచ్చుక గూడులా ఉంటుంది. ఆ పిచ్చుక గూడు అందంగా ఉంటుంది.
- కళ్ళ కాటుకలో ఉంటుంది.
- ముక్కు పుడకలో ఉంటుంది.
- చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది.
- మొహం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని వేళ్ళతో వెనక్కి తోసుకోవడంలో ఉంటుంది.
- జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది.
- లంగా ఓణీలో ఉంటుంది. పట్టు చీరలో ఉంటుంది, సిల్కు చీరలో ఉంటుంది. కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వస్తుంది.
- కోపంలో ఉంటుంది.
- 'పళ్ళు రాల్తాయి' అని సుతిమెత్తగా తిట్టడంలో ఉంటుంది.
- 'మా ఆయన' అని అందరితోనూ చెప్పడంలో ఉంటుంది.
- మగవారు చేసే తప్పుల్ని ఎత్తిచూపడంలో ఉంటుంది. దెప్పిపొడవడంలో ఉంటుంది.
- తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవడంలో ఉంటుంది.
- వారి ధైర్యంలో ఉంటుంది.
- గారంగా నచ్చింది కొనిపించుకోవడంలో ఉంటుంది.
- కుటుంబం మీద చూపించే అనురాగంలో ఉంటుంది.
- పసిపిల్లలను కంటికి రెప్పలా సాక్కునే ఆప్యాయతలో ఉంటుంది.
- ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది.
- ఊరెళ్లిన భర్త తిరిగి వచ్చేవరకూ చూసే ఎదురు చూపులో ఉంటుంది.
- కొత్తగా పెళ్లయిన అమ్మాయి అబ్బాయిని అతనే సర్వస్వం అనుకోవడంలో ఉంటుంది.
సేకరణ
No comments:
Post a Comment