Adsense

Showing posts with label ఆడవాళ్ళ అందం ఎందులో ఉంటుంది?. Show all posts
Showing posts with label ఆడవాళ్ళ అందం ఎందులో ఉంటుంది?. Show all posts

Sunday, October 13, 2024

ఆడవాళ్ళ అందం ఎందులో ఉంటుంది?


  1. పాపిటలో ఉంటుంది.
  2. నుదుట బొట్టులో ఉంటుంది.
  3. జడ ముందుకేసుకోవడంలో ఉంటుంది.
  4. రింగుల జుట్టు అమ్మాయిలు జడవేసుకుని రబ్బరు బ్యాండు పెట్టుకుని వదిలేసిన జుట్టు అంచు గుండ్రంగా పిచ్చుక గూడులా ఉంటుంది. ఆ పిచ్చుక గూడు అందంగా ఉంటుంది.
  5. కళ్ళ కాటుకలో ఉంటుంది.
  6. ముక్కు పుడకలో ఉంటుంది.
  7. చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది.
  8. మొహం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని వేళ్ళతో వెనక్కి తోసుకోవడంలో ఉంటుంది.
  9. జుట్టు ముడి వేసుకోవడంలో ఉంటుంది.
  10. లంగా ఓణీలో ఉంటుంది. పట్టు చీరలో ఉంటుంది, సిల్కు చీరలో ఉంటుంది. కొంతమంది కట్టుకుంటే చీరకే అందం వస్తుంది.

  1. కోపంలో ఉంటుంది.
  2. 'పళ్ళు రాల్తాయి' అని సుతిమెత్తగా తిట్టడంలో ఉంటుంది.
  3. 'మా ఆయన' అని అందరితోనూ చెప్పడంలో ఉంటుంది.
  4. మగవారు చేసే తప్పుల్ని ఎత్తిచూపడంలో ఉంటుంది. దెప్పిపొడవడంలో ఉంటుంది.
  5. తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవడంలో ఉంటుంది.
  6. వారి ధైర్యంలో ఉంటుంది.
  7. గారంగా నచ్చింది కొనిపించుకోవడంలో ఉంటుంది.
  8. కుటుంబం మీద చూపించే అనురాగంలో ఉంటుంది.
  9. పసిపిల్లలను కంటికి రెప్పలా సాక్కునే ఆప్యాయతలో ఉంటుంది.
  10. ఇంటిని చక్కబెట్టడంలో ఉంటుంది.
  11. ఊరెళ్లిన భర్త తిరిగి వచ్చేవరకూ చూసే ఎదురు చూపులో ఉంటుంది.
  12. కొత్తగా పెళ్లయిన అమ్మాయి అబ్బాయిని అతనే సర్వస్వం అనుకోవడంలో ఉంటుంది.

సేకరణ