Adsense

Sunday, October 20, 2024

దక్షుడి వంతు..! కథ

దక్షుడి వంతు..! కథ

మనం ఎప్పుడూ వినని కథ ఇది ! ఒకసారి పాండవులు,‌ ద్రౌపతి అందరికి విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డీస్తుండగ దుర్యోధనుడు దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఒక వరుసలో కూర్చుని ఉండగ ద్రౌపతి వారికి వడ్డించడానికి రాగా ఆమెను ఎలాగైనా అవమానించాలని తలచిన దుర్యోధనుడు ఆమె దగ్గరకు రాగానే “ఓ పాంచాలి ఈరోజు ఎవరి వంతు?” అని అడిగాడు. ఆమె ఆ మాటలకు చాలా అవమానంగా భావించి అక్కడ నుండి కన్నీళ్లతో లోపలకు పరుగు పెట్టింది. అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణుడు “చెల్లీ నేను మొత్తం చూస్తూనే ఉన్నాను. నువ్వు బాధపడకు! నువ్వు వెళ్లి వాళ్లకు వడ్డించు!! అదే ప్రశ్నను అతడు మళ్ళీ అడిగినప్పుడు ‘దక్షుడి వంతు!’ అని చెప్పు” అన్నాడు. ద్రౌపతి సరే అని చెప్పి వెళ్లి వడ్డించడంతో దుర్యోధనుడు.. “ఏంటి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు” అని అడిగాడు. అప్పుడు ఆమె “దక్షుడి వంతు!” అని చెప్పగా…వణికిపోతూ అక్కడ నుండి అవమానంతో లేచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. ద్రౌపతి కృష్ణుడి దగ్గరకు వచ్చి “ఏంటి అన్నా ఈ మాయ?” అని అడిగింది. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు దుర్యోధనుడు తన భార్య అయిన భానుమతిని అస్సలు పట్టించుకునేవాడు కాదు.ఆమె పెళ్ళైనప్పటికీ కన్యగానే ఉండేది. ఆమె ఒకరోజు మునిని ప్రార్థించగా ఆయన ఒక మూలికను ఇచ్చి ఇది పాలలో కలిపి దుర్యోధనుడికి తాగించమని చెప్పాడు. ఆమె పాలతో ఎదురుచూస్తుండగా దుర్యోధనుడు మధ్యం సేవించి వచ్చి ఆమె ఇచ్చిన పాలను తాగకుండా కిందకు తోసేసాడు. అప్పుడు అటుగా వచ్చిన దక్షుడు అనే పాము ఆ పాలను తాగగా ఆమె పై కోరికతో మానవ రూపంలోకి మారాడు. ఇది గమనించిన దుర్యోధనుడు తన భార్య పాతివ్రత్యాన్ని కాపాడడానికి దక్షుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు.“నేను ఆమె పై కోరిక పెంచుకుని రాలేదు! ఆమె కలిపిన పాలలో ఉన్న వశీకరణ మూలిక వల్ల ఆమెను పొందాలని అనుకుంటున్నాను. నేను కిరాతకుడిని కాను, కాని ఆమె వశీకరణం వల్ల ఆమెను వదులుకోలేను. కనుక ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను. ఆమె నా పుట్టలో పాలు పోసి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె పాతివ్రత్యానికి ఎటువంటి కళంకం కలగకుండా ఆ రోజు నువ్వు కూడా ఆమెతో వచ్చి నాకు నమస్కారం చేసుకోవాలి” అని అన్నాడు. ఆ రోజు నుండి ఇప్పటివరకు దుర్యోధనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజు పుట్ట దగ్గరకు వెళ్తాడు ఈ విషయం అతడికి, భానుమతికి దక్షుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ పేరు చెప్పడంతో అవమానంగా భావించి పరుగులు పెట్టాడు” అని వివరించాడు శ్రీకృష్ణుడు.

లోకా సమస్తా సుఖినోభవన్తు!

No comments: