THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, November 11, 2024
ప్రక్క ఇంట్లో పూసిన పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.
రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ, కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...
మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???
నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...
ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి.
శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం )
తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.
మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....
మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment