గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా
ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
నిండైన సందలు నాకియ్యవమ్మా
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
ముత్తైదువతనం నాకియ్యవమ్మా
నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా !
నవధాన్య రాసులను నాకియ్యవమ్మా
అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
ఆయువై దోతనం నాకీయవమ్మా
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా!
అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !
తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా
పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !
పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
ఎవ్వరు పాడినా ఏకాశి మరణం !
పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
రామతులసీ , లక్ష్మీ తులసీ !
నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా.
No comments:
Post a Comment