1.పూజ గది విడిగా లేనివారు
పంచముఖ హనుమంతుణ్ని పెట్ట కూడదు. హనుమంతుని ఫోటో గానీ, విగ్రహం గానీ
ఏదీ పూజ గది విడిగా లేనివారు ఉంచరాదు.
2. సూర్యుని విగ్రహం ఇంట్లో పెట్ట రాదు.
ఆయనే నేరుగా ప్రతి రోజూ కనిపిస్థారు
కాబట్టి నేరుగా నమస్కరించాలి.
3. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి
ఫొటో గానీ, విగ్రహ ము గానీ ఇంట్లో ఉండరాదు.
లక్ష్మీ నరసింహ , యోగ నర సింహ లేదా
ప్రహల్లాద నరసింహస్వామి ఫోటో పెట్టవచ్చు.
4. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుని
విగ్రహం ఇంట్లో ఉంచ రాదు *
ఆవుతో కృష్ణుడు కల్సి ఉన్న విగ్రహం
గానీ ఫోటో గానీ ఉండవచ్చు.
5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు గానీ
ఫోటో ముందు గానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.
6. కాళికా. ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టరాదు.
7. విగ్రహ పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో. పాలో. హారతి ఇస్తే సరి పోతుంది.
విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే
రోజూ మహా నివేదన
వారంలో ఒక్కసారి అన్నా
అభిషేకం ఉండాలి
పూజ లేకుండ ఉంచరాదు.
8. ఇంటిలో నటరాజ విగ్రహం పెట్టరాదు.
నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు.
9. ఇంటి గుమ్మానికి
దిష్టి కోసం రాక్షసుల ఫోటో పెట్ట రాదు.
ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతారు, వినాయకుని ఫోటో గానీ దిష్టి యంత్రం గానీ
కాళీ పాదం ఫోటో పెట్టడం మంచిది.
10. నిత్యం పూజలో ఉండే విగ్రహాలు
తీసివేయవల్సి వస్తే గుడిలో పెట్టండి.
11. ఇంటిలో పూజించే వినాయకుని
విగ్ర హంలో తొండం ఎడమ వైపు ఉండాలి విద్యాలయాలు, చదువుల బడుల్లో,
వినాయకుని విగ్రహ తొండం కుడి వైపుకు ఉండాలి.
వ్యాపార ప్రాంతంలో ఉన్న వినాయకుడు
నిలబడి ఉండాలి.
12. ఇంట్లో ఎక్కడా
లక్ష్మీదేవి నిల్చున్న విగ్రహం గానీ,
ఫోటో గానీ ఉండ రాదు.
లక్ష్మీదేవి పచ్చ రంగు చీర ధరించి
అటూ, ఇటూ, ఏనుగులు ఉన్న ఫోటోను
గ్రుహస్తులు పూజించడం మంచిది.
13. పూజ తరువాత పెట్టిన నైవేద్యంను
ప్రసాదం గా వెంటనే పంచి వెయ్యాలి *
మీరు చేసిన పూజకుదేవుని అనుగ్రహం
ప్రసాదం రూపం లో స్వీకరించాలి.
14. పూజ గదిలో
ఎంత ఖరీదు విగ్రహాలు ఉంచినా,
పసుపు రాసి, వైష్ణవు లయితే తిరునామాలు, శైవులయితే ట్రిపురాండ్రులు ( అడ్డ నామాలు), శక్తేయులు అయితే పసుపు మద్యలో
గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి *
వైష్ణవులు తులసి ఆకుతో గాని
తమల పాకును గానీ,
గోడకు రద్దీ నామాలు పెడతారు.
మీరు ఎంత ఖరీదు వస్తువు లను ఉంచినా
పూజ గది గోడకు ఇలా పెట్టి
పూజించ దము సాంప్రదాయం.
15. అప్పుల బాధలు తీరాలంటే
కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి.
ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన. నిత్యం లక్ష్మీ దేవి కటాక్షం కోసం ఆవునేతి దీపం,
శతృ పీడల, గండాలు, ఆస్తి తగాదాలు,
ఇంట్లోవారి అనారోగ్యం తొలగుటకు,
తెలుపు నువ్వుల నూనెతో
నిత్య దీపా రాధన చెయ్యాలి.
16. షష్టి, అష్ఠమి, త్రయోదశి నాడు
తలకు నూనె పెట్టు కోరాదు.
17. రాత్రిపూట తల చిక్కు తియ్యరాదు.
18. పెరుగు చేతి తో చిలక రాదు.
19. నీరు, పాలు, పెరుగు, నేయికి అంటు లేదు. అవి ఎక్కడి నుండి, ఎవరి నుండి అయినా తీసుకో వచ్చు.
20. లక్ష్మీ దేవి అను గ్రహానికి పూజలున్నాయి * లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి .
21. జేష్ఠాదేవి కి పులిహార చేసి దేవికి నివేదన చేస్తే జేష్ఠాదేవి పెట్టే కష్ఠాల నుండీ ఉపశమనం లభిస్తుంది. పులిహోరను పంచితే జేష్ఠా దేవి శాంతిస్తుంది * అందుకే పెద్దలు వారానికి ఒకసారి అయినా పులిహోర వండి. పంచి పెట్టే వారు .
22. రాత్రి పూట
ఆహారం తీసుకోకుండా పడుకోరాదు.
రుచిగా లేక పోయినా తిట్టుకుంటూ తిన కూడదు.
23.తిట్టుకుంటూ వంట చెయ్య రాదు.
అలా చేస్తే తిట్టు కుంటూ తింటారు.
సంతోషంగా చేస్తే ఆనందంగా తింటారు.
24. పచ్చిపాలు నైవేద్యం పెట్ట రాదు .
కాచి చల్లర్చిన పాలు అభిషేకానికి వాడ రాదు *
25. ధాన్యం చేసుకునే ఆసనం
అడ్డంగా వేసుకుని కూర్చోరాదు. నిలువుగా ఉండాలి.
26. జపమాల చూపుడు వేలుపై తిప్పరాదు *
మద్య వేలు తోనే చేయాలి *
జపమాల మెడ లో వేసుకో రాదు.
మెడలో వేసుకున్న మాల, జపానికి వాడ రాదు *
27. ఒకరు వేసుకున్న రుద్రాక్షలు
వేరొకరు ధరించ రాదు *
28. ఇంట్లో పిల్లలు. పెద్దలు.
తరచుగా తిరిగే చోట
ఇంటి దైవాన్ని ఫొటో పెట్టాలి *
వస్తూ పోతూ చూసినప్పుడు
ఒకసారి తల్చుకొంటారు *
29. అద్దె ఇల్లు వాస్తు
మీ జాత కానికి సరిపోక పోవచ్చు *
దాని కోసం వాస్తు దోషాలు పరిహారముగా
ఏడు రంగులు కల్సిన వాల్ మాట్
గోడకు డెకరేషన్ గా పెట్టాలి *
30. ఇంట్లో తరచుగా సామ్రాణి వెయ్యాలి *
నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది *
ఇంట్లో గాలి శుబ్ర మవుతుంది *
31. ఇంట్లో దీపం
వెలిగించడము అలవాటు ఉంటే ప్రతిరోజూ
ఉదయం సాయంత్రం వెలిగించ వలసిందే *
No comments:
Post a Comment