Adsense

Saturday, November 23, 2024

రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంపు TTD TIRUMALA TIRUPATHI

తిరుమల, 2024 నవంబరు 21: రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచింది.

ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు.

అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించడం జరిగింది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు.

కాగా ఈ విధానం రేపటి నుండి అమలులోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

No comments: