తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు
👉 వర్చువల్ సేవలు, సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు.
👉 వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 తిరుమల, తిరుపతిలలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 నవంబర్ 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు
No comments:
Post a Comment