Adsense

Friday, December 13, 2024

శివుడే స్వయంగా ప్రతిష్టించిన శివ లింగం

ప్రపంచంలో ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనది. అదే తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం.

ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు.సంతానం కోసం

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.

తిరువిడై మరుదూర్ కు కేవలం 9కిలోమీటర్ల దూరంలో కుంబకోనం రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడి నుండి లోకల్ బస్స్ సర్వీలు ఉన్నాయి.ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు.ఇక్కడిశివ లింగం స్వయంభు.

(సేకరణ)

No comments: