Adsense

Sunday, December 22, 2024

సీతాఫలం ఉపయోగాలు

*  మంచిగా పండిన సీతాఫలం తీసుకోవడం వలన రక్తం వృద్ది చెందును .

* శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు.

* శరీరం నందు వేడిని హరించును .

* సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును.

* ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును .

* ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును .

            ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను .

* దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును .

* శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .

* శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును

* శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును .

* శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .

*  దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును .

* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.

శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు  -

* శరీరంలో శ్లేష్మము పెంచును.

* కొద్దిగా పైత్యం చేయును .

* జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును

* అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు.

* గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు .

(సేకరణ) 

No comments: