సెనగ పిండి తో చేసే ఈ పదార్థం మహారాష్ట్ర వారి వంటకం. వారు జొన్న పిండి తో చేసే రొట్టె ను భాక్రి అంటారు. ఈ భాక్రి కి జత, ఈ సెనగపిండి చట్నీ. వారు దీనిని జుంక ( zunka ) అంటారు. Zunka bhaakri మహారాష్రీయుల జనప్రియమైన ఆహారం. ఎంత అంటే, అక్కడి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇదే పెడతారు. తమిళ సోదరులకు ఇడ్లి సాంబారు ఎలాగో, మరాఠీయులకు జున్క భాక్రి అలాగే.
పైన చెప్పింది చదివితే ,ఇక మనం దానిని బొంబాయి చట్నీ అని ఎందుకంటామో మీకు తెలిసి పోయి ఉంటుంది.మన ఊరిలో హోటళ్లు మనకు హోటళ్లు మాత్రమే. కానీ బయటి ఊళ్లలో ఆంధ్ర restaurant అని ప్రత్యేకం గా పేర్కొంటారు. బొంబాయి చట్నీ కూడా అలంటి పేరే.
ఉత్తర కర్ణాటక, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలలో దీనిని పిట్ల అని కూడా అంటారు. కమ్మని రుచి కలిగిన బొంబాయి చట్నీ చేయడం కూడా చాల సులభం.
No comments:
Post a Comment