Adsense

Wednesday, December 25, 2024

చెప్పులలో రకాలను (ఫ్లిప్ ఫ్లాప్స్, స్నీకర్స్, స్లిప్పర్స్, సాండల్స్ మొదలైనవి) గురించి ఏవి ఎప్పుడు వాడాలో వివరించండి?

ఎన్నో రకాల జోళ్లు/పాదరక్షలు/చెప్పులు రకాలు ఉన్నాయండి.మీరు అడిగినవి ప్రధానంగా స్త్రీ పురుషులు ఇద్దరు, వాడేవి. ఇలా కాకుండా,పురుషులవి,స్త్రీలవి అని విడివిడి గా ఉన్నాయి.

ఇక ప్రధానంగా లాంఛనంగా (formal) వేసుకునేవి, అలానే నియమాలు లేని అనధికార ప్రదేశాల్లో(informal) వేసుకునేవి అని రెండు భేదాలు ఉన్నాయి ఇందులో.

అంటే మొదటి రకం ఆఫీసు మీటింగుకి, పెద్దవారితో మాట్లాడటానికి,సభల్లో, ఇంకేదో ముఖ్యమైన వ్యక్తులుండే చోట, వేసే సూట్ బూట్ లన్న మాట. ఇక రెండో రకం పార్టీలకి, బయట స్నేహితులు,ఫంక్షన్ లు, షాపింగు ,ఊర మాస్ తిరుగుడు లన్నిటికీ పనికొచ్చేవి.

ఇందులో అన్నిటిని గురించి చెప్పను కాని కొన్నిటిని ప్రస్తావిస్తా.

లాంఛన/అధికారిక రకాలు :

(శిల్ప అహుజా చిత్రం)

మొదటిది డెర్బీ(Derby) బూట్ : ఇది సంప్రదాయ యూరోప్ రకం. ప్రధానంగా ఇందులో కనిపించేది బూట్ కి రెండుపక్కల రెక్కలులా ఉండే రెండు లేసులు కట్టుకునే ఐలెట్(eyelet) లను, వేంపు(vamp) అనే మధ్యన ఉండే భాగం పైన కుడతారు. దీన్నే ఓపెన్ లేస్(open lace) పద్ధతి అంటారు.

(pininterest చిత్రం)

ఆక్స్ ఫర్డ్(Oxford): ఇందులో పైన చెప్పినట్టు కాకుండా దానికి వ్యతిరేకంగా వేంపు కింద ఐలెట్ ఉంటాయి. అంటే ఇందులో ఐలెట్ లు కనిపించవు.బూట్ మొత్తం అటుక్కున్నట్టు ఉండిపోతుంది. పైవి రెండు తోలుతో చేసినవే.

(difference between info image)

బ్రోగ్ (Brogue): గట్టి తోలు ముక్కల్ని అతికినట్టు ఉండే ఈ రకం బూట్ లని గుర్తు పట్టే లక్షణం.చిన్న చిన్న రంధ్రాలు. బూట్ వేసుకున్నప్పుడు పేంటు మినహా కనిపించే భాగం లో రకరకాల ఆకృతుల్లో ఉండే గుండు సూది అంత రంధ్రాలు ఉంటాయి. దీన్లో మళ్ళీ నాలుగైదు రకాలున్నా వాటి జోలికి పోను.

(purfe dot com au image)

మాంక్ (Monk); ఈ రకం జోళ్ళ లో లేసులు ఉండవు.దాని బదులు స్ట్రాప్ లు ఉంటాయి. వీటిలో రెండు స్ట్రాప్ లుంటే డబల్ మాంక్ అంటారు. వీటిని కూడా చర్మం తోనే చేస్తారు.

(pinterest image)

బోట్(Boat) : కేన్వాస్ కానే చర్మం తో కాని చేసిన ఈ జోళ్లు పడవల్లో వాడటానికి చేసే వారట. తడి గా ఉండే పడవల్లో జారకుండా ఉండేందుకు మడమల్లో గాట్లు పెట్టి రక్షణ గా తయారు చేసేవారట. వీటిని సాక్సులు లేకుండా వాడతారు.

ఇవి కాకుండా డెసర్ట్ బూట్ లు,చెల్సియా (మడమ జోళ్లు ) ఇలా చాల రకాలే ఉన్నాయి.

ఇక అన్ని చోట్ల వాడే అనిర్ణీత/అనధికార ( informal) రకాలు:

flipflop(dreamstime image)

ఫ్లిప్ ఫ్లాప్ (flipflop): ఇవి మన బాత్‌రూం చెప్పులు. ప్లాస్టిక్ తో చేసి బొటన వేలు రెండోవేలు మధ్యన తాడు లాంటిది ఉండే “V’ ఆకారపు స్ట్రాప్ రకం అన్నమాట. వీటికి” ఈజిప్ట్ ,ఇంకా(INCA)” కాలపు చరిత్ర ఉందట. ప్రధానంగా ఇవి ఆరు బయట,బీచుల్లో పార్కుల్లో వాడటానికి పనికొస్తాయి. (మనదేశం లో తప్ప).చాలా చవకైనవి. వీటికి సాధారణంగా ఎత్తు మడమ(heel) ఉండదు.

(flipflop daily ఇమేజ్)

స్లిప్పర్స్(Slippers): మనం ఈ పేరుతో పై వాటిని పిలిచి కన్ఫ్యూజ్ అయినా, ఇవి మనం అనుకునేవి కావు. ఇవి కేవలం ఇంటి లోపల వాడేందుకు చేసినవి.ఎక్కువగా గుడ్డతో చేస్తారు. కింద సోల్ చాలా సున్నితంగా ఉండి, పదునైన వస్తువు గుచ్చుకుంటే రక్షణ ఇవ్వదు కనక బయట వాడరు. కాలుకు హత్తుకుని ఉండేట్లు ఉంటుంది.సులభంగా కాలు దూర్చటానికి అనువైన గూడు లాంటి ముందు భాగం వీటిలో ఉంటుంది.

(అమెజాన్ స్లిప్పర్ చిత్రం )

శాండల్ (Sandal) : ఇందులో కూడా ఎన్నో రకాలున్నా ప్రధానంగా ఉండే మార్పు స్ట్రాప్ లు. ఇవి సాధారణంగా వెనుక మడమ భాగం లోనే ఉంటాయి.కొన్నిటిలో ముందు కూడా ఉండవచ్చు. స్ట్రాప్ లు క్లిప్ లాగానూ, ప్లాస్టిక్ తో అతుక్కు పోయే రకమూ ఉంటుంది.

స్నీకర్ (sneaker): ఇవి రబ్బర్ గాని సింథటిక్ /కాన్వాస్ తో గాని చేసే జోళ్లు. చెప్పు అడుగట్ట (sole),వంగగల వంపు ఉన్న పదార్ధం తో చేస్తారు. జోడు మడమ వరకు వచ్చేవి ,రానివి కూడా ఉంటాయి. ముఖ్యమైన లక్షణం లేసులు ఉండటం.ఇవి అన్ని సార్లు కట్టుకునేవే కాకుండా పెద్దవిగా ఆకర్షణ కోసమూ ఉండవచ్చు. పాదాలకు అన్ని వేపులా మంచి రక్షణ ఉంటుంది.

(ఫ్లిప్కర్ట్ చిత్రం-స్నీకర్)

లోఫర్(Loafer): వినటానికి తిట్టులా ఉన్న మంచి ఫేషన్ జోళ్ళు ఇవి. తోలు తో ,కేన్వాసు తో చేస్తారు. చెప్పు అడుగట్ట (sole) సమతలం గా ఉంటుంది.నెలకు అంటుకు పోయినట్టు ఉంటాయి. లేసులే ఉండవు.కాలుని అంతగా కప్పి ఉంచవు. కాలు దూర్చి తోడుక్కోవటమే (slip on type).

(ఇండియామార్ట్ చిత్రం-లోఫర్)

మొకాసిన్(moccasin): ఇవికూడా దూర్చి తోడుక్కునేవే. కేన్వాస్.తోలు , గుడ్డ లతో తయారయ్యే ఈ జోళ్ల లో లేసులు ఉన్న అవి కేవలం అలంకార ప్రాయమే. అయితే వీటిలో అడుగట్ట ఉండి ఉండనట్టు అనిపిస్తుంది. జోడు అంతా కుట్లు,అలంకరణ తో ఉంటుంది.

(seo org వారి వుడ్లాండ్ మోకాసిన్)


No comments: