Adsense

Saturday, December 28, 2024

ఒక సెకెండ్ హ్యాండ్ ఫ్లాట్ (Flat) కొనేటప్పుడు, మనం పరిశీలించుకోవాల్సిన, తెలుసుకోవలసిన విషయాలు

  • మొదటిగా మీకు ఫ్లాట్ అమ్ముతున్న యజమాని యొక్క దస్తావేజులు అలాగే 13 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించాలి( గడచిన 13 సంవత్సరాల లో అమ్మిన వారు, కొన్న వారి పేర్లు సరిపోయాయా లేదా, మొత్తం ఆస్తి విస్తీర్ణం, అవిభాజ్య విస్తీర్ణం సరిపోయా లేదా, మొదటి నుండి చివరి డాక్యుమెంట్స్ లో సర్వే నంబర్స్ ఒకటే ఉందా లేదా, మొత్తం స్థలం హద్దులు, ఫ్లాట్ హద్దులు సరిపోయాయ లేదా అలాగే క్రయధనం పూర్తి గా అమ్ముతున్నవారికి పూర్తి గా ముట్టినట్టు ధృవీకరించారా లేదా, ఆస్తి స్వాధీన పరుస్తున్నట్టు వ్రాసారా లేదా చూసుకోండి).
  • మీ అమ్మకం దారు దస్తావేజు ఒరిజినల్ చుపించమనండి. దాని నకలు రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి పొందండి. ఒరిజినల్, నకలు పోల్చి సరిచూసుకోండి.
  • ఆస్తి పన్ను కరెంట్ బిల్ అమ్ముతున్న వారి పేరు మీద ఉన్నాడా లేదా చూసుకోండి.
  • బిల్డింగ్ ప్లాన్ ప్రకారం కట్టరా లేదా ఒక వేళ అతిక్రమించి కడితే దానిని BPS లో రెగ్యులర్జేషన్ జరిగిందా లేదా, అకుపేషన్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా
  • ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ లో ఆ ఆస్తి గురించి వాకబు చెయ్యండి. అలాగే అసోసియేషన్ కి అమ్ముతున్న ఆయన పేరు అసోసియేషన్ కి ఏటువంటి బాకీలు లేవు అని ఒక నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోండి.
  • కార్ పార్కింగ్ గురించి మీ దస్తావేజు లో వ్రాస్తే క్లియర్ పార్కింగ్ లాట్ లో ఫ్లాట్ నంబర్ వ్రాసారో లేదో చూసుకోండి.
  • కోన బోయే ఆస్తి మీద ఏమి లోన్లు లేవు అని నిర్ధారించుకోండి. దాని కోసం ఒక EC తీసుకోండి.
  • మీకు అమ్మకానికి పెట్టిన ఆస్తి వేరే వాళ్లకు అమ్మకని పెట్టి, వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని మళ్లీ మీకు అమ్మకానికి పెట్టలేదు అని నిర్ధారించుకోండి.
  • దీనికి బాగా అమ్మకం గలిగిన న్యూస్ పేపర్ లో ఒక ప్రకటన ఇవ్వండి. ఫలానా ఆస్తి ఫలానా వారి వద్ద నుండి కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పమని ఒక న్యాయవాది ద్వారా ప్రకటన ఇప్పించండి.ఇలాగా మీరు వ్రాసుకొని క్రయ అగ్రిమెంట్ లో డిఫాల్ట్ క్లాజ్ వ్రాసుకోండి. (పేపర్ ప్రకటన ఇస్తామని, ఎవరి దగ్గరనుండి అభ్యంతరాలు రాక పోతే రిజిస్ట్రేషన్ కి వెడతాము అని ఒక వేళ ఎవరి వైపు నుండి అయిన అభ్యంతరం వస్తె ఆ అగ్రిమెంట్ రద్దు అవుతుంది అని అలాగే మీరు అడ్వాన్స్ ఇచ్చిన రొక్ఖం వడ్డీ తో సహా వెనక్కి ఇవ్వాలి అని).
  • అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ లో యే ఆస్తి కొనుగోలు చెయ్యాలి అనుకున్నారో ఆ ఆస్తి ఉన్న భూమిమీద ఏటువంటి లాండ్ అక్వి జే సున్ లేవు అని నిర్ధారించుకోండి.
  • కొనబోయే ఆస్తి మైనర్ పేరుమీదుగా లేకుండా చూసుకోండి.

No comments: