చెరువులు, కొలనులలో కనువిందు చేసే తామర పువ్వులు ఫలదీకరణం చెంది కాయలుగా మారతాయి. ఈ కాయలలో గింజలు బలవర్థకమైన ఆహారంగా, ఔషధాలు గా వాడుతారు. చిత్రంలో కనబడే కాయల నుండి ఆకుపచ్చ మందమైన పైపొరతో ఒక్కొక్క కాయ నుండి 6 నుండి 10 ఆపైన గింజలు వస్తాయి. పై పొరను ఒలిచిన తర్వాత తెల్లని గింజల పప్పు తీస్తారు. ఈ పప్పును పచ్చిగా గాని, వండుకొని గాని తింటారు. బాగా ముదిరి, ఎండిపోయిన కాయల నుండి నల్లని ఎండు గింజలు వస్తాయి. వాటిని వేయించి పైపొర తీసేస్తే తామర గింజల పేలాలు (Phool Makhana) తయారవుతాయి. ఇవి బజార్లో మనకు విరివిగా దొరుకుతున్నాయి.
ఇక తామర గింజలు ఏ రూపంలో వున్నా పూర్తిగా పోషకాలతో నిండి వుంటాయి. రక్తశుద్ధికి, రక్తపోటు తగ్గడానికి, జీర్ణ శక్తి పెంపొందించడానికి, కండరాల పుష్టికి ఇవి దోహదపడతాయి.
(చిత్ర రచన గూగుల్ సహకారంతో) (సేకరణ)
No comments:
Post a Comment