లాభాలేవింటంటే:
1. మీ ఫ్లాట్ లోనికి గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, మీకు అడ్డుగా మరొక అపార్ట్మెంట్ ఉంటే తప్పితే.
2. మీరు ఇష్టపడే ఏరియాలో మీరు ఫ్లాట్ తీసుకో గలుగు తున్నారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే సాధ్యమైనంతవరకు ఎవరైనా బలీయమైన కారణం ఉంటే తప్పTop Floor కి వెళ్ళరు. నేను తప్పు కావచ్చును.
ఇక ఇబ్బందుల విషయానికొస్తే:
1. మీరు వేసవికాలంలో ఫాల్స్ సీలింగ్ చేయించినప్పటికీ కొంత వేడి ఎక్కువగా మీ ఫ్లాట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే చలికాలంలో చలి.
2. ఒక్కో సందర్భంలో కరెంటు లేనప్పుడు జనరేటర్ కూడా మొరాయించవచ్చు. అప్పుడు మీరు లిఫ్ట్ వాడడానికి అవకాశం లేక 5వ అంతస్తులోని మీ ఫ్లాట్ కి చేరుకోవడానికి ఇబ్బంది పడతారు. పెద్దవారికి అయితే ఇంకా కష్టం.
3. మరో విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇలా జరిగినవి నాకు తెలుసు. ఒక్కొక్కసారి,అన్నిచోట్ల కాకపోయినా కొన్ని పట్టణాలు, మహానగరాల్లో అనుమతి వచ్చింది నాలుగు అంతస్తులకైతే, 5వ అంతస్తు అనధికారికంగా కట్టేసి అమ్ముతారు. అటువంటి బాపతు కాదు అని అనుమతులన్నీ బాగా పరిశీలించి ధృవీకరించుకోండి. అది చాలా గిరాకీ ఉన్న ప్రాంతం అయినప్పుడు, ఇటువంటివి జరుగుతాయి. తర్వాతి కాలంలో అపరాధరుసుం కట్టించుకుని క్రమబథ్థీకరిస్తారులే లేదా మనం చేయించుకోగలంలే అనే ధీమాతో కొందరు కొంటారు.
నాకు తెలిసి వ్యాపార కూడలి చెన్నై టీనగర్ లోని పాండీబజారులో బిగ్ బజార్ ఉన్న బిల్డింగ్ మొదటి మూడు నాలుగు అంతస్తులు మాత్రమే వాడుతున్నారు. పైన కట్టిన మరో మూడు నాలుగు అంతస్తులు ఖాళీగానే ఉన్నాయి గత 15-20 ఏళ్ళుగా. కార్పొరేషన్ వారు ధ్వంసం చేయరు; యజమానులు అద్దెకు ఇవ్వలేరు. కోర్టులో వుందేమో……. "మృత మూలధనం". డెడ్ క్యాపిటల్...
No comments:
Post a Comment