ఒకప్పుడు లైసెన్సు లేకుండా సైకిల్ తొక్కడానికి లేదు. పంచాయతీలు, పురపాలక సంఘాలు లైసెన్సు సొమ్ము వసూలు చేసి, గుండ్రటి రేకు బిళ్ల ఇచ్చేవారు. దాన్ని వెనుక బ్రేకు కింద అమర్చే వాళ్ళం. లైసెన్సు ఎగ్గొట్టేవారి కోసం గ్రామాలు, పట్టణాల పొలిమేరల్లో పంచాయతీ, పురపాలక సిబ్బంది తనిఖీలు చేసి, అక్కడికక్కడే సొమ్ము వసూలు చేసేవారు. లైసెన్సు ఒక ఏడాదికే పరిమితం. తనిఖీల సమయంలో సొమ్ము లేకపోతే, వేరే మార్గంలో గమ్యానికి వెళ్ళేవారు. అప్పట్లో ఇంటి పన్నుల తర్వాత ఈ లైసెన్సు ఆదాయం ప్రధాన వనరుగా వుండేది.
No comments:
Post a Comment