మీలో ఎంతమందికి ఈ క్వాలిటీస్ వున్నాయో చూసుకోండి.
1. ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు మిమ్మల్ని మీరు మార్చుకోవాలని గ్రహించడం.
2. తోటి వారిని విమర్శించకుండా వారు ఉన్నట్లుగానే వారిని అంగీకరించడం.
3. “ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో తాము సరైనవారని” అనుకుంటారు అని అర్థం చేసుకోవడం.
4. ఎలాంటి పరిస్తితులు ఎదురైనా తట్టుకుని నిలబడడం.
5. ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినా తోటి వారితో సంబందాలు కలిగి వుండటం.
6. ఎవ్వరి నుండి ఏదీ ఆశించకుండా వారిని ప్రేమించడం.
7. మీరు చేసే పనులు మీ ఆనందం, సంతృప్తి కోసమే అని అర్థం చేసుకోవడం.
8. మీరే తెలివైన వారని ప్రపంచానికి నిరూపించే ప్రయత్నాన్ని ఆపడం.
9. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయ్యడం.
10. మీలో మీరు ప్రశాంతంగా ఉండటం.
11. అవసరాలు మరియు కోరికల మధ్య తేడాని అర్థం చేసుకోవడం.
12. మీ కోరికలను అదుపులో వుంచుకోవడం.
13. మీ వైపు తప్పు వున్నప్పుడు ఎదుటివారు ఎవరైనా వెంటనే క్షమాపణ కోరడం.
14. తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును ఎట్టి పరిస్తితిలోనూ మళ్ళీ తిరిగి చెయ్యకపోవడం.
(సేకరణ)
No comments:
Post a Comment