రైలు పయనము ఎల్లప్పుడూ గుర్తుండిపోయే అనుభవము, రైలులోన ఉన్నంతవరకు వేరే లోకములో ఉన్నటుండును. ఎవరైనా సరే కిటికి ప్రక్కకే కూర్చోవలెను అని కోరుకుందురు. ఇంత మంచి రైలు పయనము ఆకర్షించే ప్రకృతి చోటుల మద్య వెళితే ఎంత అబ్బురముగా ఉండును కదా. అటువంటి తప్పక చూడదగిన రైలు మార్గముల గురించి వ్రాయబోదును.
- అరకు లోయ రైలు మార్గము (విశాఖపట్టణము నుండి అరకు వరకు) - అబ్బురపరిచే తేయాకు (టీ) తోటలు, జలపాతాలు, లోయలు, గుహలు కనులకు కనువిందు చేయును.
- గోదావరి వారధి రైలు మార్గము (రాజమండ్రి నుండి వెళ్ళును) - గోదావరి నది సూర్యోదయము, సుర్యాస్తమయము వేళ అబ్బురముగా ఉండును.
- హిమాలయ రైలు మార్గము (కాల్కా నుండి షిమ్లా వరకు) - ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కొండలు, దేవదారు చెట్టు అడవులు, కనువిందు చేయును.
- డార్జిలింగ్ హిమాలయ రైలు మార్గము (జలపైగురి నుండి డార్జిలింగ్ వరకు) - ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కంచెనజంగా పర్వతము, చిన్ని అడవులు, నగరాలు, తోటల దృశ్యాలు అబ్బురముగా ఉండును.
- నీలగిరి రైలు మార్గము (మేట్టుపాలయం నుండి ఊటి వరకు) - ఇది కూడా ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. పచ్చని ప్రకృతి దృశ్యాలు, అడవి కొండలు, తేయాకు (టీ) తోటలు, జలపాతాలు అబ్బురపరుచును.
- మండోవి రైలు మార్గము (ముంబయి నుండి గోవా వరకు) - అందమైన పశ్చిమ కనుమలు (Western Ghats), అరేబియా సముద్రము కనిపించును.
- వాస్కో డ గామా నుండి లొండా వరకు - అందాల గోవా ఊళ్ళు, పశ్చిమ కనుమల (Western Ghats) జలపాతాలు, పచ్చని కొండలు కనిపించును.
- పాంబన్ వారధి రైలు మార్గము ( పాంబన్ నుండి రామేశ్వరము వరకు) - ఇది భారత దేశములోనే రెండవ అతి పొడవైన వారధి. బంగాళాఖాత సముద్రము మద్య నుండి పోవును.
- ఎడారి రైలు మార్గము (జోధ్పూర్ నుండి జైసల్మేర్ వరకు) - ఎడారిలోని రంగుల మట్టి గుడిసెలు, ఒంటెలు, సూర్యోదయం ఆకట్టుకుండును.
- చిల్కా రైలు మార్గము (భువనేశ్వర్ నుండి బ్రహ్మాపూర్ వరకు) - తూర్పు కనుమలు (Eastern Ghats), చిల్కా ఏరులోని వలస పక్షులు అబ్బురపరుచును.
- కన్యాకుమారి - తిరువనంతపురం - తమిళనాడు కేరళ వాస్తుశిల్పకళ గుడులు, కొబ్బరి తోటలు కనువిందు చేయును.
- కేరళా రైలు మార్గము (ఎర్నాకులం - కొల్లం - తిరువనంతపురం) - వృష్టజలాలు (Backwaters), కొబ్బరి తోటలు, పచ్చని పంటలు వాన పడుతున్నప్పుడు చూచినచో ముగ్ధులవుదురు.
- కాశ్మీర్ రైలు మార్గము ( జమ్మూ నుండి ఉదంపూర్ వరకు), (కాజిగండ్ - శ్రీనగర్ - బారాముల్లా) - అబ్బురపరిచే మంచు కొండలు, లోయలు, నదులు, అడవులు కనిపించును.
- అసోం రైలు మార్గము (గువాహతి - లుమ్డింగ్ - సిల్చూర్) - అందమైన కొండలు, తేయాకు (టీ) తోటలు కనిపించును. తేయాకు తోటల దృశ్యాలు మాత్రముయే కాదు దాని పరిమళము కూడా వెదజల్లును.
అన్వేషకులు (Explorers), ఛాయాచిత్రకారులు (Photographers), పయనాల మీద అభిరుచి ఉన్నవాళ్లు ఈ రైలు మార్గములలో పయనించవలె. చాలా సంతోషంగా, జాగ్రత్తగా ఈ ప్రదేశములను చూచి ముగ్ధులవ్వుము.
(సేకరణ)
No comments:
Post a Comment