Adsense

Tuesday, January 7, 2025

హైదరాబాద్ లో లోను పెట్టి అపార్ట్ మెంట్ కొనడం మంచిదా? లేక ఇల్లు కి కావాల్సిన డబ్బు సంపాదించి కొనడం మంచిదా? లేక Rent కి ఉండం మంచిదా?

హైదరాబాదు నా సొంత ఊరు కాదు, పని కోసమే ఉంటున్నా అనుకుంటే, నాకు తెలిసి ఒక రెండు బెడ్రూం ల ఇల్లు కొనాలి అంటే తక్కువలో తక్కువ 80లక్షలు, అది కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మాత్రమే, అంటే మనకు మిగిలే లాండ్ షేర్ మహా అయితే 200–300చదరపు అడుగులు ఉండొచ్చు, ఆ చిన్న లాండ్ విలువ 15లక్షలు ఉండొచ్చు, మిగిలిన 65లక్షలు కట్టుబడి, టాక్స్, మరియు బిల్డర్ ఆదాయం అనాలి.


ఇపుడు ఇదే 80లక్షల విలువ చేసే ఇల్లు బాడుగకు 20–25వేలు ఉంటుంది, 80లక్షలు మన దగ్గర లేకుండా loan లొ ఇల్లు కొనాలి అంటే పూర్తిగా ఆలోచన మానుకుంటా, ఒకవేళ న దగ్గర పూర్తి డబ్బు ఉంటే ఆ 80లక్షలు బ్యాంకు లో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే, కనీసం 6 శాతం వడ్డీ(ఇప్పుడు 7.1శాతం ఇస్తున్నాయి)

6 శాతం సంవత్సరానికి అంటే, లక్ష కి 6వేలు, 80లక్షలకు 80*6 = 480 వేలు, అంటే 4.8లక్షలు వస్తుంది ఒక సంవత్సరానికి.

మరి నెలకి పంచితే 480/12 = 40వేలు

ఇందులో 20వేలు ఇంటి బాడుగ కట్టేసి, మిగతా 20వెలతో ఏదైనా SIP Leda mutual fund investing plan, adi kooda కాదంటే బంగారు కొనిపెట్టుకుంటా.

ఒక 10సంవత్సరాలు దాటితే

ఇల్లు గనక కొని ఉంటే అందులో కట్టుబడి విలువ ప్రతి ఏడు తగ్గటమే, మీకిచ్చిన 200–300చదరపు అడుగుల విలువ పెరిగితే పెరగొచ్చు కానీ అది చాలా తక్కువ విస్తీర్ణం కనుక రెండింతలు అయినా కూడా మీ కట్టుబడి తరుగుదల సమం చెయ్యలేదు, సరే చేసింది పదేళ్ల తర్వాత మీ అపార్ట్మెంట్ నీ 80లక్షలకు కొనే విలువ ఉంది అనుకుందాం, మీకు ఎం మిగిలింది? మీ డబ్బు మీకు మిగిలింది మహా అయితే, లేదా ఈ మధ్యలో సొంత ఇల్లు కాబట్టి remodelling రెనివేషన్ అంటూ అదనపు ఖర్చు కూడా అయుందొచు.

అదే 80లక్షలు FD చేసి, వచ్చిన వడ్డీతో బాడుగకు ఉంటూ, మిగిలిన 20వెలు దాచి ఉంచితే, మీ 80లక్షల ప్రిన్సిపల్ amount అలాగే వుంటుంది

20,000* 120నెలలు = 2400,000 మీకు అదనపు మిగులు

ఒకవేళ మీరు ఈ మిగులు ను బంగారు మీద పెట్టుబడి పెడితే ఖచ్చితం గా పదేళ్లలో రెండింతలు అవుతుంది(ఇంకా ఎక్కువే కావొచ్చు) అంటే మీ ఆదాయం 48లక్షలు.

పైన చెప్పింది కేవలం పది సంవత్సరాలకే, గుర్తుంచుకోండి.

ఇపుడు బిల్డర్ ల అసలు టార్గెట్ మధ్య తరగతి ఆలోచన గమనిద్దాం, సగం లేదా అంతకంటే తక్కువ డబ్బు, ఉదాహరణకి 30–40లక్షలు డబ్బు ఉండీ, మిగతా లోన్ పెట్టుకుని ఎలాగైనా సొంత ఇంట్లో ఉండాలి అనే మనలాంటి చాలా మంది మధ్య తరగతి వాళ్ళ ఆలోచనే ఈ వ్యాపారానికి ఆధారం.

సగం, అంటే 40లక్షలు ఉంది అనుకుందాం, మిగిలిన 40లక్షలు లోన్ అనుకుందాం.

ఉన్న నలభై లక్షలు కట్టేసి, ఇంకో 40లక్షల లోన్ తీస్కుని ప్రతి నెల సులువుగా కట్టేయ్యోచు అనుకుంటాం, ప్రతినెలా సులువుగా కట్టాలంటే ప్రతినెలా 25ఏళ్ల పాటు ఉద్యోగం చెయ్యాలి కష్టం అయినా అనేది మర్చిపోతాం.

సరే, కొన్నాం, నెలకి బ్యాంక్ కి ఎంతకట్టాలో చూద్దాం, 25సంవత్సరాలు లోన్, 40లక్షలు, 8.5%వడ్డీ అంటే నెలకు 32వేలు కటాలి, నలభై లక్షలు మీ dabbu ఇచ్ినప్పటికీ meeru 32వేలు కడుతారు 25ఏళ్ల పాటు.

మరి 25ఏళ్ల తర్వాత మీ అపార్ట్మెంట్ విలువ ఏమిటి? కూలదోసే ఖర్చులు మీరే పెట్టుకోవాలి.

ఇపుడు అదే 25ఏళ్ళకి, వేరే ఆలోచన చేద్దాం.

మీ దగ్గరున్న 40లక్షలు బ్యాంక్ లో FD chesi,6శాతం వడ్డీ తో, ఆ వడ్డీ నీ మీరు వాడుకోకుందా తిరిగి ప్రిన్సిపల్ లో కలిపితే

నెల 1: 4000000 * 1.005 = 4020000

నెల 2: 4020000 * 1.005 = 4040100

నెల 3: 4040100 * 1.005 = 4060300

……

నెల 300(25 సంవత్సరాలు): 1,25,20,104 - 1 కోటి 25 లక్షలు మీ మిగులు

మరి ఇంటి బాడుగ అంటారా, మీరు లోను తీసుకుంటే 32వేలు కట్టాలి గ, అదే 20బాడుగకు కట్టండి సరిపోతుంది.

ఇక మీరు కడుతూ వచ్చిన బ్యాంక్ లోను 32 వేల సంగతి చూద్దాం, ఈ రోజు ఇల్లు 20వేలకు దొరకవచ్చు, పోను పోను బాడుగలు పెరుగుతాయి కాబట్టి తొలుత లో 12 వెలు మిగిలినా చివరికి అది సరిపోతుంది 45వేళ బాడుగ వరకు. తెలివిగా చేస్తే వచ్చిన ఆ 12వేల మిగులు ను పెంచవచ్చు కానీ బాడుగకు సరిపేట్టేసుకుందాం

ఒకవేళ మీరు FD కాకుండా వేరే పెట్టుబడులతో ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు, FD అయితే నమ్మకమైన ఆదాయం.

చివరగా ఒక మాట

మీరు లోన్ లో ఇల్లు కొంటున్నారు అంటే, మీరు govt ki ఆదాయం(రిజిస్ట్రేషన్ టాక్స్, మున్సిపాలిటీ టాక్స్ సుమారుగా 6–8 లక్షలు) చేకూరుస్తున్నారు, ఆ బిల్డర్ కి పెద్ద మొత్తం లో(15+ లక్షలు) ఆదాయం ఇస్తున్నారు, 25ఏళ్ల పాటు బ్యాంక్ కి ఉచిత ఆదాయం( 50+ లక్షలు) ఇవ్వబోతున్నారు, ఎవరి డబ్బు ఇది? ఇంతమందికి మీ కష్టార్జితం ఇవ్వటం అవసరమా? వీటి కోసం మీ 25 సంవత్సరాల జీవితం(విలువ అనంతం) ఉద్యోగాలకి అంకితం చేయబోతున్నారు, సొంత ఊరిలో కుటుంబం అంతా ఉండటానికి కొనుక్కుంటే సరే, పని మీద వెళ్ళిన ఊరిలో ఇంత అవసరమా? పైగా, ఆ డబ్బుని మీ వూరిలో పెట్టుబడి పెడితే మీ ఊరు కూడా పెరుగుతుంది కదా, భూములు కొనండి, ఇల్లు కట్టండి మీ ఊరిలోనే, అమ్మ అక్క చెల్లి ఉంటే వారికి బంగారు కొనండి. మీ కష్టం మీ విలువ పెంచాలి, వేరే వాళ్ళ ఆదాయం పెంచటానికి మాత్రమే కాకూడదు.

No comments: