థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపో థైరాయిడిజం. ఈ రెండు సమస్యలు మన శరీరంలో థైరాయిడ్ గ్రంధి పనితీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల సంభవిస్తాయి. ఇక వీటి కారణాల విషయానికి వస్తే సాధారణంగా అయోడిన్ లోపం లేదా అధికం వల్లే వచ్చే అవకాశం ఎక్కువ.
హైపో థైరాయిడిజం ముఖ్య కారణాలు:
అయోడిన్ లోపం- థైరాయిడ్ హార్మోన్ తయారుచేయడానికి అయోడిన్ ను ఉపయోగిస్తుంది. ఒకవేళ మన శరీరంలో అయోడిన్ లోపిస్తే అది థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది.
- రకాలు :
థైరాయిడిటిస్- ఇది థైరాయిడ్ గ్రంధి వాపు వల్ల సంభవిస్తుంది. ఈ సమస్య వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్స్ ను తక్కువగా విడుదల చేస్తుంది.
హాషిమోటో థైరాయిడిటిస్- ఇదొక ఆటో ఇమ్మ్యున్ కండిషన్, మన శరీరం లోని కణాలే థైరాయిడ్ ని అటాక్ చేస్తాయి. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.
హైపర్ థైరాయిడిజం ముఖ్య కారణాలు:
అయోడిన్ అధికం-మనం తీసుకునే అయోడిన్ అధికం అయినప్పుడు ఈ సమస్యలు ముఖ్యంగా వస్తాయి, ఇలా అయోడిన్ అధికం అవ్వడానికి మనంతీసుకునే మెడిసిన్ కానీ వేరే ఆహారం కానీ కారణం అవ్వచ్చు.
- రకాలు :
గ్రేవ్స్ వ్యాధి- ఈ సమస్య థైరాయిడ్ గ్రంధి అతిగా యాక్టివ్ గా ఉండి మరీ ఎక్కువగా హార్మోన్స్ ను విడుదల చేసినప్పుడు వస్తుంది.
నోడుల్స్- హైపర్ థైరాయిడిజం సమస్య థైరాయిడ్ లో ఉండే నోడుల్స్ అధికంగా యాక్టివ్ గా ఉన్నపుడు సంభవిస్తుంది.
No comments:
Post a Comment