Adsense

Sunday, February 23, 2025

పూరీలు ఎంత నూనె ను పీల్చుకుంటాయో తెలుసా?

పూరీలు ఎంత నూనె ను పీల్చుకుంటాయో తెలిస్తే అవి ఎంత ఆరోగ్య సమస్యను తీసుకోస్తాయో తెలుస్తుంది. ఒక చిన్న ప్రయోగంలా ఒక సారి 204 గ్రాముల నూనెలో ఆరు పూరీలను వేయించారు. పూరీలు వేయించాక ఆ నూనె బరువు చూస్తె 159 గ్రాములు మిగిలి ఉంది. ఆరు పూరీల కోసం 45 గ్రాముల నూనె అవసరమైంది. అంటే ఒక పూరీ కి ఏడున్నర గ్రాములు. మొత్తం కలిపి క్యాలరీలు 157.5 గ్రాముల వరకు ఉంటుంది.

ఆ క్యాలరీ లు కూడా అనారోగ్యాన్ని ఇచ్చే డీప్ ఫ్రై పద్దతుల్లో వచ్చినవి, చాల వరకు అవి ఫ్యాట్స్. మీరే ఆలోచించాలి.. ఇవి ఎంత అనారోగ్యకరమో! వీటి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనటంలో సందేహమైతే లేదు.. ఎక్కువగా తింటే ఇవే ఊబకాయానికి కారణం అవ్వచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు రాక మానవు.

ఇక బొండాల విషయంలో కూడా ఇదే స్టోరీ.. అవి కూడా నూనెలో వేయించాబడతాయి. అధికంగా తింటే అనారోగ్యాలకు కారణమవుతాయి. రుచి కోసం తినాలనుకుంటే ఎప్పుడో ఒక సారి.. నెలకు ఒకటో రెండో సార్లు తింటే ఎలాంటి అంతగా సమస్యలు రాకపోవచ్చు, కానీ అదే పనిగా రోజూ తినకండి!

No comments: