Adsense

Sunday, March 16, 2025

సాధారణంగా ఒత్తిడిని ఎదుర్కోడానికి మంచి మార్గాలు ఏమిటి?

ఒత్తిడి ఎదుర్కోవడానికి ప్రధాన ఆయుధం సమస్యల పట్ల సానుకూలమైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం మనోనిగ్రహం కలిగి ఉండడం.

  1. యోగ సూత్రం 2.33 సిఫార్సు చేస్తోంది: ప్రతికూల ఆలోచనల వల్ల కలవరపడినప్పుడు, వ్యతిరేక మానసిక వైఖరిని పెంపొందించుకోండి ( వితర్క-బాధనే ప్రతిపక్ష-భవనమ్)

ఉదాహరణకు, విభిన్న వ్యక్తులు ప్రపంచాన్ని ఎలా చూస్తారో వివరించడానికి మేము గాజు సగం నిండిన లేదా సగం ఖాళీగా ఉన్న చిత్రాన్ని ఉపయోగిస్తాము. సామెత గాజు ఒకటే, కానీ ఒక ఆశావాది సమృద్ధి మరియు అవకాశాన్ని చూసే చోట, నిరాశావాది నిరాశకు కారణం చూస్తాడు.

2. అసలు ఒత్తిడి గల కారణాలను గుర్తించండి.

3. బాగా స్ట్రెస్ కు గురి అయినప్పుడు నిటారుగా కూర్చుని, తలను వెనుకకు వాల్సి కళ్ళు మూసుకోండి. మూడుసార్లు దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి.

4. గొప్ప గొప్ప లక్ష్యాలకు బదులుగా అందుకోగలిగిన వాటినే లక్ష్యాలుగా పెట్టుకోండి

5. ఆనందాన్ని ఎక్కడో వెతకాలని వెంపర్లాడటం కన్నా , నీలోనే ఉన్న ఆనందాన్ని వెతుక్కోండి.

6. శరీరము, మనసు సహకరించకపోతే ఒక అంశం పట్ల ముందే "వద్దు" అని నిర్ణయానికి రండి. సామర్థ్యానికి మించి పని చేయడం కూడా ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది

7. పనులను వాయిదా వేసే పద్ధతిని మానుకోండి. ఎప్పటి పనిని అప్పుడు చేయడం ఒత్తిడి కాకుండా ఆపటానికి సహకరిస్తుంది.

8.దిగులు పడుతూ కూర్చోకండి గతకాలం గడిచిపోయింది. కనుక దానిని గురించి దీర్ఘంగా ఆలోచించడం కూడా ఒక కారణం అవుతుంది.

9.తేలీక పాటి వ్యాయామాలు అలవర్చుకోవడం వల్ల వ్యాయామము ఒత్తిడిని దూరం చేస్తుంది

10.మీలో సహజంగా కలిగి ఉద్వేగాలు, కోపం, బాధ లాంటి భావోద్వేగాలను అణచివేసి ఉంచకండి. అవసరమైన అంతవరకు దానిని వ్యక్తం చేయడం మంచిది . అణచివేత ఒత్తిడిని రెట్టింపు చేస్తుంది

మీరు పీల్చే గాలిపై సర్గ పెట్టండి దీర్ఘముగా శ్వాస తీసుకోవడం మరిచిపోవద్దు

11.అప్పుడప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం, వంట చేయడం, గదినీ శుభ్రపరచుకోవటం లాంటి పనులలో నీమగ్నం కండి.

12.ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఎవరూ చూడని విధంగా మీరు ఒకరే డాన్స్ చేయండి.

13.ఎక్కువగా ఆశించటం! మరిన్ని బాధలకు కారణం అవుతుంది. ఉన్నదానితో తృప్తి పడడం లాంటి తత్వం మిమల్ని తక్కువ ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.

13.అనవసరంగా డాంబికాలకు పోవటం, అన్ని తెచ్చి మీద పెట్టుకోవటం, అదే గాలికి పోయే కంప ను తెచ్చి తగిలించు కోవటం వల్ల లేని కష్టాలు మూట కట్టు కోవటం అవుతుంది.

14. వైఫల్యాలు జీవితంలో సహజమే వాటిని మరిచిపోండి.

15.మా అమ్మ చెప్పినట్లు ఒత్తిడిగా, బాధ గా అనిపించిన వెంటనే తల స్నానం చేస్తే కూడా ప్రశాంతితో వస్తుంది.

16.కళ్ళు మూసుకొని శాంతంగా నిద్రపోండి. నిద్ర కూడా తగ్గించే కారకమని మర్చిపోవద్దు.

కొన్నిసార్లు ఒత్తిడి కూడా వరమని గ్రహించండి. ఒత్తిడి వల్లే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ✍️

(వివిధ పుస్తకాలు చదివి జీవితంలో సాధించిన అనుభవాల వల్ల రాయడం జరిగింది)

దీనిలోని బొమ్మ గూగుల్ లో నుంచి పెట్టుకోవడం జరిగింది.

No comments: