కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు.
ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం అని తేడా లేకుండా చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. ధర కూడా అందుబాటులో ఉండి ఆరోగ్యానికి చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చెరుకు రసం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరగడంతోపాటు ఎలాంటి వ్యాధులు దరి చేరవని, ప్రతి ఒక్కరు క్రమంగా చెరుకు రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
చెరుకు రసం వల్ల ఉపయోగాలు..
- చెరుకు రసంతో అలసట తీరడమే కాకుండా సమస్యలు నివారిస్తుంది.
- రక్తంలో చక్కర శాతం తగ్గి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు చెరుకు రసం తాగుతే ఉపశమనం పొందవచ్చు.
- ప్రతినిత్యం గ్లాసు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
- కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే జీర్ణశక్తి సులువుగా అవుతుంది.
- చెరుకు రసంలో ఉత్తమ రకం లోహం లభ్యమవుతుంది.
- చెరుకు రసంలో అల్లం కలిపి తాగితే గొంతు గరగర నుంచి ఉపశమనం పొందవచ్చు.
- పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులు రసం తాగితే ఎంతో మేలు కామెర్లను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.
- విటమిన్ బి ఉన్నందున దీన్ని సర్వ శ్రేష్టమైన సరువు టానిక్ అని అంటారు.
- వాంతులు జరిగినప్పుడు దీని తాగితే సమస్యలు నివారిస్తుంది.
No comments:
Post a Comment