Adsense

Friday, March 14, 2025

చైత్ర నవరాత్రులు లేదా రామ నవరాత్రులు

చైత్ర నవరాత్రులు లేదా రామ నవరాత్రులు..ఈ నెల మార్చ్ 30న నుంచి మొదలై ఏప్రిల్ 7తో ముగుస్తున్నాయి..(మనం ఎపుడు,,నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు గడవాలి ఆ తర్వాత పదవరోజు ఉదయాన్నే ఉద్వాసన చెప్పుకుంటాం) కానీ ఆరో తారీకు నవమి
ఏడవ తారీకు ఉదయం కాలం దశమి ఉంటుంది, తిధుల ప్రకారం గా చూసుకుంటే తొమ్మిది రాత్రులు గడవాలి,,కానీ సోమవారం సాయంత్రం తో నవరాత్రి ఘడియలు ముగుస్తున్నాయి అందుకని,,మనం సోమవారం అంటే ఏడో తారీకు నవరాత్రి 9వ రోజునే మధ్యాహ్నం అమ్మకి మహా నైవేద్యం పెట్టుకొని సాయంత్రం ఉద్వాసన చెప్పుకోవచ్చు లేదు అనుకున్న వాళ్లు మంగళవారం కూడా ఉంచుకొని బుధవారం ఉదయం ఉద్వాసన చెప్పుకోవచ్చు..

తర్వాత అమ్మవారి యొక్క కలశ స్థాపన విషయానికి వచ్చినట్లయితే ఆదివారం ఉగాది అంటే 30వ తారీకు ఉదయకాలం అంటే చక్కగా 5:45 నిమిషాల నుంచి ఆరు,6:30 ప్రాంతంలో చేయాలి,, ఎందుకంటే ఇది వసంత మాసం కోయిలలు కుసేవేళ,,ప్రకృతి పరవశించే వేల,,సూర్యోదయం అవుతున్న వేల కలశ స్థాపన చేయమని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి,,కాబట్టి ఆ సమయంలో చేసుకోండి..

నైవేద్యం చలిమిడి పానకం వడపప్పు,,మీకు కుదిరితే నవరాత్రులు మొదటి రోజే అమ్మ దగ్గర చీర గాజులు పువ్వులు అవి పెట్టుకోండి రోజుకి పుష్పాన్ని మార్చుకోండి,,9వ రోజు ఉద్వాసన అయ్యాక ఆ చీరని మీ శ్రీవారి పాదపద్మాలకు నమస్కరించుకుని,,మీ శ్రీవారి చేతుల మీద మీరు తీసుకోండి(దక్షిణం పెట్టమని చెప్పడం మర్చిపోకండి☺️) (కొంతమంది ఎవరికైనా ఇవ్వచ్చా అని కూడా అడుగుతున్నారు నిజానికి తీసుకునే వ్యక్తికి ఆ అర్హత ఉంటేనే ఇవ్వండి ఎందుకంటే మీరు తొమ్మిది రోజులు నవరాత్రి పూజ శక్తిని వాళ్ళకి దార పోస్తున్నట్టు..)

సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రి చైత్రమాసం నవరాత్రి మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా చేసుకోవచ్చు అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని లలితా సహస్రనామం, సూర్యాష్టకం ఇంకా మీ వీలును బట్టి అని చదువుకోవచ్చు,, బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు రెండు పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి..

మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలసస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు..అంతేకాకుండా బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు ఇంట్లో వండకూడదు,,తొమ్మిది రోజులు చిరనే ధరించాలి,,చాప వేసుకుని నేల మీద పడుకోవాలి( మీ ఆరోగ్య రిత్యా చూసుకోండి) తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి,,అతిగా తినకూడదు సాత్వికంగా మీ ఆరోగ్యం బట్టి భుజించండి (ఉపవాసం  చేసేవాళ్లు చేసుకోండి) రోజుకి తలంట స్నానం చేయాలా అంటే మీ ఆరోగ్య రీత్యా చూసి చేసుకోండి,,కానీ మొదటి రోజు తప్పకుండా చేసుకోండి రెండు రోజులకు ఒకసారి అన్నా సరే మీరు తలంటు స్నానం చేసుకోవచ్చు.. స్నానం చేసే నీళ్లల్లో పసుపు కలుపుకోండి,,ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారి వలే అలంకరణ చేసుకోండి,,అమ్మ ఎంతో ప్రీతి చెందుతుంది,,ఎరుపే ప్రధానం.

మీ దగ్గర లలితమ్మ వారి పటం ఉంటే పెట్టుకుని అమ్మకి మీ పూజను అందించండి,,ఒకవేళ లలితమ్మ ఫోటో లేకపోతే మీ ఇంట్లో ఏ అమ్మవారి ఉంటారో ఆ అమ్మవారిని పెట్టి పూజ చేసుకోండి అది కూడా కుదరకపోతే కలశంలోకి అమ్మని పిలుచుకొని సంతోషంగా మీ పూజను అందించుకోవచ్చు..

ఒకవేళ పూజలో అఖండ జ్యోతి కొండెక్కిపోతే స్నానం చేసి మళ్లీ చక్కగా జ్యోతిని వెలిగించుకోండి,,ఒకవేళ పూజ మధ్యలో నెలసరి వస్తే ఆ నాలుగు రోజులు పూజ మీ ఇంట్లో మీ భర్త పిల్లలు ఎవరో ఒకరు సమయానికి దీపం పెట్టి పళ్ళు నైవేద్యం కింద అమ్మకి సమర్పించుకోవచ్చు..

తొమ్మిది రోజులు అమ్మకి నైవేద్యం ఉదయం పూజలో పానకం,చలిమిడి,వడపప్పు సమర్పించుకోవాలి..సాయంత్రం పూజలో పళ్ళు లేదు అనుకుంటే మీరు మీ చేతులతో ఏదన్నా సరే వండి అమ్మకి సమర్పించుకోవచ్చు..అమ్మకి నిత్యం ఒకటే మాట చెప్పండి నాపై దయతో చూడు తల్లి అని చెప్పి తెలిసి తెలియక ఏమన్నా తప్పులుంటే పూజలో క్షమించు తల్లి అని కూడా చెప్పుకుంటూ ఉండండి..అంతేకాదు ఈ కలిపురుషుడు ప్రభావంతో దేశం అతలాకుతలం అయిపోతుంది,,నువ్వే ఎలా అన్న మా అందరిని కాపాడమ్మా అని మరిచిపోకుండా చెప్పండి..

మీకు నచ్చినవన్నీ చదువుకోవచ్చు కుంకుమ పూజ చేసుకోవచ్చు, పుష్పర్చిన చేసుకోవచ్చు కానీ ఏం చేసినా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసుకోండి,,ముందుగా మిమ్మల్ని మార్చమని అమ్మని ప్రాధేయపడింది..

దేవీ నవరాత్రులు అంటే నవదుర్గలగా అమ్మని పూజించుకుంటాం కానీ లలితా నవరాత్రులకి సప్తమాతృకల రూపంలో అమ్మని పూజించుకోవాలి..

మొదటి రోజు పాడ్యమి స్త్రీ రూపంలో బ్రహ్మణి పురుష రూపంలో బ్రహ్మ
రెండవ రోజు విదియ ఇంద్రాణి,ఇంద్రుడు మూడోవ రోజు తదియ కౌమారి.కుమారస్వామి
నాల్గోవ రోజు చవిత వైష్ణవి,విష్ణువు
ఐదోవ రోజు పంచమి వారాహి, వారాహ
ఆరోవ రోజు షష్టి మహేశ్వరి,శివుడు
ఏడోవ రోజు సప్తమి చాముండి,చండేశ్వరుడు
ఎనిమిదోవ రోజు అష్టమి దుర్గ కాళీ
తొమిదోవ రోజు నవమి శ్రీ లలితాదేవి
అలంకారాలు వస్త్రము ప్రసాదము పుష్పాలు బ్రహ్మీ తెలుపు వస్త్రం పాయసాన్నం తెల్లని పుష్పాలు ఇందిరాని,ఎరుపు వస్త్రం చిత్రన్నము, చిత్రవర్ణం పుష్పాలు కౌమారి బంతి పువ్వు రంగు (ఆరంజ్) సెనగలు ఎర్రని పుష్పాలు వైష్ణవి గంధమురంగు చక్కెర పొంగలి జాజి పుష్పాలు వారాహి పసుపు రంగు వేరుశనగలతో చేసిన ప్రసాదం మందార పుష్పాలు మహేశ్వరి పచ్చ,ఎరుపు రంగు ఉండ్రాలు శంఖపుష్పములు చాముండి నీలం రంగు పాయసం గులాబీ పూలు
దుర్గాదేవి ఎరుపు,పసుపు రంగు గారెలు పసుపు పుష్పాలు చామంతులు లలితాదేవి గులాబీ ఎరుపు రంగు ఉండ్రాలు శంఖపుష్పములు చాముండి నీలం రంగు పాయసం గులాబీ పూలు
దుర్గాదేవి ఎరుపు,పసుపు రంగు గారెలు పసుపు పుష్పాలు చామంతులు లలితాదేవి గులాబీ రంగు క్షీరఅన్నం గన్నేరు పుష్పాలు..

నేను అందరి కోసం పెడుతున్న పోస్ట్ ఇది కాబట్టి మీరు ఏ విధంగా పూజించగలరో ఆ విధంగా పూజను చేసుకోండి..

ఇవి మహా అద్భుతమైన నవరాత్రులు దేవదేవుల సైతం అమ్మ కోసం పూజించే సమయం ఇది లలితా నవరాత్రుల్లో అమ్మ ఎక్కువ ధ్యానంలో ఉంటుంది కాబట్టి మీకు ఎంత కుదిరితే అంత సమయం జపం చేసుకోండి మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రాన్ని చెప్పుకోండి లేని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపం చేసుకోండి..

శ్రీ మాత్రే నమః..✍️




No comments: