"కార్నీవోర్ డైట్"అనేది కేవలం జంతు ఆధారిత ఆహారాలను మాత్రమే తినే ఒక ప్రత్యేక ఆహార పద్ధతి.
🌀🌀 "కార్నీవోర్ డైట్" లోని ముఖ్యమైన అంశాలు….
🔹 అనుమతించబడిన ఆహారాలు… మాంసం, బీఫ్, చికెన్, పోర్క్, మటన్. చేప, గుడ్లు, పాలు ఉత్పత్తులు కొంతమంది వీటిని నివారిస్తారు.
🔹 నిషేధించబడిన ఆహారాలు…. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్ మరియు విత్తనాలు
🔹 లక్ష్యాలు…. బరువు తగ్గడం, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం, ఆటో-ఇమ్యూన్ పరిస్థితులను మెరుగుపరచడం
🔹 సవాళ్లు… పోషకాల లోపం, ఫైబర్ లేకపోవడం, హృద్రోగ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రభావాలపై పరిశోధన తక్కువగా ఉంది
⁉️ ⁉️ ఇది శాస్త్రీయంగా ఎంతవరకు సమర్ధనీయము ?
కార్నివోర్ డైట్ గురించి శాస్త్రీయంగా చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి. అందువల్ల, దీని గురించి నిర్ధారణకు రావడం కష్టం.
🍳 కొన్ని అధ్యయనాలు మరియు సర్వేలు… ఈ డైట్‌లో ఉన్న వ్యక్తులు స్థూలకాయం, మధుమేహం మరియు మానసిక ఆరోగ్యం జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు మరియు కీళ్ల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతారు.
🍳 విమర్శకులు… ఈ ఆహారం కొన్ని పోషకాల లోపానికి కారణం కావచ్చు. ముఖ్యంగా, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఈ పోషకాల లోపం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని భావిస్తారు.
🌟🌟 ఏ వయసు వారైనా దీనిని చేయవచ్చునా ?
🌟 కార్నివోర్ డైట్ చేయ కూడని వారు….
🔸 పిల్లలు …. వేగంగా పెరుగుతున్న శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోవచ్చు. సమతుల్య ఆహారం అవసరం, కాబట్టి సాధారణంగా సిఫార్సు చేయబడదు
🔸 గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు…. వీరికి అదనపు పోషకాలు అవసరం రావచ్చు. ఫోలిక్ ఆసిడ్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లోపించే ప్రమాదం
🔸 వృద్ధులు… వీరికి కూడా పోషకాల లోపం ప్రమాదం ఎక్కువ. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం లభ్యత తక్కువ కావచ్చు
🔸 దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు…. కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరం కావచ్చు.
🌟 కార్నివోర్ డైట్ చేయ వలసిన కొన్ని పరిస్థితులు…
🔸 ఆటోఇమ్యూన్ వ్యాధులు… రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, లుపస్, క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైటిస్.
🔸 మానసిక ఆరోగ్య పరిస్థితులు… తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్
🔸 మెటబాలిక్ సిండ్రోమ్…. టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్
🔸 ఇతర ఆరోగ్య సమస్యలకు…. స్థూలకాయం మరియు బరువు నియంత్రణ, Irritable Bowel Syndrome, మైగ్రేన్ తలనొప్పులు, ఎక్జిమా, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలకు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, దీర్ఘకాలిక అలసట సిండ్రోమ్,
🔅🔅 స్వీయ అనుభవం…. ప్రశ్నించిన మిత్రుడు ప్రసన్న కుమార్ నిదురం కోసం నా స్వగతం. ఇంటర్ని టెంట్ ఫాస్టింగ్ తో కలిపి అమ్మివోర్ డైట్ను నేను మూడు నెలలు అనుసరించాను. పాలు మరియు పాల ఉత్పత్తులను నిషేదించాను. సిట్రస్ ప్రూట్స్ వినియోగం పెంచాను. ఎత్తుకు తగిన నార్మల్ బరువు సాధించ గలిగాను. నా డయాబెటిక్ మెట్రిక్స్ నార్మల్ స్థాయిలో ఉండేవి. 30% అధిక ఎనర్జీ ఉండేది. ప్రత్యేక వైద్య పరిస్థితుల నందు అంటే బరువు నియంత్రణ, డయాబెటిక్, కీళ్ళ నొప్పులు, అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్, కొన్ని మానసిక జబ్బుల చికిత్సలో అనుసరించడాన్ని నేను అడ్వకేట్ చేస్తాను. ప్రారంభించే ముందు Dr. Jasun Fung, Dr. Eric Berg వీడియోస్ ను వినమని విన్నవిస్తున్నాను.
🙏సేకరణ
No comments:
Post a Comment