Adsense

Friday, March 28, 2025

మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి?

చిత్రపటం సౌజన్యం Mappr

పై చిత్రంలో చూపిన 21 దేశాలు మెడిటేరియన్ సముద్రం చుట్టూ ఉన్నాయి.

ఈ దేశాలలో అమెరికాలో కన్నా హృద్రోగాలు తక్కువ.

పరిశోధనలలో తేలిందేమంటే వీరి ఆహారపుటలవాట్ల వలన ఇక్కడి ప్రజలలో stroke , హృద్రోగాలు తక్కువని.

ఈ పరిశోధనలు 1950 లో జరిగాయి. అప్పటి నుంచి అమెరికావాసులు వీరు తీసుకునే ఆహారాన్ని మెడిటేరియన్ డైట్ అని వ్యవహరిస్తున్నారు.

ఇంతకూ వీరు తినేదేమిటంటే, శాకాహారం.

పండ్లు , కూరలు,తృణధాన్యాలు(whole grains ),మొలకెత్తిన గింజలు (Sprouts) , పప్పులు(ప్రోటీన్స్),పొడిపండ్లు (డ్రైఫ్రూట్స్), మిరియాల వంటి మసాలాదినుసులు, సుగంధద్రవ్యాలు,ఆలివ్ నూనె.

కొద్దిగా(dairy ) పాలు మరియు పాల ఉత్పత్తులు , (sea food )సముద్ర ఉత్పత్తులైన చేపలు,రొయ్యలు, మొదలైనవి, (poultry ) పెంపుడు పక్షులతో చేసిన ఆహారం.

అరుదుగా(red meat ) మాంసము ,(sweets) చక్కెర,నూనె తో చేసిన తియ్యని పదార్ధాలు .

సూక్ష్మంగా చెప్పాలంటే సాత్వికాహారం,పోషకాలు కలిగిన మితాహారం.

No comments: