Adsense

Tuesday, April 15, 2025

అపార్టుమెంట్ల ఫ్లోర్ స్పేసుని ఎలా కొలుస్తారు? వారు చెప్పేంత ఫ్లోర్ స్పేసు వాటి లోపల ఉన్నట్లు కనిపింౘదు. కనీసం 25% తేడా ఉన్నట్లు తోస్తుంది. ఎందుకలా?

అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లలోని ఫ్లాట్ ఏరియా వర్ణనకి సంబంధించి 4 terms వాడుకలో వున్నాయి.


  1. Capet area: ఇది flat లోపలి అన్ని గదుల నేల (floor) వైశాల్యాల మొత్తాన్ని సూచించే అంకె. హాల్, బెడ్ రూమ్స్, కిచెన్, బాత్ రూమ్స్ , స్టోర్ రూమ్స్, బాల్కనీలు మొదలైన వాటన్నిటి floor వైశాల్యాలు కూడితే వచ్చే అంకె ఇది. ఇది మీ ఫ్లాట్ లో మీరు వాస్తవంగా వాడుకోగలిగిన exclusive స్థలం. మన తెలుగు రాష్ట్రాలలో, బిల్డర్లు సాధారణంగా ఈ figure ని చెప్పరు. మహారాష్ట్రలో మాత్రం, ప్రస్తుత చట్టం ప్రకారం ఈ figure ని తప్పనిసరిగా బ్రోచర్ లో ప్రకటించాలి. అంతేగాక flat అమ్మకం, Rate in Rs / sq ft of carpet area ప్రతిపదన మీదే జరగాలి.
  2. Built up area (కట్టుబడి వైశాల్యం): కార్పెట్ ఏరియాకి, ఫ్లాట్ బౌండరీ గోడల, లోపలి గోడల & స్తంభాల foot prints వైశాల్యాలు కలిపితే వచ్చే ఏరియా. దీన్నికూడా సాధారణం గా బిల్డర్ చెప్పడు. ఇది గోడలతో సహా మీ ఫ్లాట్ యొక్క total foot print (ఆక్రమించిన స్థలం). ఫ్లాట్ లోపలి గోడల సంఖ్య మీద ఆధారపడుంటుంది. Carpet area + (6 to 10) % ఉండచ్చు.
  3. Super built up area: టవర్ లోని common areas ( వరాండా, staircase, లిఫ్ట్ lobby మొ,,) వైశాల్యాలలో కొంత భాగాన్ని ఫ్లాట్ల ఏరియాల నిష్పత్తి లో మీ ఫ్లాట్ built up ఏరియా కి కలిపితే వచ్చే సంఖ్య. బిల్డర్ సాధారణం చెప్పే సంఖ్య ఇది. ఇది carpet area + (20 to 30) % దాకా ఉంటుంది.

4) undivided land share: అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టిన భూమి వైశాల్యాన్ని, ఫ్లాట్ area నిష్పత్తిలో, మీ flat కి కేటాయించిన భూమి. ఈ figure ఎక్కువుండడం, బిల్డింగ్ చుట్టూ వున్న గ్రీనరీ, క్రీడా సౌకర్యాలు ఎక్కువుండడానికి index. ఇది నిర్దిష్ట (specified) హద్దులు లేని భూవాటా. అపార్మెంట్స్ పాతబడిన తర్వాత, re-development కి ఇచ్చేటప్పుడు, కొత్త వాటిలో మీకొచ్చే వాటాని సూచిస్తుంది.

No comments: