Adsense

Tuesday, April 15, 2025

స్వయంపాకం అంటే ఏమిటి? అది ఎవరికి ఇవ్వాలి?

*స్వంతంగా వండుకొని, తినడానికి కావలసిన సామగ్రిని ఇవ్వడమే స్వయంపాకం.*

*అందులో బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, చింతపండు, బెల్లం, నెయ్యి, నూనె మొదలైనవి ఇవ్వాలి.*

*విశిష్ట మాసాలలో, పర్వదినాలలో, అమావాస్య నాడు, సంక్రమణ సమయంలో, ఏకాదశి తెల్లవారి ద్వాదశి నాడు, తల్లిదండ్రుల తిథినాడు, గ్రహణం రోజు ఈ వస్తువులను కనీసం ఒక్కపూట వంటకు సరిపడేలా సమకూర్చి ఒక అరటి ఆకు లేదా విస్తరిలో పెట్టి పురోహితునికి దానం చేయాలి.*

*తిథి రోజు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయంపాకం దానం, దక్షిణ తాంబూలాదులతో సమర్పించాలి. తోటకూర, గుమ్మడిపండు యథాశక్తి ఇవ్వవచ్చు.*

*మన ఇంట్లో భోజనం చేయని సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారికి ఈ విధమైన స్వయంపాక దానం ఇస్తారు. నిత్యాగ్ని హోత్రులైన కొందరు స్వయంగా వండుకొని, భగవంతునికి నైవేద్యం సమర్పించి, తదనంతరం భోజనం చేస్తారు.*


No comments: