సకల పాప హరణం కామదా ఏకాదశి వ్రతం
ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత.
కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం.
సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు.
స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి.
ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది.
అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది, వరాహ పురాణంలో
శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు.
అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు.
పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు.
ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు.
అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది.
అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది, అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది.
అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు.
ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది.
వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు.
ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment