Adsense

Friday, April 4, 2025

రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనా?

డార్కు ఛాక్లెట్లు మంచి పోషక విలువలు కల్గియుండుట వలన ఆరోగ్యానికి చాలా మంచివని నిరూపించబడినాయి,

ఈ డార్కు ఛాక్లెట్‌ ఎంత సేపండి అలా చూస్తూనే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది , తీపిదనం కొద్దిగా ఉండే ఈ చాక్లెట్‌లో కొద్దిగా వగరు కూడా అనిపించవచ్చును సారు!

GODIVA masterpieces ' best dark chocolate (బెల్జియమ్‌ డార్కు ఛాక్లెట్‌లు)

బ్లడ్‌ ప్రెషర్ను ::‌ తక్కువ ప్రెషర్‌ను, ఎక్కువ బ్లడ్‌ప్రెషర్‌ను కాకుండగా ఈ డార్కు ఛాక్లెట్లు నియంత్రణ చేస్తాయి,

మంచి కొలెస్ట్రాల్‌ను కూడ క్రమ పద్దతి లో యుంచి చెడు కొలెస్ట్రాల్‌ను లివర్‌కు పంపటంతో అది మన శరీరము నుండి బయటకు పంపించి వేస్తుంది,

బరువు తగ్గాలంటే పరగడుపున లేదా భోజనము చేయక ముందు లేదా చేసాక అరగంట తర్వత డార్కు ఛాక్లెట్లు తినండి,

కొన్ని విటమిన్‌లకు మన డార్కు ఛాక్లెట్‌లు ఉత్ప్రేరకాలుగా పనిచేయటమేగాక

బలమైన కారణాలుగా కూడా ఉండటము వలన

గుండెకు రక్త ప్రసరణ ను సాఫీగా ప్రవహింహచేయుటకు కారకములుగా మరియు

దాని వలన హృద్రోగ సమస్యలను చాలా వరకు కట్టడి చేస్తుంది లేదా నివారణ కు ఈ డార్కు ఛాక్లెట్టులు పని చేస్తాయి,

ఢార్కు ఛాక్లెట్లులు తింటే సూర్యరశ్మినుండి మన శరీరంపైని చర్మాన్ని సంరక్షిస్తుంది

అన్నింటి కన్న మిన్న అందఱికి తెలిసినదే డార్కు ఛాక్లెట్‌‌లు మన బుద్ది కుశలతను పెంపొందిస్తుంది

మేము కొన్ని సంవత్సరాలనుండి ప్రతీ రోజు మధ్యాహ్నపు భోజనం కాగానే మా ఆవిడ ఫ్రిజ్‌లో నుండి ఒక ఛాక్లట్టు తెచ్చి నా చేతులో పెడుతుంది !!

ఏదొ ఒక పూట తప్పని సరిగా డార్కు ఛాక్లెట్‌ను లేదా ఛాక్లెట్‌లను నోటిలో వేయాలిసిందే ….

ట్రఫస్‌ మేలైనవి ….COSTCO లో

హోల్‌సేల్‌గా కొని, బంధుమితృలతో పంచుకున్నవి …।

డార్కు చాక్లెట్టులు మధుర భావనల ప్రేరకాలు అని ఎక్కడో ఎప్పుడో చదివాను,

సరే ఎప్పుడు తినాలి , ఎన్ని తినాలి ::

సాధారణంగా మధ్యాహ్నం సుష్టుగా తిని ఆరామ్‌గా కూర్చొని ఒక డార్కు ఛాక్లెట్‌ నోటిలో వేసుకొని చప్పరించండి ,

పగటి భోజనం రాత్రి భోజనం మధ్యలో సాయంత్రం పూట చిఱుతిళ్లలాగా కూడా లాగించేయండీ కాని …రోజుకు ముప్ఫైనుండివఅరవై గ్రాముల వరకే … "అంతే " తినండి,

గమనిక::: ఇదంతా చదివి ఈ డార్కు ఛాక్లెట్లు ఆయా ఆరోగ్య సమస్యల నివారణకు ఇవ్వే మందులని నిర్ధారణకు రావద్దు,ఇవి కూడా ఆయా విషయాలలో మన ఆరోగ్యానికి తగు మాత్రంగా సహాయకారంగా ఉండునని చదువరులకు విన్నవించుకుంటున్నాను .

{ సర్వేజన సుఖినోభవంతు }

॥ ధన్యవాదాలు ॥

No comments: