Adsense

Friday, April 4, 2025

రాశి ప్రకారం చేతి మణికట్టుకు ఏ రంగు దారం కట్టుకుంటే అదృష్టం కలిసొస్తుంది!

భారతీయులు, ముఖ్యంగా హిందువులు చాలా రకాల సంప్రదాయాలు ఫాలో అవుతారు. జ్యోతిష్యంలో సూచించిన పరిహారాలు నమ్ముతారు, వాటిని పాటిస్తారు.

ఇలాంటి వాటిలో ఒకటి చేతికి దారం కట్టుకోవడం. చాలామంది చేతులకు వివిధ రకాల రంగురంగుల దారాలు, కంకణాలు, రుద్రాక్షలు కట్టుకుంటారు. ఇవి మతపరమైన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అయితే మీ రాశి ప్రకారం సరైన రంగు దారం కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

జ్యోతిష్యం ప్రకారం.. ప్రతి రంగును ఏదో ఒక గ్రహం పాలిస్తుంది. మనం చేతికి కట్టుకునే దారం రంగు కారణంగా, ఆ రంగును పాలించే గ్రహం ఆశీర్వాదం మనకు లభిస్తుంది. జీవితంలో అదృష్టం పెరుగుతుంది. ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుంది. ఇంతకీ ఏ రాశివారు చేతి మణికట్టుకు ఏ రంగు దారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

* సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యుని ఆశీర్వాదం పొందాలంటే, ఈ రాశివారు చేతికి నారింజ లేదా ఎరుపు లేదా కుంకుమ రంగు దారం కట్టుకోవాలి.

* మేషం, వృశ్చికం
మేషం, వృశ్చిక రాశుల పాలక గ్రహం అంగారకుడు. అందుకే ఈ రాశుల వారు కుజుడు, హనుమంతుడి ఆశీర్వాదం కోసం చేతికి ఎర్ర దారం కట్టుకోవాలి. దీనివల్ల మీ అదృష్టం పెరుగుతుంది.

* కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. జన్మ నక్షత్రంలో చంద్రునికి సంబంధించిన మంచి ఫలితాలను పొందడానికి మీ చేతికి తెల్లటి దారం కట్టుకోవాలి. ఒకవేళ అది మురికిగా మారితే, ప్రతి నెల పౌర్ణమి రోజున దాన్ని మార్చాలి.

* వృషభం, తుల
వృషభం, తుల రాశుల పాలక గ్రహం శుక్రుడు. ఈ గ్రహంతో పాటు ఇతర విశ్వ శక్తుల ఆశీస్సులు పొందడానికి ఈ రాశుల వారు చేతికి తెల్లటి పట్టు దారం కట్టుకోవాలి. దీనివల్ల మీకు సంపద లభిస్తుంది.

* మకరం, కుంభం
మకరం, కుంభ రాశి వారికి అధిపతి శని దేవుడు. శని ఆశీర్వాదం కోసం ఈ రెండు రాశుల వారు చేతికి బ్లూ కలర్ కాటన్ దారం కట్టుకోవాలి. దీనివల్ల సాడే సాతి, పనౌతి వంటి ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.

* మిథున రాశి, కన్యా రాశి
మిథున రాశి, కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. బుధుని అనుగ్రహం కోసం చేతికి ఆకుపచ్చ రంగు దారం కట్టుకోవాలి.

* ధనుస్సు, మీన రాశి
ధనుస్సు, మీన రాశుల వారికి అధిపతి దేవగురువు బృహస్పతి. బృహస్పతి అనుగ్రహం కోసం ఈ రెండు రాశుల వారు చేతికి పసుపు రంగు పట్టు దారం కట్టుకోవాలి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది, జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.

* రాహువు, కేతువు
రాహువు, కేతువులతో పాటు, భైరవ దేవుడి ఆశీర్వాదం పొందడానికి మీ చేతికి నల్ల దారం కట్టుకోవడం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే.

No comments: