Adsense

Tuesday, April 15, 2025

బీజాక్ష‌రాలు ఎన్ని? వాటి ఆంత‌ర్యం ఏమిటి?

  • శరీరమునందు నాదం, అక్షరాలు ఉన్నవని యోగమతము. కనుక ఈ బీజోపాసన వలన ఆయా శరీరావయవములందు మంత్రోద్దారము చేయవచ్చును. ఆయా మంత్రస్థానములను చైతన్యభరితం చేయవచ్చును.
  • కవులు తమ తమతమ ఇష్టదేవతామంత్రాలను ముద్రాలంకారంగా బంధించేందుకు ఈ బీజాక్షరాలను వాడతారు.
  • మంత్రాకారాలను వీజరూపాలను మంత్రవేత్తలు మామూలు భాషలో ప్రత్యక్షముగాచెప్పరు. మంత్ర దేవతలు పరోక్ష ప్రియలు కనుక మంత్రము లున్న స్వమాతృజార తుల్యముగా గోప్యములు.
  • తాంత్రికమయిన బీజాక్షర మంత్రములలో అర్థం తెలియని శ్రీం, అం, శం లాంటి వర్ణములే ఉందును. దానిమ్మపండులో గింజలవలె ఉండే ఈ అక్షర రత్నాలు పరస్పరం బంధం లేనట్లు వెలుగుచుండును. అట్లని నిరర్ధ్థకములు అనరాదు. నిరర్థక్షమయిన మంత్రములు ఏ దేవతలను తృప్తి పజిచును? మంత్రం అంటే ఒక స్తుతి. ఒక ప్రార్థన. అర్థమున్నపుడు ఆ “గుణం” సాధ్యం అవుతుంది. కనుక బీజాక్షర మంత్రాలకు అర్థాలు తప్పనిసరి. వాక్యానికి అర్థం ఉన్నపుడు వాక్యగతమయిన పదాలకు గూడా ఆ అర్థభాగాలు పంచాలి. అలాగే మంత్రం మొత్తం మహావాక్యం అయితే మంత్రగత బీజాలకు అర్థం తప్పక ఉండాలి. కనుక వీజాక్షరాలకు అర్థం తప్పదు.

ఈ క్రింది పట్టికలో వివిధ బీజాక్షరాల అర్థాలను గమనించవచ్చును.

పైన చూపిన బీజాక్షర అర్థములకు ఆధారమైన ప్రమాణ గ్రంథములు :

1) శ్రీ తంత్రాభిధానం

2) మంత్రాభిధానం - 1

3) మంత్రాభిధానం - 2

4) ఏకాక్షర కోశము - (పురుషోత్తమదేవరచితం)

5) భూత యక్ష డామర తంత్రాంతర్గత బీజనిఘంటువు

6) మాతృకా నిఘంటువు - 1 (మహీదాసవిరచితం)

7) మాతృకా నిఘంటువు - 2 (మధ్వాచార్యరచితం)

8) మాతృకా నిఘంటువు - 3

9) వర్ణ నిఘంటువు - రుద్రయామలతంత్రం

10) బీజాభిధానం - భూతడామరతంత్రం

11) మంత్రార్థాభిధానం - వరదాతంత్రం

12) ముద్రానిఘంటువు - వామకేశ్వర తంత్రం

13) బీజాక్షర నిఘంటువు

No comments: