విశ్వామిత్ర యాగ సంరక్షణ తరువాత సిద్ధాశ్రమ ఋషులు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు మిధిలేశుని శివధనుస్సు గురించి ముచ్చటించారు
తెల్లవారి విశ్వామిత్రుడక్కడి ఋషుల నక్కడే నిలిపి వారి సెలవు తీసికొని - ఆ ఆశ్రమమును విడిచి రామలక్ష్మణులతో కూడి ఉత్తర దిశకు బయలుదేరాడు
వారు ఆసాయంత్రము శోణా నదీతీరము చేరుకొని స్నానసంధ్యాదులు ముగించుకొన్నారు. రామలక్ష్మణుల కోరిక పై విశ్వామిత్రుడు కుశనాభుని చరిత్రము వినిపించాడు
బ్రహ్మ తనూజుడైన కుశమహర్షి వైధర్భియందు కుశాంబుడు, కుశనాభుడు అధూర్త రజసుడు, వసువు అను కుమారులను కల్గి ఉండెను.
వారు వరుసగా కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరవ్రజము అనే నాలుగు నగరాలను నిర్మించి పాలించారు
కుశనాభునికి సర్వాంగ సుందరులైన నూరుగురు కుమార్తెలు కలిగారు వారు యౌవనాభరణ భూషితలై ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తుండగా
వాయుదేవుడు వారిని మోహించి గాంధర్వ వివాహము చేసికోదలిచాడు. ఆయువతులందుకు నిరాకరింపగా, ఆగ్రహముతో వాయువు వారినందరిని కుబ్జలుగా మార్చాడు.
కుశనాభుడు వారి వికృత రూపములగాంచి దుఃఖించి పెద్దలను సంప్రదించి, మహానుభావుడు, ఊర్మిళా చూళీ తనయుడైన బ్రహ్మదత్తునికి వారిని కన్యాదానముగావించాడు.
బ్రహ్మదత్త కరగ్రహణముతో వారందరికీ అపురూప లావణ్యశోభలు యథా పూర్వము సంప్రాప్తించాయి.
కుశనాభుడు తన శతసుతలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేసి పంపాక, తనకు సంతానము లభించాలని, పుత్రకామేష్టిగావించాడు.
బ్రహ్మతనయుడైన కుశమహర్షి ఆశీర్వాద ఫలితంగా ఆయనకు "గాధి' అనే తనూజుడు కల్గాడు.
ఆ గాధి నా తండ్రి అని విశ్వామిత్రుడు చెప్పాడు, మరియు గాధికి సత్యవతి అనే తనయకలిగారు. సత్యవతికి ఋచీకుడనే మహర్షితో పరిణయము జరిగింది.
ఋచీక నిర్గమనముతో సత్యవతి "కౌశికీ" అనే పుణ్యనదీరూపము ధరించి లోకాన్ని పావనం చేస్తుంది.
ఆ నదీతరంలోనే నేను ఆశ్రమము నిర్మించుకొని తపస్సు జేశాడు. అక్కడి నుండి దక్షిణము దిశలో నున్న సిద్ధాశ్రమమునకు వెళ్లి
యాగములు చేస్తూ -వాటికి నిరంతర విఘ్నములు కలుగగా వాటిని స్వప్రయత్నముతో నివారింప జాలనని నిర్ణయించుకొని -దశరథ తనయుడైన నిన్ను శరణు వేడి -నీ పై రక్షణ భారము సంపూర్ణంగా ఉంచి యజ్ఞం పూర్తి చేశాను.
కుశుని వంశములో పుట్టుటచే నాకు కౌశికుడు అని పేరు వచ్చినది. విశ్వమునకు హితము కలిగించు మిత్రుడనగుటచే నన్ను విశ్వామిత్రుడు అని కూడ వ్యవహరింతురు.
ఆ శోణా నది తీరం లో రామ లక్ష్మణులు మాహర్షులతో కలసి ఆ రాత్రి నిద్రించారు....
ఉదయం చేయవలసిన కృత్యాలు పూర్తి చేసి తిరిగి ప్రయాణం సాగించారు....మధ్యాహ్నా సమయానికి గంగా నది చేరారు.....
( సశేషము )
No comments:
Post a Comment