Adsense

Sunday, June 15, 2025

వారాహి నవరాత్రులు: ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు

వారాహి నవరాత్రులు:  ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు  రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామివారి  మీద భక్తి తో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

ఆషాఢ నవరాత్రి ప్రతి రోజూ, సప్త మాత్రుక దేవతలను  మరియు అష్ట మాత్రుక దేవతలను  పూజించడం, ఎనిమిదో రోజు వరాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది

*పూజా విధానం*
ఈ దేవికి నిత్య పూజాతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు.

తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.

ఈ నవరాత్రి పూజల్లో భాగంగా  అష్టోత్రాలతో కుంకుమార్చన చేస్తారు మరియు సహస్రనామాలు, స్తోత్రాలు, దేవి భాగవతం, దుర్గ సప్తశతి మరియు దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు.


*వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి*

స్త్రోత్రం / అష్టోత్తరం /నియమాలు

19/23 అదివారాహి సోమవారం

20 / దండిని వారాహి , మంగళవారం

21/బృహద్ వారాహి, బుధవారం

22/ ఉన్మత్త వారాహి ,గురువారం

23/ స్వప్న వారాహి ,శుక్రవారం

24 /ధూమ్ర వారాహి ,శనివారం

25/వజ్ర వారాహి ,ఆదివారం

26 / శ్వేత వారాహి , సోమవారం

27/కిరాత వారాహి , మంగళవారం

28/ మహా వారాహి ,బుధవారం

వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి..వారహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు.. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు...

ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు ప్రతి ఇంట్లో జరగాలని కోరుకుంటున్నాను, ఈ తల్లి ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది, ముక్యంగా ఆస్తి తగాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుండి విముక్తి కలుగుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ,ఏ కుటుంబం లో వ్యక్తి లు అయిన వారిని దూరం చేసికునే పరిస్థితి రాకూడదు. సమస్యలు వచ్చినా అవి దాటగల శక్తి అమ్మవారు అనుగ్రహించాలి ,ప్రతి కుటుంబానికి ఆమె రక్ష ఉండాలి.

ఈ ఆషాడ వారాహి నవరాత్రులు వీలైనంత గా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి, గ్రూప్ లో చాలా మంది చేత సర్వకార్యసిద్ది వారాహి పూజ చేయించాను చాలా గొప్ప  ఫలితాన్ని ఇచ్చిన తల్లి పూజ, అలాగే శ్రీవిద్యా సమూహం లోని వారికి వారాహి మంత్రోపదేశం ఉంది వారంతా కచ్చితంగా ఈ నవరాత్రులు ప్రతిరోజు వారాహి యంత్రపూజ చేసి పూజ చేయండి,

ఉదయం లలితా సహస్రనామ పారాయణ చేయండి సాయంత్రం 6 గ పైన వారాహి పూజ మొదలుపెట్టాలి.

అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనె తో దీపారాధన, ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడండి, ఆ తల్లికి ప్రతి రోజు నివేదనలో యధాశక్తిన గుండ్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి, లడ్డులు ( నువ్వులు బెల్లం నైయ్యి, ఇలాచి), పనస పండు చాలా విశేషం.. బెల్లం పానకం కచ్చితంగా పెట్టాలి.

కందగడ్డ తో వంట నైవేద్యం, కంద దీపం, దుంపలు చిలకడ దుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడం..దానిమ్మ పండ్లు, దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేన నైవేద్యం..

అమ్మవారికి చేసే హోమంలో , తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనస తో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి.

*గ్రూప్ లో వారాహి పూజలు సంబంధించిన పోస్ట్లు అన్ని చూడండి*.

*వారాహి అష్టోత్తరం*

ఓం వరాహవదనాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వరరూపిణ్యై నమః
ఓం క్రోడాననాయై నమః
ఓం కోలముఖ్యై నమః
ఓం జగదంబాయై నమః
ఓం తారుణ్యై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం ఖడ్గ శూల గదాహస్తాయై నమః
ఓం ముసల ధారిణ్యై నమః
ఓం హలసకాది సమాయుక్తాయై నమః
ఓం భక్తానాం అభయప్రదాయై నమః
ఓం ఇష్టార్థదాయిన్యై నమః
ఓం ఘోరాయై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వార్తాళ్యై నమః
ఓం జగదీశ్వర్యై నమః
ఓం అంధే అంధిన్యై నమః
ఓం రుంధే రుంధిన్యై నమః
ఓం జంభే జంభిన్యై నమః
ఓం మోహే మోహిన్యై నమః
ఓం స్తంభే స్తంభిన్యై నమః
ఓం దేవేశ్యై నమః
ఓం శత్రునాశిన్యై నమః
ఓం అష్టభుజాయై నమః
ఓం చతుర్హస్తాయై నమః
ఓం ఉన్మత్తభై రవాంకస్థాయై నమః
ఓం కపిల లోచనాయై నమః
ఓం పంచమ్యై నమః
ఓం లోకేశ్యై నమః
ఓం నీలమణి ప్రభాయై నమః
ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
ఓం సింహారూఢాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాన్యై నమః
ఓం నీలాయై నమః
ఓం ఇందీవర సన్నిభాయై నమః
ఓం ఘనస్తన సమోపేతాయై నమః
ఓం కపిలాయై నమః
ఓం కళాత్మికాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం జగద్ధారిణ్యై నమః
ఓం భక్తోపద్రవ నాశిన్యై నమః
ఓం సగుణాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం విశ్వ-వశంకర్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహేంద్రితాయై నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం పశూనాం అభయంకర్యై నమః
ఓం కాళికాయై నమః
ఓం భయదాయై నమః
ఓం బలిమాంస మహాప్రియాయై నమః
ఓం జయభైరవ్యై నమః
ఓం కృష్ణాంగాయై నమః
ఓం పరమేశ్వర వల్లభాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్తుత్యై నమః
ఓం సురేశాన్యై నమః
ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః
ఓం స్వరూపిణ్యై నమః
ఓం సురానాం అభయప్రదాయై నమః
ఓం వరాహదేహ సంభూతాయై నమః
ఓం శ్రోణీ వారాలసే నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం నీలాస్యాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం అశుభవారిణ్యై నమః
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః
ఓం సర్వశత్రు సాదనకారిణ్యై నమః
ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః
ఓం భైరవీ ప్రియాయై నమః
ఓం మంత్రాత్మికాయై నమః
ఓం యంత్రరూపాయై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం పీఠాత్మికాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం శ్రేయస్కర్యై నమః
ఓం చింతితార్థ ప్రదాయిన్యై నమః
ఓం భక్తాఅలక్ష్మీవినాశిన్యై నమః
ఓం సంపత్ప్రదాయై నమః
ఓం సౌఖ్యకారిణ్యై నమః
ఓం బాహువారాహ్యై నమః
ఓం స్వప్నవారాహ్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం సర్వారాధ్యాయై నమః
ఓం సర్వమయాయై నమః
ఓం సర్వలోకాత్మికాయై నమః
ఓం మహిష నాసినాయై నమః
ఓం బృహద్ వారాహ్యై నమః

ఇతి శ్రీ మహా వారాహి

శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి).

నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం  1 ..

త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం  2 ..

దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..

లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం  4..

కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్య వాసినీం  5..

ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం  6..

విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం  7..

పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం  8.

అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయన స్త్రోత్రం గా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది.

🙏మంత్రం: "ఓం హ్రీం వారాహీ హరి ఓం"🙏


   *శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం..*

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||

వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||

నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం

👉నియమాలు

వారాహి నవరాత్రి దీక్ష చేసేవారు ఆహారనియమం పాటించాలి (ఉపవాసం చేయకండి పూజ ఐయ్యాక తినవచ్చు, )
వారాహి నవారాత్రి రెండు పూటలా ఉదయం సాయంత్రం చేయాలి

బ్రహ్మచర్య నియమాలు పాటించాలి..

ఆ పది రోజులు ఇంట్లో శాకాహారమే వండాలి ,వండిన ప్రతి పదార్థాలను నైవేద్యం గా పెట్టి ప్రసాదంగా తినాలి.

ఆ పది రోజులు అఖండ దీపం ఉంటే మంచిది..

వారాహి పాడి పంటలకు ,భూమికి సంబంధించిన శక్తి కనుక.. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయండి ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచలి పదవ రోజుకి మొలకలు ఆరోగ్యం గా మొలిస్తే మీ సంకల్పం ఆటంకాలు లేకుండా నెరవేరి నట్టు.. తర్వాత అవి అవుకి తినిపించాలి.

పసుపు గణపతిని ప్రతి రోజూ చేయాలి..ఆ గణపతి ని చేసిన పసుపు వీనియోగించుంకోవచ్చు..

విగ్రహం ఉన్నవారు రోజూ పసుపునీటితో అభిషేకం చేయవచ్చు.. ఫోటో ఉన్నవారు అయితే రోజూ పువ్వులు వాడుకోవచ్చు..

విగ్రహం ఫోటో రెండూ లేని వారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేయవచ్చు.. దీపానికి చేసేవారు అభిషేకం ద్రవ్యా స్పూన్ లో అమ్మవారికి మంత్రం చదువుతూ చూపించి ఒక పాత్రలో ఉంచి అందులోనే దేవతా ఆచమనం నీళ్లు, చివరిగా అది తీర్థం గా సేవించావచ్చు.

యంత్ర పూజ తెలిసిన వారు ప్రతి రోజు యంత్ర పూజ చేయాలి.

మధ్యాహ్నం భోజనం చేయవచ్చు సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేయాలి.

నైవేద్యం మీకు కలిగినదే పెట్టండి, ఇంకొకరి తో పోటీ పడి అప్పులు చేసి ఆర్భాటా లు వద్దు భక్తితో చేస్తే చాలు..

నమో వారాహికొలముఖీ శరణం మమ

*వారాహి సహస్రనామ కుంకుమార్చన పరిహార వ్రతం*

ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం వారాహి తల్లి , అమ్మవారిని పసుపు నీటితో అభిషేకం చేసి , కస్తూరి పసుపు ముద్దగా కలిపి అమ్మవారికి పసుపుతోనే వస్త్రం లాగా అలంకారం చేయాలి..

ఇలా అలంకరించాక తమలపాకులు ఆసనం లాగా పరచి అమ్మవారిని పెట్టి ధూపం ముందుగా వేసి తర్వాత దీపం పుష్పాలు అలంకారం చేయాలి..వారాహి సహస్రనానం చదువుతూ కుంకుమార్చన అమ్మవారి పైనే కుంకుమ అర్చించాలి..ఆడియో వింటూ కూడా మీరు మూల బీజం కానీ అమ్మవారి నామం కానీ జపిస్తూ నమః అన్నప్పుడు కుంకుమ అమ్మవారిపైన అర్చన చేయాలి.

మంత్రం ఉపదేశం ఉన్నవారు ఆ మంత్రం తో 1008 సార్లు జపిస్తూ ఈ అర్చన చేయవచ్చు..

సహస్త్రరం పూర్తి ఐయ్యాక అమ్మవారికి ఉడక బెట్టని కంద, చిలకడ దుంప, తేన, దానిమ్మ, నైవేద్యం గా పెట్టి,తాంబులం సమర్పించి మళ్ళీ ధూపం వేయాలి చివరిగా హారతి ఇవ్వాలి.. ఇలా అర్చించిన తర్వాత ఆ తల్లి కుంకుమ లొనే ఆ రాత్రి ఉంచాలి ఉదయం కుంకుమ తీసి అమ్మవారికి మళ్ళీ పసుపునీటితో అభిషేకం చేసి యధాస్థానం లో ప్రతిష్టించాలి..ఈ అభిషేకం ఉదయం 5 am సమయంలో కానీ అంతకన్నా ముందే చేస్తే మంచిది

👉ఇది ఏ సమయంలో చేయాలి ,

రాత్రి సమయంలో 7 pm తర్వాత చేయలు

👉ఎన్ని సార్లు చేయాలి?

16 శుక్రవారాలు కానీ 15 పంచమి తిధులు కానీ చేయాలి, ఏదైనా ఆటంకాలు వచ్చి ఆగిన వారం వదిలి మరుసటి వారం చేయాలి..

👉ఇది వారాహి యొక్క శక్తివంతమైన ఉపాసన..
ఇది ఎవరు చేయాలి

తీరని కష్టంలో ఉన్న ఎవరైనా చేయవచ్చు..
ఉద్యోగం లేని వారు ఉద్యోగం, వ్యాపారం లో అభివృద్ధి లేని వారు, కుటుంబ సమస్యలు, కుటుంబం లో అక్రమ సంబందాల వల్ల బాధ పడుతున్న ఆడవాళ్లు, తీరని అప్పులు, అప్పులు ఇచ్చి తిరిగి రాలేదు అనుకునే వారు, ఆస్తి తగాదాలు,కోర్ట్ కేసులు, పొలం మంచి రేటుకు అమ్మాలి అనుకునే వారు ,కొనాలి అనుకునే వారు, ఇంటిపై అప్పులు తీరని వారు , ముక్యంగా ఏదైనా ప్రయోగ బాధ తో బాధ పడే వారు, దీర్ఘకాలిక జబ్బుతో బాధ పడుతున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు ఇటువంటి వారంతా చేయవచ్చు..

👉 పరిహారం గా చేసే ఈ పూజకి యేటి సూతకం వర్తించదు ఆపదలో ఉన్నా సమస్యలతో ఉన్న  అందరూ చేయవచ్చు కానీ ఈ విధానం విగ్రహం ఉన్న వారు మటుకే చేయాలి..విగ్రహం లేని వారికోసం కంద దీపం తో వారాహి పూజ నేర్పిస్తాను

👉రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం లేదు , ఆ ఒక్క రోజు మాంసాహారం తినకుంటే చాలు ,సాయంత్రం పూజ మొదలు పెట్టె సమయానికి మళ్ళీ దంత దావనం చేసి  స్నానం చేసి మొదలు పెట్టాలి..శ్వాస దుర్వాసన రాకూడదు ,చినిగిన వస్త్రం ధరించకూడదు,ఆసనం లేకుండా కూర్చోకూడదు..పూజ మధ్యలో అపి మాట్లాడకూడదు

శ్రీ మాత్రే నమః

*వారాహి దేవి మంత్రం*

ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావంటారు.

*"ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా"*

ఈ మంత్రాన్ని 108  నుండి 1008 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది నమ్మకంతో చేయాలి.. ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి మంత్ర జపం చేసుకోండి.
నియమాలు:
సాయంత్రం సంధ్యా కాలం తర్వాత కానీ చీకటి అయ్యాక కానీ స్నానం చేసి వినాయకుడికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలుచుకుని సంకల్పమ్ చెప్పుకుని జపం మొదలు పెట్టాలి.. వీలైతే దానిమ్మ గింజలు నివేదన చేయండి. పూజ గది లోనే కాదు మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు నిద్ర పోయే పడకల పైన కూర్చుని చేయకూడదు, మైలు ఉన్న వారిని ముట్టుకుని చేయాకుడదు , మైలు ఉన్న స్త్రీలు చేయాకుడదు.. మనసు పెట్టి చేయాలి ఏకాగ్రత ఉండాలి వారానికి మీకే మార్పు తెలుస్తుంది.. మీకు పడాల్సిన బాధ సమయం 80% తగ్గుతుంది అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టాన్ని రెండు నెలల కు ఇంకా తక్కువ సమయానికి తగ్గుతుంది అది కర్మ ఫలితం కాబట్టి అనుభవించాలి కానీ తక్కువ సమయంలో చిన్న వాటితో పోతుంది తట్టుకునే శక్తి వస్తుంది, ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది. పరిహారం అనేది విపరీతంగా ఉన్న బాధ నుండి ఉపశమనం పొందడానికి.. తక్కువ సమయంలో సమస్య తిరడానికి అంతే కాని మీ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.




🌷 *సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం*🌷

వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం, లేకపోతే అమ్మ వారిని ఆవాహన చేస్తూ కలశం అయిన పెట్టవచ్చు,అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయిన అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను,అని మనసులో అనుకోని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు.

ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం, విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు.

కానీ ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం మిస్ అవ్వకుండా  వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించీ,దీపారాధన చేయాలి, అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంతవరకు,సాయంకాలం 6 గo పైన మొదలు పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు, ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు, మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు.

ఈమెకు పగటి పూజకంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కనుక మన గ్రూపులో వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి  సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు.

పూజకు కావాల్సిన సామగ్రి
1.పసుపు
2.కుంకుమ
3.ఆగర్భత్తులు
4.దానిమ్మ పండు గింజలు
5.లడ్డులు(5)
6.అమ్మ వారి చిత్రపటం,విగ్రహం,కలశం, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి, అ దీపకాంతిని వారాహిమాత  గా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు.

6. (పువ్వులు) ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు, అలాగే అమ్మవారినీ,భూదేవి అని అంటారు, కనుక ఈ భూమిమీద ఏ పువ్వు అయిన రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పుష్పం అయిన అమ్మకు ఇష్టం, పూలకోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు,
లడ్డులు 5 గుండ్రంగా ఉండాలి

శక్తి ఆరాధన గ్రూప్ సభ్యులకు మనవి, వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకొనే వారికి నా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వదు, మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకొనే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచన తో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలు అయినది అని దాని అర్థం, మీరు యూట్యూబ్ లో మరియు ఇతరత్రా సోషల్ మీడియాలలో చూస్తున్నా వార్తలను నమ్మి మోసపోకండి, ఈ పూజ కేవలం 4 అంశాలను పరిగణనలోకి తీసుకొని చేస్తున్నాము.
1.ఆర్ధిక ఇబ్బంది
2.వ్యాపార అభివృద్ధి
3.ఇంట్లో తరచు కలహాలు
4.మానసిక ప్రశాంతత
కేవలం ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని పూజ చేయమంటూతున్నాను,ఈ విషయం అందరూ గమనించగలరు.

🌹ఓం నమో వారాహి🌹
మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే
బ్రహ్మీ,
మాహేశ్వరి,
కౌమారి,
వైష్ణవి,
వారాహి,
ఇంద్రాణి,
చాముండీ.
8.వ మాతృక గా నారసింహి
9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించప డుతోంది, ఈ వారాహిరూపం పంది రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేగవర్ణంతో 8 చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముక్యంగా లలితదేవికి సర్వసైన్యా ధ్యక్షురాలు ఈ వారాహి మాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి,భక్తుల పాలిట   కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై. 
గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞాన సిద్ధిబుద్ధి,ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే  ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

ప్రతినిత్యం మీరు ఈ నామాలను స్మరిచండి....

*ఓం పంచమే నమః*
*ఓం దండనాథ నమః*
*ఓం సంకేత నమః*
*ఓం సమయేశ్వరి నమః*
*ఓం సమయ సంకేత నమః*
*ఓం పోత్రిన్యే నమః*
*ఓం శివయే నమః*
*ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః*
*ఓం మహా సైన్యయే నమః*
*ఓం వార్తాలీ నమః*

*ఈ నామాలతో స్మరిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుంది.*

॥ *వారాహీ గాయత్రీ* ॥

వరాహముఖ్యై విద్మహే । దణ్డనాథాయై ధీమహీ ।
తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్

(వారాహి మాత ధ్యాన స్తోత్రం)
వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్
హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ।
దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్
వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్

*వారాహి అమ్మ వారి అవతారాలు*

1.బృహత్ వారాహి
2.స్వప్న వారాహి
3.కిరాతా వారాహి
4.లఘు వారాహి
5.ధూమ్ర వారాహి
6.మహా వారాహి గా చెప్పబడుతున్నది.

1.బృహత్ వారాహి అనగా శత్రు శేషం ఉండదు అనగా మీరు ఈ అవతరాన్ని ఉపాసించడం వల్ల, మన లోని అంతర్ శత్రువులు కామ, క్రోధ, మద, మచర్యాలు,నశించి, మన అంతర్ ముకంగా ఉన్న శత్రువులను అమ్మ నశి oపచేస్తుంది,ఇది మన దక్షణాచారం లో అమ్మను కొలిచే పద్దతి.

2.స్వప్న వారాహి
ఈ స్వప్న వారాహి ని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత,భవిషత్, వర్థమానాలను తెలియచేస్తూ, సాధకులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులను ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి,సమాధానం చెబుతుంది.

6. మహా వారాహి భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది.

కిరత వారాహి, లఘు వారాహి,ధూమ్ర వారాహి అవతారాలు వాటి విశిష్టత మనకు ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన విధంగా 5 శుక్రవారాలు ఆ తల్లికి విశేషంగా పూజించుకోవచ్చి.

శత్రు బాధ నివారణ, గ్రహాబాధ, అనారోగ్యంతో బాధ , పిల్లలే సమస్యగా మారిన తల్లి తండ్రులు చేయగలం ఈ విధంగా అని మీకు అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షం లో వచ్చే పంచమి తిది రోజు పూజ మొదలు పెట్టి వారాహి ఉపాసన ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు చేయాలి అనుకునే వారు ఈ మంత్రాన్ని జపం చేయడం మోదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజూ 108 లేదా 5 సార్లు ఈ మంత్రాన్ని జపించి గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మపండు ,లడ్డు లాంటివి నివేదన చేసి 5 వారాలు జపం చేయాలి. మీ సంకల్పం నెరవేరుతుంది. అదే ఈ మంత్రం..

సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం

'అస్యశ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మ ఋషి , గాయత్రీచ్ఛందః శ్రీబృహద్వారాహి దేవతా | గ్లేo  బీజం | ఐం శక్తిః  ఠ : కీలకం!

ఐం, గ్లౌం, ఐం, నమో భగవతే వార్తాళీ 2 - వారాహి 2 అంధే అంధినేనమః 11 రుంధే రుందినేనమః 111 ఓం జృంభినీ నమః న్యాసః

👉( 2 ఉన్న చోట ఇంకో 2 సార్లు, 11 ఉన్న చోట అదే పదం 11 సార్లు, 111 సార్లు అన్న పదాన్ని 111 సార్లు పలకాలి)
ధ్యానం | రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మర్ణోరు కామార్ఫటికా సనస్థాం | ద్రం షోల్ల సత్ప్రోత్రిముఖారవిందాం | కోటి రసంఛిన్న హిమాంశురేఖాం | హలం కపాలం ధధతీక రాభ్యాం , వామే కరాభ్యాం ముసలేష్ఠదేచ | రక్తాంబరాం రక్త పటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం | చ్యామాం సమస్తా భరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం ||

మనుః  (ఇక్కడ నుండి మూల మంత్రం ఇది మటుకే 108 సార్లు చేయాలి)
*ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతీ వార్తాళీ, వారాహి, వరాహముఖి, ఐం గ్లౌం ఐం అందె అంధినీ నమః | రుంధే రుంధినీ నమః | జంభే జంభినీనమః | మోహే మోహినే నమః | స్తంభే స్తంభినీ నమః | ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వ స్తంభనం కురు, శీఘ్రం వశ్యం కురు ఐం గ్లౌం ఐం ఠ : ఠ : ఠ : ఠ :  హుం ఫట్ స్వాహా||

నమో వారాహి

శ్రీ మహావారాహీ అష్టోత్తరశతనామావళిః

ఓం వరాహవదనాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం వరరూపిణ్యై నమః |
ఓం క్రోడాననాయై నమః |
ఓం కోలముఖ్యె నమః |
ఓం జగదంబాయై నమః |
ఓం తారుణ్యై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం శంఖిన్యె నమః |   |౯|

ఓం చక్రిణ్యై నమః |
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః |
ఓం ముసలధారిణ్యై నమః |
ఓం హలసకాది సమాయుక్తాయై నమః |
ఓం భక్తానాం అభయప్రదాయై నమః |
ఓం ఇష్టార్థదాయిన్యె నమః |
ఓం ఘోరాయై నమః |
ఓం మహాఘోరాయై నమః |
ఓం మహామాయాయై నమః | |౧౮|

ఓం వార్తాళ్యె నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం అంధే అంధిన్యె నమః |
ఓం రుంధే రుంధిన్యె నమః |
ఓం జంభే జంభిన్యె నమః |
ఓం మోహే మోహిన్యె నమః |
ఓం స్తంభే స్తంభిన్యె నమః |
ఓం దేవేశ్యై నమః |
ఓం శత్రునాశిన్యె నమః |  |౨౭|

ఓం అష్టభుజాయై నమః |
ఓం చతుర్హస్తాయై నమః |
ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |
ఓం కపిలలోచనాయై నమః |
ఓం పంచమ్యై నమః |
ఓం లోకేశ్యై నమః |
ఓం నీలమణిప్రభాయై నమః |
ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః |
ఓం సింహారుఢాయై నమః |  |౩౬|

ఓం త్రిలోచనాయై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఈశాన్యె నమః |
ఓం నీలాయై నమః |
ఓం ఇందీవరసన్నిభాయై నమః |
ఓం ఘనస్తనసమోపేతాయై నమః |
ఓం కపిలాయై నమః |
ఓం కళాత్మికాయై నమః |  |౪౫|

ఓం అంబికాయై నమః |
ఓం జగద్ధారిణ్యై నమః |
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః
ఓం సగుణాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం విశ్వవశంకర్యై నమః |
ఓం మహారూపాయై నమః |  |౫౪|

ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహేంద్రితాయై నమః |
ఓం విశ్వవ్యాపిన్యె నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పశూనాం అభయంకర్యై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం భయదాయై నమః |
ఓం బలిమాంసమహాప్రియాయై నమః |
ఓం జయభైరవ్యై నమః | |౬౩|

ఓం కృష్ణాంగాయై నమః |
ఓం పరమేశ్వరవల్లభాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం స్తుత్యై నమః |
ఓం సురేశాన్యై నమః |
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః |
ఓం స్వరూపిణ్యై నమః |
ఓం సురాణాం అభయప్రదాయై నమః |
ఓం వరాహదేహసంభూతాయై నమః |  |౭౨|

ఓం శ్రోణీ వారాలసే నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం నీలాస్యాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం అశుభవారిణ్యై నమః |
ఓం శత్రూణాం వాక్‌స్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః |    |౮౧|

ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః |
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః |
ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః |
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః |
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః |
ఓం భైరవీప్రియాయై నమః |
ఓం మంత్రాత్మికాయై నమః | |౯౦|

ఓం యంత్రరూపాయై నమః |
ఓం తంత్రరూపిణ్యై నమః |
ఓం పీఠాత్మికాయై నమః |
ఓం దేవదేవ్యై నమః |
ఓం శ్రేయస్కర్యై నమః |
ఓం చింతితార్థప్రదాయిన్యై నమః |
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః |
ఓం సంపత్ప్రదాయై నమః |
ఓం సౌఖ్యకారిణ్యై నమః | |౯౯|

ఓం బాహువారాహ్యై నమః |
ఓం స్వప్నవారాహ్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం సర్వారాధ్యాయై నమః |
ఓం సర్వమయాయై నమః |
ఓం సర్వలోకాత్మికాయై నమః |
ఓం మహిషాసనాయై నమః |
ఓం బృహద్వారాహ్యై నమః | |౧౦౮|

ఇతి శ్రీ మహావారాహీ అష్టోత్తర శతనామావళిః

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*


శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో అషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

ముఖ్యమైన విషయం "భక్తులని కరుణించడం లో మొదటి స్థానం వారాహి రూపంలో ఉన్న అమ్మది అన్నే చెప్తాను నేను"

ఈ నెల అంటే జూన్ 26న గురువారం నుంచి మొదలై జులై 4న నవమి శుక్రవారం తోముగుస్తున్నాయి..తర్వాత రోజు శనివారం నాడు దశమి ఉదయం పూజ చేసుకొని సాయంత్రం ఉద్వాసన చెప్పుకోవాలి..

కలశస్థాపన సమయం జూన్ 26న తెల్లవారి జామున 5.30 నిమిషాలకు.. అది కుదరని వాళ్ళు 6 నుంచి 7 ప్రాంతంలోపు నుంచి చేసుకోవచ్చు..

ప్రత్యేకించి గుప్త నవరాత్రుల్లో పంచమి రోజు మహా విశేషమైనది అది మనకి 30వ తారీకు సోమవారం నాడు వచ్చింది ఆ రోజు అమ్మకి పసుపు కొమ్ములతో ఆరాధన చేసుకోండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి,,ఒకవేళ నవరాత్రులు చేయలేని వాళ్ళు ఈ పంచమినాడు అమ్మని ఆరాధిస్తే సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది..

ఏ పూజ అయిన సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి మీ సంకల్పము అంటే నీ కోరిక ఆయనకి చెప్పుకొని ( విఘ్నేశ్వరుని పూజ మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది),,ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి,,తర్వాత అమ్మ పరివారాన్ని తలుచుకొని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి..

చదువుకోవలసినవి;వారాహి ద్వాదశ నామాలు 9సార్లు తర్వాత కాలభైరవాష్టకం.. మీకు ఎంత కుదిరితే అంతా అమ్మ నామస్మరణ ధ్యానం చేసుకోండి..

నైవేద్యాలు; బెల్లం పానకం,,దానిమ్మ గింజలు,,తీపి దుంపలు,,శనక్కాయలు,,బీట్రూట్ క్యారెట్ ఏదన్న సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు..ఎరుపు పుష్పాలు సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవచ్చు..

ప్రతి ఒక్కలు కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైన దే,, ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం,,నమ్మకంతో సంతోషంగా పూజించుకొండి..

మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని వారాహి దేవి ద్వాదశ నామాలు మరియు కాలభైరవాష్టకం ఇంకా మీ వీలును బట్టి అని చదువుకోవచ్చు,, బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు రెండు పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి.

మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలసస్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకొని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు..బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం తినకూడదు ఇంట్లో వండకూడదు,,చాప వేసుకుని నేల మీద పడుకోవాలి( మీ ఆరోగ్య రిత్యా చూసుకోండి) తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి,,అతిగా తినకూడదు సాత్వికంగా మీ ఆరోగ్యం బట్టి భుజించండి,,రోజుకి తలంట స్నానం చేయాలా అంటే మీ ఆరోగ్య రీత్యా చూసి చేసుకోండి,,కానీ మొదటి రోజు తప్పకుండా తల స్నానం చేయండి రెండు రోజులకు ఒకసారి అన్నా సరే మీరు తలంటు స్నానం చేసుకోవచ్చు.. స్నానం చేసే నీళ్లల్లో పసుపు కలుపుకోండి,,ఈ నవరాత్రులలో చక్కగాఅమ్మవారి వలే అలంకరణ చేసుకోండి,,మిమ్మల్ని చూసి అమ్మ ఎంతో ప్రీతి చెందుతుంది,,ఎరుపే ప్రధానం.

మీ ఇంట్లో వారాహి అమ్మ చిత్రపటం ఉంటే అమ్మని పెట్టి పూజించండి లేనివాళ్లు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఉంటారో ఆ అమ్మవారిని పెట్టి పూజ చేసుకోండి,,అది కూడా కుదరకపోతే కలశంలోకి అమ్మని పిలుచుకొని సంతోషంగా మీ పూజను అందించుకోవచ్చు..

ఒకవేళ పూజలో అఖండ జ్యోతి కొండెక్కిపోతే స్నానం చేసి మళ్లీ చక్కగా జ్యోతిని వెలిగించుకోండి,,ఒకవేళ పూజ మధ్యలో నెలసరి వస్తే ఆ నాలుగు రోజులు పూజ మీ ఇంట్లో మీ భర్త పిల్లలు ఎవరో ఒకరు సమయానికి దీపం పెట్టి పళ్ళు నైవేద్యం కింద అమ్మకి సమర్పించుకోవచ్చు.

అమ్మకి నిత్యం ఒకటే మాట చెప్పండి నాపై దయతో చూడు తల్లి అని చెప్పి తెలిసి తెలియక ఏమన్నా తప్పులుంటే పూజలో క్షమించు తల్లి అని కూడాచెప్పుకుంటూ ఉండండి..

మీకు నచ్చినవన్నీ చదువుకోవచ్చు కుంకుమ పూజ చేసుకోవచ్చు, పుష్పర్చిన చేసుకోవచ్చు కానీ ఏం చేసినా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసుకోండి,,ముందుగా మిమ్మల్ని మార్చమని అమ్మని ప్రాధేయపడింది.

ఒకవేళ మీకు రాత్రి సమయమే పూజ చేసుకోవడానికి కుదిరితే సంతోషంగా చేసుకోవచ్చ నిజానికి ఉదయం పూజ కన్నా రాత్రి పూజ ప్రధానం అంటే సాయంత్రం 6:30 తర్వాత నుంచి ఉదయం 5:30 లోపు ఏ సమయంలో అన్న సరే పూజ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ కలిపురుషుడు ప్రభావంతో దేశం అతలాకుతలం అయిపోతుంది,,నువ్వే ఎలా అన్న మా అందరిని కాపాడమ్మా అని మరిచిపోకుండా అమ్మకి చెప్పండి..

ఆషాడ మాసంలో అమ్మకి శాకాంబరీ దేవి అలంకరణ కూడా మహా విశేషమైనది,,కాబట్టి కుదిరిన వాళ్ళందరూ అమ్మకి శాకాంబరీ దేవిగా కూడా అలంకరణ చేసుకోండి.

*శ్రీ మాత్రే నమః*

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

No comments: