*మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ 'అష్టమి వ్యాధి నాశినీ' అనేది ప్రసిద్ధ వాక్యం. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించినా, ఔషధాన్ని సేవించినా సత్వరం శుభఫలితం కలుగుతుందని 'చరక సంహిత' చెబుతోంది. మరి అష్టమినాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం. నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం. అవే అష్ట భార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అంటారు. ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా, వారంతా హరీ అన్నారు. ఒక్క అష్టమి అనే కాదు, ప్రతీ తిథీ మంచిదే. అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది,* *మనం అర్థం చేసుకుని ఆచరించాల్సిందీ ఇదే.*
*కష్టాలను తొలగించే అష్టమి*
*శివ పురాణం ప్రకారం, అష్టమి రోజు కాలభైరవుడిని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి.*
*"అత్యంత క్రూరమైన మహాకాయ కల్పాంత దహనోపం, భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమర్హసి||"*
*"ఓం భయహరణం చ భైరవః "*
*"ఓం కాలభైరవాయ నమః"*
*"ఓం హ్రీం బాం బతుకాయ్ ఆపదుద్ధరణయ్ కురుకురు బతుకాయ్ హ్రీమ్"*
*ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహం లేదా పఠం ఎదుట దీపం వెలిగించాలి.*
No comments:
Post a Comment