Adsense

Wednesday, June 4, 2025

స్కంద షష్టి




జ్యేష్టమాసం శుక్లపక్ష షష్టితిథి తో కూడిన ఆశ్లేష నక్షత్రం ఉన్నదీ, రేపు ఉదయం 7:59 వరకు షష్టి, ఉద్యమ 9:30 వరకు ఆశ్లేష నక్షత్రం ఉన్నదీ, దీనినే సుభ్రమణ్య షష్టి లేదా స్కంద షష్టి అంటారు. కావున సకల దోషాలను నివారించే పర్వదినం, ఈరోజు పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి, భోజనం చేయాలంటే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం మైథనం జోలికి వెల్లకూడదు, కింద గాయత్రి మంత్రాలను పటిస్తూ ఉండాలి.

గ్రహదోషాలు జాతక దోషాలు కలిగి ఉన్నవారు, రేపు ఆశ్లేషబలి పూజ అని శుభ్రమణ్య స్వామి ఆలయాలలో చేస్తుంటారు వెళ్లి పాల్గొనవచ్చు, లేదా మీ మీ శక్త్యానుసారము మీరే ఈ పూజ చేయించుకోవచ్చు...

సాక్షాత్తు అమ్మవారే వినాయకుడు,
సాక్షాత్తు పరమేశ్వరుడే సుబ్రమణ్యస్వామి,
సాక్షాత్తు హరిహరుల ఏకస్వరూపమే ధర్మశాస్త అయ్యప్ప కాబట్టి దైవానికి భార్య భర్త కుటుంబము అని చూడకుండ పరమాత్మ ఏ రూపాన ఉన్న ఆ రూపంలో పరబ్రహ్మాన్ని చూడటమే సనాతనధర్మం. భగవాన్ ఏ రూపాన్ని కూడ కించపరచకూడదు.

*కుమార గాయత్రీ మంత్రం:*

ఓం కుమారాయ విద్మహే |
సూర్యదేవాయ ధీమహి |
తన్నో కుమారః ప్రచోదయాత్ ||

*సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం:*

ఓం కార్తికేయాయ విద్మహే
వల్లీ-నాధాయ ధీమహి
తన్నో స్కంద ప్రచోదయాత్".

No comments: