*అజ ఏకాదశి* *శ్రీ విశ్వకర్మ జయంతి*
విశ్వకర్మ జయంతి ఎందుకు జరుపుకుంటారో, విశ్వకర్మ ఎవరో తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదిన విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు.
ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు.
వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనారు.
అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడరు.
పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినారు, సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినారు.
సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త.
ఈయన కిరీటాన్ని, సువర్ణా భరణాలను ధరించి ఎనిమిది హస్తములు కలిగి, ఒక చేతిలో నీటి బిందెను, ఒక చేత గ్రంధాన్ని, ఒక చేత ఉచ్చు, మిగిలిన హస్తాలయందు వివిథ ఆయుధాలను మరియు పనిముట్లను ధరించి దివ్య పురుషునిగా దేవతలచే కీర్తించబడేవాడు.
ఈయను దేవతల శిల్పి (దేవా శిల్పి) అంటారు.
వృత్తి విద్యలు, నిర్మాణ, ఇంగినేరింగ్ విభాగాలకు సంబంధించిన విద్యలకు ఈయన అధిపతి.
విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు, అధిపతి, దేవలోకాలను నిర్మించిన భవన శిల్పి, వాస్తు శిల్పి, స్థపతి (ఆర్కిటెక్చర్).
దేవతలకు ఆకాశాన విహరించే పుష్పక విమానాలు, ఆయుధాలు, వివిధ రకాల సువర్ణాభరణాలు మరియు పనిముట్లను సృష్టించి ఇచ్చిన రూప శిల్పి.
విశ్వకర్మ భగవానుడు సమస్త హస్తకళలన్నింటికి ఆది దేవుడు మరియు విశ్వము యొక్క ప్రధాన రూపశిల్పి.
విశ్వకర్మ ప్రపంచానికి దైవ యాంత్రికుడు (ఇంజనీరు).
అతను మొత్తం విశ్వం యొక్క దివ్య చిత్రలేఖకుడు, మరియు అన్ని దేవతల 'రాజభవనాలు అధికారిక భవన నిర్మాతగా వున్నాడు.
విశ్వకర్మ దేవతల యొక్క అన్ని చదరంగము ఆట మరియు వారి ఆయుధాలను రూపకర్త ఉన్నాడు. మహాభారతంలో అతనిని గురించి వివరిస్తుంది వెయ్యి హస్తకళాకృతులను కార్యనిర్వాహణాధికారి దేవతల యొక్క వడ్రంగి, చేతివృత్తుల అత్యంత ప్రముఖత, అన్ని ఆభరణాలు యొక్క రూపకర్త.
మన పురాణాలన్ని విశ్వకర్మచే సృష్టించబడిన అద్భుత నిర్మాణాలతో నిండినవే.
నాలుగు యుగాలన్నింటిలోను ఆయన దేవతలకు అనేక పట్టణాలు మరియు రాజభవనాలు నిర్మించి ఇచ్చిన స్థపతి, వాస్తు మరియు భవన శిల్పి.
సత్య యుగంలో ఇంద్రుడు పరిపాలించే ఇంద్ర లోకాన్ని, త్రేతాయుగంలో స్వర్ణ లంకను, ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన అద్భుత శిల్పి, గొప్ప స్థపతి.
విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి.
సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది.
మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించినంది.
ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది.
సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు, వారు విశ్వకర్మకు జన్మించారు.
విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు.
విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, *ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (అనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు.*
*_అనగ_* ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మను ముఖం నుండి వచ్చినవాడు.
ఈయనకు మూలాఆధారం శివుడు, ఇతను చెప్పే శాస్త్రం తర్కం, ఈయన వృతి అయో శిల్పి.
*_సనాతన_* ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మయ ముఖం నుండి వచ్చినవాడు.
ఈయనకు మూలాఆధారం విష్ణువు.
ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం, ఈయన వృతి దారు శిల్పి.
*_అహభౌసన_* ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో త్వష్ట ముఖం నుండి వచ్చినవాడు.
ఈయనకు మూలాఆధారం బ్రహ్మ, ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం, ఈయన వృతి తామ్ర శిల్పి.
No comments:
Post a Comment