శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర పదకొండవ భాగం.. ప్రారంభం...!!🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అందుచేత మీరు జాగ్రత్తగా ఆలోచించి అతని అడ్డును పూర్తిగా తొలగిపోయేలా చేసుకోవాలి !శతృశేషం వుండటం మంచిది కాదని మీకు మాత్రం తెలియదా ? అన్నాడు ఆమె ముఖ కవళికలు గమనించడానికి ప్రయత్నిస్తూ !
🌸 ‘‘నాకేమీ పాలు పోవటంలేదు ! నేనేం చేస్తే నాకు , నా పుత్రుడికి మంచిదో మీరే చెప్పండి మంత్రిగారూ !’’ అడిగింది రాణి ప్రాధేయపూర్వకంగా ! ‘‘మీరు అడిగారు గనుక చెబుతున్నాను ! జాగ్రత్తగా వినండి !’’ అంటూ ఆమెను సమీపించి లోగొంతులో తన పథకం గూర్చి తెలియజెప్పాడు.
🌿‘‘ఈ విధంగా చేయడంవలన ఎవరికీ మీ మీద అనుమానం రాదు ! ఇప్పటికి పట్ట్భాషేకం ఆగిపోతుంది ! కొద్దికాలం తర్వాత ఎట్లాగూ మీ పుత్రుడికే పట్టంగట్టక తప్పదు రాజుగారికి !’’ అన్నాడు. మొదట తటపటాయించినా చివరకు స్వార్థం , ఈర్ష్యాసూయలే గెలవటంతో మంత్రి చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది రాణీదేవి !
‘‘మరి నేను సెలవు తీసుకుంటాను ! మీరిక నిశ్చితంగా వుండండి !’’* అని చెప్పి లేచాడు మంత్రి !
🌸మహారాణి అస్వస్థత
‘‘మహారాజా! మహారాజా !’’ అంతఃపుర పరిచారికలు పరుగు పరుగున రావటం గమనించి ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడు రాజశేఖరుడు ! ‘‘మహారాణి విపరీతమైన శిరోభారంతో బాధపడుతున్నారు ! మిమ్మల్ని వీలైతే ఒకసారి రమ్మని కోరుతున్నారు !’’ అంటూ వాళ్లు చెప్పింది విని దిగ్గున లేచాడు రాజశేఖరుడు !
🌿 ‘‘కొద్దిరోజుల క్రితం మణికంఠుడు , ఇప్పుడు మహారాణి - ఏమిటిలా అస్వస్థతలు సంభవిస్తున్నాయి రాజకుటుంబంలో ! కారణమేమై వుంటుంది ?’’ అనుకుంటూ అంతఃపురానికి బయలుదేరాడు. మణికంఠుడు కూడా ఆయన వెంట వెళ్లాడు. వాళ్లు వెళ్లేసరికి తల్పంమీద నొప్పితో మెలికలు తిరిగిపోతూ మూలుగుతున్నది రాణి ! పరిచారికలు ఆదుర్దాగా చూస్తున్నారు ! కొద్దిసేపటిముందే వచ్చిన రాజవైద్యుడు నాడి చూస్తూ ఆలోచిస్తున్నాడు !
🌸‘‘ఏమైంది మహారాణికి ? రోగమేమిటి ?’’ అంటూ ప్రశ్నించాడు రాజశేఖరుడు రాజవైద్యుడిని !‘‘మహారాజా! ఇదొక ప్రమాదకరమైన రోగం ! తల , కడుపుతో ప్రారంభమై శరీరంలో అన్ని భాగాలు బాధతో నిండిపోయి , చలనం కోల్పోవడం , మరణం సంభవించడం జరుగుతాయి’’ చెప్పాడు వైద్యుడు. ‘‘మరి వెంటనే చికిత్స ప్రారంభించకుండా ఏమాలోచిస్తున్నారు ?’’ గద్దించాడు రాజు ! ‘‘క్షమించండి మహారాజా ! ఈ రోగానికి కావలసిన మందు మా దగ్గరలేదు ! అది బయట దొరకడం కూడా చాలా కష్టం ! కానీ అది లభిస్తే మాత్రం రోగం తగ్గడానికి అవకాశం వుంది !’’ జంకుతూ చెప్పాడు వైద్యుడు !
🌿‘‘ఊరికే సమయం వృధా చేయకుండా ఆ మందేమిటో చెప్పండి త్వరగా ! తెప్పించే బాధ్యత నాది’’ అన్నాడు రాజు అసహనంగా చూస్తూ ! ‘‘పులి పాలు ! పులి పాలు గనక తెప్పించగలిగితే , దానిలో మరికొన్ని మూలికలు కలిపి తాగిస్తే మహారాణికి ఉపశమనం లభిస్తుంది !’’ అన్నాడు వైద్యుడు. ‘‘పులి పాలా?’’ అంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు రాజు !
🌸‘‘పులి పాలు తేవడం మనుష్యులవల్ల జరిగే పనేనా ? ఎవరు ఆడపులిని సమీపించి పాలు పితికి తేగలుగుతారు ? అందుకు ప్రయత్నించి ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం ! వైద్యులారా ! మీ శాయశక్తులా ప్రయత్నించండి ! దైవంమీద భారం వేసి ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నాడు విషాదంగా !
🌿రాణి అరుపులు , మూల్గుడు ఎక్కువైనాయి. ఆమె బాధ చూడలేనట్లు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు రాజు ! మణికంఠుడు మెల్లగా ఆయనను సమీపించి ‘‘నాన్నగారూ ! నేను వెళ్లి పులి పాలు తీసుకువచ్చి తల్లిగారి రోగం తగ్గిపోయేలా చేస్తాను ! మీరు ఆందోళన పడకుండా నేను అడవిలోకి వెళ్లడానికి అనుమతి ప్రసాదించండి ’’ అన్నాడు మణికంఠుడు ! అతను ఆ విధంగా అంటాడని ఊహించలేదు రాజు ! అందుకే కంగారుగా వారించాడు !
🌸 ‘‘నీవు వెళ్లి పాలు తెస్తావా ? వద్దు నాయనా వద్దు ! అంతటి ప్రమాదకరమైన పనికి నిన్ను పంపలేను ’’ అన్నాడు ఆందోళనగా చేయి పట్టుకుని ! ‘‘తల్లి ఆరోగ్యం ముఖ్యం నాకు ! పని ఎంత ప్రమాదకరమైనా ఫర్వాలేదు ! నన్ను వెళ్లనివ్వండి ! ఆశీర్వదించి పంపండి ’’ అంటూ నమస్కరించాడు. రాజు ఎంత నచ్చచెప్పజూసినా మణికంఠుడు వినిపించుకోలేదు !
🌿అంతవరకూ మోనంగా చూస్తున్న మంత్రి ముందుకు వచ్చాడు గొంతు సవరించుకుంటూ ! ‘‘మహారాజా ! మీరు రాకుమారుని శక్తి సామర్థ్యాలను తక్కువగా అనుకుంటున్నారు. అతను తప్పక తీసుకురాగలుగుతాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతిచ్చి పంపండి . మహారాణి ఎట్లా అల్లాడిపోతున్నారో చూడండి. సమయం మించిపోయాక విచారిస్తే లాభం వుండదు ’’ అన్నాడు. లోలోపల మణికంఠుడెక్కడ తన ఉద్దేశ్యం మార్చుకుంటాడోనని భయపడుతూ ! అతనివైపు చిరునవ్వుతో చూశాడు మణికంఠుడు ! రాజు కూడా మనసు దిటవు చేసుకున్నాడు.
🌸‘‘సరే ! ఇంతగా చెబుతున్నారు గనక అనుమతినిస్తున్నాను ! వత్సా ! మణికంఠా ! క్షేమంగా వెళ్లి పులి పాలు తెచ్చి మీ తల్లి ప్రాణాలు నిలుపు విజయోస్తు ’’ అంటూ ఆశీర్వదించాడు.
🌿నమస్కరించి బయలుదేరబోయాడు మణికంఠుడు ! అంతలో ఏదో గుర్తువచ్చినట్లు ‘‘ఆ ! ఒక్క క్షణం ఆగు ! అసలే భయంకర క్రూర మృగాలుండే అడవిలోకి ఒంటరిగా వెళుతున్నావు ! అదీ కాలినడకన ! నీ వెంట ఈ ఆహార పదార్థాలను తీసుకువెళ్లు కుమారా ! ఎక్కడైనా అలుపు , ఆకలి కలిగితే వాటిని ఆరగించు’’ అంటూ ఒక సంచీ తెప్పించాడు.
🌸లోపల రెండు అరలుగా ఏర్పాటుచేసి ఒకవైపు దాంట్లో ఒక కొబ్బరికాయనుంచాడు. ‘‘మన యిష్టదైవం పరమేశ్వరునికి ప్రతిరూపంగా ఈ కొబ్బరికాయను వుంచుతున్నాను నీకు రక్షగా ’’ అంటూ మూటగా కట్టాడు ! రెండవ వైపు అవసరమైన ఆహార పదార్థాలు వుంచి వేరుగా కట్టాడు ! ఆ మూటను మణికంఠుని తలమీద వుంచి భారమైన హృదయంతో వీడ్కొలిపాడు రాజు ! మణికంఠుడు భవనం నుండి బయటకు వచ్చి తనను వెళ్లవద్దని బ్రతిమాలుతున్న ప్రజలను సమాధానపరచి వడివడిగా అరణ్యమార్గంవైపు సాగిపోయాడు.
🌹మణికంఠుని అరణ్య ప్రవేశం - మహిషి సంహారం🌹
🌿మణికంఠుడు అరణ్యంలో ప్రవేశించగానే అంతవరకు దట్టమైన వృక్షాలతో సూర్యరశ్మి చొరబడకుండా చీకటితో నిండి వుండే ఆ ప్రాంతమంతా దివ్యమైన కాంతితో నిండిపోయింది. ‘‘భూతనాథుడు మణికంఠునికి స్వాగతం ! స్వామీ ! నీకు మా ప్రణామాలు ! అంటూ పరమేశ్వరుడు పంపగా భూతగణాలు సాక్షాత్కరించాయి.
🌸మణికంఠుని ముందర !’’ ‘‘స్వామీ ! వీపర , వీరభద్ర , కూపనేత్ర , గండకర్ణ , కటుసబ్ద అనబడే మేము పరమేశ్వరుని భూతగణాలలోని వారిమి ! ఇకపై మీ సేవకులమై కొలవడానికి వచ్చిన మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి !’’ అంటూ వేడుకున్నాను. ‘‘భూతగణాలులారా ! మిమ్మల్ని నా అనుచరులుగా స్వీకరిస్తున్నాను !’’ ప్రసన్నంగా వాళ్లవైపు చూస్తూ అన్నాడు మణికంఠుడు.
🌿వారి వెంట పంబా నదీ తీర ప్రాంతానికి చేరుకున్నాడు. మణకంఠుడు ! స్వామి అక్కడకు వచ్చిన సంగతి నారదుని ద్వారా తెలుసుకుని దేవతలు , ఋషిగణాలు అక్కడకు చేరుకుని భక్తిపూర్వకంగా నమస్కరించారు. ‘‘హే ! హరిహరపుత్రా ! వరగర్వంతో మమ్మల్ని ఆరడిపెడుతున్న మహిషి ఈ ప్రాంతంలోనే ఒక గుహలో విశ్రమిస్తున్నట్లు మాకు తెలియవచ్చింది మీరిక్కడ కొంతసేపు విశ్రమించి , మా పూజలు స్వీకరించి మీ అవతార లక్ష్యమైన మహిషి సంహారం కావించవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అంటూ విన్నవించుకున్నారు.
🌸ఇంద్రుడు స్వర్ణమయమైన ఆలయాన్ని అక్కడ ఆవిర్భవింపజేశాడు ! అందులో బంగారు సింహాసనం మీద ఆసీనుడైనాడు మణికంఠుడు ! ఇంద్రుడు , దేవతలు , మునిగణాలు మణికంఠస్వామిని ధర్మశాస్తాను కీర్తిస్తూ పూజించారు.
🌹ధర్మశాస్త పంచరత్నం శ్లోకం..
🌷లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం, పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం🌷
🌷విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం, క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం, సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం🌷
🌹ఫలశృతి: 🌹
🌷పంచరత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే!🌷
🌹(ఈ స్తోత్రాన్ని ప్రతిదినం పఠించేవారి హృదయాలలో ధర్మశాస్తా ప్రసన్నుడై నివసిస్తుంటాడు.)🌹
🌸దేవతల స్తోత్రాలకు ప్రస్తుతులకు ప్రసన్నుడైనాడు మణికంఠుడు ! అభయం ప్రసాదించాడు.
🌿‘‘దేవతలారా ! ఋషిగణ ముఖ్యులారా ! మీరిక నిశ్చింతగా వుండండి ! లోకాలలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న మహిషిని ఇప్పుడే వధించి అవతార లక్ష్యాన్ని నెరవేరుస్తాను ! ఇప్పుడు ఆ మహిషి ఎక్కడుందో చెప్పండి’’ అన్నాడు.
🌸 ‘‘స్వామీ ! ఈ పరిసర ప్రాంతంలోనే ఒక గుహలో నిద్రిస్తున్నదని తెలుసుకున్నాము ! మీరే దాన్ని వెలుపలికి రప్పించాలి !’’ చెప్పాడు ఇంద్రుడు. ‘‘సరే ! మీరందరూ ఇక వెళ్లండి ! నేను నా కార్యం నెరవేరుస్తాను అని చెప్పడంతో దేవతలు , మునిగణాలు నమస్కరించి అదృశ్యులైనారు !.. సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞

No comments:
Post a Comment