శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 12,వ భాగం.. ప్రారంభం...!!🌹
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸 ‘‘స్వామీ ! ఈ పరిసర ప్రాంతంలోనే ఒక గుహలో నిద్రిస్తున్నదని తెలుసుకున్నాము ! మీరే దాన్ని వెలుపలికి రప్పించాలి !’’ చెప్పాడు ఇంద్రుడు. ‘‘సరే ! మీరందరూ ఇక వెళ్లండి ! నేను నా కార్యం నెరవేరుస్తాను అని చెప్పడంతో దేవతలు , మునిగణాలు నమస్కరించి అదృశ్యులైనారు !
🌿మణికంఠుడు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లుగా నోటితో సింహనాదాన్ని కావించాడు ! సింహగర్జన కన్నా ఎంతో ఎక్కువగా ఆ గర్జన ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది ! ఆ శబ్దానికి గుహలో నిద్రిస్తున్న మహిషి లేచింది.
🌸‘‘ఎవరా ధ్వని చేసింది ? మహిషికి నిద్రాభంగం కావించే సాహసం చేసినవారెవరు ?’’ అని గర్జిస్తూ గుహ వదలి అరణ్యమార్గం వెంట రాసాగింది ! అందుకోసమే ఎదురుచూస్తున్న మణికంఠుడు తాను కూడా గర్జిస్తూ ఆమెను ఎదుర్కొన్నాడు !
🌿ఒకరినొకరు ఢీకొంటూంటే ఆ శబ్దానికి అరణ్యమంతా ప్రతిధ్వనించసాగింది ! మహిషి , మణికంఠుల పోరు చూడటానికి పరమేశ్వరుడు నంది వాహనంపై వచ్చి ఆకాశ మార్గాన నిలిచి చూడసాగాడు ! పరమేశ్వరుని వెనుకగా నిలిచి దేవతలంతా కూడా చూస్తున్నారు ఉద్రిక్తతతో నిండిన హృదయాలతో !
🌸మహిషి మర్దనం
మహిషి రాక్షస రూపు ధరించి వేగంగావచ్చి మణికంఠుని తాకి కొమ్ములతో పొడవబోయింది !ఒడుపుగా ఆ కొమ్ములను పట్టి దాని వేగాన్ని నిరోధించి రెండు చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పి భూమిపైకి విసిరివేశాడు మణికంఠుడు.
🌿 కఠినమైన బండరాళ్లమీద నుండి పడటంతో మహిషి శరీరమంతా రక్తసిక్తమై బాధతో విలవిలలాడసాగింది ! కళ్లనుండి ధారగా కన్నీళ్లు ప్రవహించసాగాయి ! ‘‘స్వామీ ! దానిపై కరుణ చూపవద్దు ! వధించివేయి !’’ అంటూ వేడుకోసాగారు దేవతలు ఆకాశమార్గం నుండి !
🌸 అందరూ చూస్తుండగా మణికంఠుడు మహిషి శరీరంపై ఎక్కి నిలిచి పాదాలతో మర్దిస్తూ నాట్యం చేయసాగాడు ! అప్పుడు మహిషి కళ్లకు తన శరీరాన్ని మర్దిస్తున్న స్వామి జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు ! తను బ్రహ్మదేవుని కోరిన వరం గుర్తుకు వచ్చింది ! హరిహరుల పుత్రుడు ఈతనే !
🌿ఈ అసాధారణుని చేతిలోనే తాను చావును కోరుకున్నది అన్న స్ఫురణ కలిగింది ! అతి కష్టంమీద చేతులు జోడించి నమస్కరిస్తూ ‘‘స్వామీ ! నన్ను వధించవచ్చిన మహాకాలునిగా నిన్ను గుర్తించాను. నా ప్రణామాలు స్వీకరించు ! కరుణాసింధు ! నా పాపాలను మన్నించు. శాంతించి నాకు బాధనుండి ఉపశమనం ప్రసాదించు ! నీ పాద తాడనాలను భరించలేకుండా ఉన్నాను.
🌸నాపట్ల కనికరం చూపించు ’ అంటూ వేడుకుంది దీనంగా. అప్పటికే కళ్లనుండి ప్రవహిస్తున్న కన్నీళ్ళు అక్కడ ఒక నదీ ప్రవాహంగా ఏర్పడ్డాయి ! మహిషి ప్రార్థనలతో శాంతించాడు మణికంఠుడు ! నాట్యం ఆపుచేసి క్రిందికి దిగి తన అమృత హస్తంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు.
🌿మణికంఠుని హస్త ప్రభావంతో మరుక్షణం మహిషి రాక్షస రూపు మాయమై లీలావతి నిలిచింది. ‘‘హరిహర పుత్రా ! పాహిమాం ! పాహిమాం !’’ అంటూ స్వామి పాదాల దగ్గర మోకరిల్లింది !
🌸స్వామి పద్మాలపైనుండి పైకి సాగిన ఆమె చూపులు మణికంఠుని సుందరమైన ముఖంవరకు వచ్చి ఆ ముగ్ధ మోహన రూపాన్ని చూస్తూ పులకించిపోయాయి ! ‘‘లీలావతి ! అజ్ఞాన భూయిష్టమైన మహిషి రూపం పోయి నీ పూర్వ జన్మను తిరిగి పొందగలిగావు ! ఇకపై దేవతలవైపు వెళ్ళే సాహసం చేయకుండా వన భూములలో తపస్సు చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపు !’’ అంటూ గంభీరంగా ఆదేశించాడు మణికంఠుడు !
🌿లీలావతి స్వామివైపు దీనంగా చూసింది ! ‘‘స్వామీ ! మీ స్పర్శతో నన్ను పునీతురాలిని చేశారు ! నన్ను మీ పత్నిగా స్వీకరించి నా జీవితానికి పూర్ణత చేకూర్చండి’’ అని ప్రార్థించింది. ఆమె కోరిక విన్న దేవతలందరూ ఆందోళనగా చూస్తున్నారు మణికంఠుని సమాధానం ఎట్లా ఉంటుందోనని !
🌸‘స్వామి మహిషిని కరుణించి పూర్వజన్మ రూపం ప్రసాదించకుండా వధించివేసి వుంటే బాగుండేది ! ఇపుడు తిరిగి ఎటువంటి అసాధారణమైన కోర్కె వెలిబుచ్చిందో చూసారా మహర్షి ! ఎంత మాత్రం జంకులేకుండా ?’’ ఇంద్రుడు లీలావతి వైపు కసిగా చూస్తూ అన్నాడు నారదునితో.
🌿‘హరిహరుల అంశలతో జన్మించినవాడు కదా మణికంఠుడు ! కరుణారూపుడు ! శరణన్న స్త్రీ ని క్షమించడంలో ఆశ్చర్యమేముంది ? ఇప్పుడిక ఏం చేస్తాడో చూద్దాం ! తొందరపడకండి !’’ అంటూ సమాధానపరిచాడు నారదుడు !
🌸లీలావతికి వరప్రదానం
లీలావతి కోరిక విని చిరునవ్వు నవ్వాడు మణికంఠుడు ! ‘‘ఓ స్త్రీ రత్నమా ! మహిషిగా అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న నీలోని బుద్ధిమాంద్యాన్ని , అహంకారాన్ని నిర్మూలించి నిన్ను పవిత్రురాలిని చేయడానికే నీ శరీరంపై నాట్యం చేశాను ! నీ బాధ చూడలేక నా హస్తస్పర్శతో ఉపశమనం కలిగించాను ! నీవు స్వతహాగా ఉత్తమురాలివి ! దేవీమాతల అంశలనుండి ప్రాదుర్భవించిన కాంతవు !

🌿అయినా మాయామోహితురాలివై విషయవాంఛలకు లోనైనావు ! ఇకపై నీవు మాయకతీతురాలివై దైవత్వాన్ని పొంది నా భక్తుల చేత పూజింపబడేలా వరాన్ని ప్రసాదిస్తున్నాను !’’ అన్నాడు . లీలావతి దివ్య రూపంతో సాక్షాత్కరించింది ! మణికంఠుని వైపు భక్తి పూర్వకంగా చూస్తూ ‘స్వామి ! ఈ దైవత్వానికన్నా మీకు పత్నిగా మీ సాన్నిధ్యంలో వుండటాన్నే నేను కోరుకుంటున్నాను ! ఈ భక్తురాలి కోరిక మన్నించండి స్వామీ !’’ అని ప్రాధేయపడింది తిరిగి !
🌸మణికంఠుడు తిరిగి కొద్దిసేపు ఆలోచనామగ్నుడైనాడు ! మహిషి , ఆకాశాన దేవతలు ఉద్విగ్నతతో చూస్తున్నారు !
🌿ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ఈ విధంగా పలికాడు !
‘‘ఈ అవతారంలో నేను బ్రహ్మచారిగానే ఉంటాను ! అందుచేత నీ కోరిక తీర్చే అవకాశం లేదు ! ఓ కాంతామణి ! మరికొద్దికాలంలో ఈ ప్రదేశమంతా పుణ్యక్షేత్రంగా మారుతుంది ! నాకు మారుగా ఇక్కడ నా శక్తిని విగ్రహరూపంలో విడిచివెళతాను !
🌸ఆ నా యొక్క ప్రతిరూపాన్ని దర్శించడానికి ఎందరో భక్తులు తరలివస్తారు ! నీవు విగ్రహ రూపంలో నాకు ఎడమవైపుగా విడిగా ప్రతిష్ఠురాలివై భక్తుల ననుగ్రహించు ! మంచాంబిక , మాలికాపురత్తమ్మ అనే పేర్లతో పూజింపబడుతావు ! ప్రతి సంవత్సరం నా వ్రతదీక్ష స్వీకరించి కన్నె సాములు (మొదటిసారిగా స్వామి సన్నిధికి వెళ్లేవాళ్లు) ఎందరో వస్తారు ! వాళ్లందరి కోరికలు తీర్చడం నా బాధ్యత ! అందుచేత జ్యోతి రూపంలో మకర సంక్రమణ దినాన వాళ్లకు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంటాను !
🌿 ఏనాడైతే కన్నే స్వాములు ఒక్కరైనా నా సన్నిధికి రాకుండా వుండటం జరిగితే తిరిగి ఈ రూపంలోనే దర్శనమిచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను ! అంతవరకు వేచి వుండు !’’ అని చెప్పాడు ! ఆ మాటలతో తృప్తిపడింది మంచాంబికగా మారిన లీలావతి ! మణికంఠునికి నమస్కరించి అంతర్థానం చెందింది !
🌸ఆమె వెళ్లిపోవటటంతో దేవతలు , ఋషిగణాలు పరమేశ్వరునితోబాటు భూమిమీద సాక్షాత్కరించారు.
‘‘పుత్రా ! మహిషికి దైవత్వాన్ని ప్రసాదించి ధన్యురాలిని కావించి నీ ధర్మ నిరతిని అందరికీ తెలిపేలా చేసినందుకు ఆనందిస్తున్నాను !
🌿నీవన్నట్లుగానే లీలావతిలో రజో తమోగుణాలు ప్రభావితం చెందడం చేత ఆమె నుండి వాటిని వేరు చేసి ఆమె శరీరం మనస్సు పవిత్రం చేయడానికే నీవు మహిషిని మర్దించావని గ్రహించాను ! ధర్మాన్ని శాసించే ధర్మశాస్తావు కావడం చేత ఆమెవల్ల తిరిగి అరాచకం ప్రబలకుండా దేవతలకు హాని , నష్టాలు సంభవించకుండా ఉండాలని దైవత్వాన్ని ప్రసాదించి నీ సన్నిధిలో వుండిపోయేలా చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను !’’ అని చెబుతూ పుత్రుని గాఢాలింగనం చేసుకున్నాడు పరమేశ్వరుడు.
🌸 పరమేశ్వరుని మాటలు విన్న దేవతలు భయం తీరి కృతజ్ఞతా పూర్వకంగా స్వామికి నమస్కరించారు ! ‘‘ఇక త్వరలో భూలోకాన్ని వదిలి నీ స్వస్థానానికి చేరుకోవలసింది’’ అని మణికంఠుని ఆలింగనం చేసుకుని కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు పరమేశ్వరుడు!
🌿మణికంఠుని తిరుగు ప్రయాణం
ఇంద్రాది దేవతలు మహిషి బెడద తీర్చి స్వర్గాన్ని తిరిగి తమకు అప్పజెప్పిన మణికంఠుని బంగారు ఆలయంలో ఎతైన సింహాసనంమీద ఆసీనుడిని చేసి పరి పరి విధాలుగా ప్రస్తుతించారు.
🌹హరిహరాత్మజ అష్టకం🌹
🌹‘‘హరి వరాసనం స్వామి విశ్వమోహనం
హరితధీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకం
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’🌹
‘🌹‘శరణ కీర్తనం స్వామి శక్తిమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం!
అరుణ భాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’🌹
🌸వాళ్ళు చేసిన స్తుతులకు ప్రసన్నుడైనాడు మణికంఠుడు ! వాళ్ళవైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘ఇంద్రాది దేవతలారా ! మీకు మహిషి నుండి రావలసిన మీ స్వర్గ్భోగాలు మీకు తిరిగి లభించాయి ! నా అవతార లక్ష్యం నెరవేరింది గనుక నన్ను తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారు మీరు !
🌿కానీ పన్నెండు సంవత్సరాలు పందల రాజకుమారుడిగా జీవించినందువల్ల రాజ కుటుంబం పట్ల , ప్రజలపట్ల నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని మిగిలి వున్నాయి ! వాటిని కూడా పూర్తిచేయాలి ! ఇప్పుడు నేను అడవిలోకి వచ్చింది తల్లి అస్వస్థత పోగొట్టే పులి పాలు తీసుకువెళ్లడానికి ! అందుకు మీరు నాకు సహాయపడవలసి వున్నది’’ అన్నాడు !
🌸‘‘అంతకంటే భాగ్యం మరొకటుంటుందా ? ఈ సేవకులను ఆజ్ఞాపించండి స్వామి ఏం చేయాలో !’’ అన్నారందరూ ఉత్సాహంగా ! ‘‘ఇంద్రా ! నీవు మగ పులివై నాకు వాహనం అవాలి ! దేవతలారా ! మీరందరూ ఆడ పులులై నా వెనకే కదిలి రావాలి !’’ గంభీరంగా చెప్పాడు మణికంఠుడు !
🌿 ‘‘మీ ఆజ్ఞానువర్తులం స్వామీ!’’ అంటూ అందరూ వ్యాఘ్రాలు (పులులు)గా మారి నిలిచారు ! మణికంఠుడు అన్నిటికన్నా పెద్దదైన మగ పులి మీద ఎక్కి కూర్చున్నాడు ! అది గర్జిస్తూ ముందు వెళుతుంటే వెనక పులుల మంద కూడా గర్జిస్తూ అనుసరించాయి...సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞

No comments:
Post a Comment