శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 18,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸‘‘గురువర్యులకు ప్రణామాలు ! మీ సందేశం అందుకుని వెంటనే బయలుదేరాము ! మా ప్రాంతంలో పవిత్ర గోదావరి నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! స్వామి కార్యమని నమస్కరించి విన్నవించాము !
🌿ఆ నదీమతల్లి కరుణతో రెండు పాయలుగా చీలి మాకు దారి ఇచ్చింది ! త్వరగా దాటి ఇలా మీ సన్నిధికే వస్తున్నాము ! ఆలస్యానికి మన్నించండి !’’ అంటూ విన్నవించుకున్నవారు ఆ ఇద్దరు వ్యక్తులు ! పరశురాములవారు వాళ్ల వైపు ప్రసన్నంగా చూసారు !
🌸‘‘పరవాలేదు ! మేము అర్థం చేసుకున్నాము !’’అంటూ రాజును , ప్రజలను ఉద్దేశిం ‘‘భక్తులారా ! ఇకపై వీరే ఈ ఆలయ బాధ్యతలన్నీ నిర్వహిస్తారు ! రేపటి నుండి స్వామికి వేదోక్తంగా పూజావిధులు జరుపుతారు ! వీరు తపస్సంపన్నులు ! తారక బ్రహ్మ అయ్యప్ప స్వామి భక్తులు ! గోదావరి నది తీర ప్రాంతంలో హరిహరుల దేవాలయంలో అర్చకులైన వీరు ఇక్కడ స్వామిని సేవించడానికి అర్హులని నిర్ణయించి ఇక్కడకు రప్పించడం జరిగింది !
🌿వీరి పేర్లు తాయమన్ సోదరులు ! ఇప్పటినుండీ వీరు , వీరి తర్వాత వీరి వంశస్థులు అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులుగా ఈ ప్రాంతంలోనే నివసించగలరు ! మేము వారికన్నీ వివరంగా తెలిపి వెళుతాము ! మీరందరూ తిరిగి వెళ్లి రేపు ఉదయం వచ్చి దర్శించుకోండి ! ప్రధాన తంత్రులు (అర్చకులు) అయిన వీరే గురువులుగా మీకు స్వామి ఆరాధనా విధులు తెలియజెబుతారు !
🌸అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి జీవితాలు ధన్యం చేసుకోండి !’’ అని తెలియజెప్పారు ! ‘‘మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాము ! మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము! స్వీకరించండి గురుదేవులారా !’’ అంటూ పరశురాములవారికి అగస్త్య మహర్షికి ప్రణామాలు అర్పించి కొండ దిగి వచ్చారు రాజు , పరివారం , పందల రాజ్య ప్రజలు !
🌿 మర్నాడు వారందరూ తిరిగి కొండమీదికి వచ్చేసరికి ప్రధాన తంత్రులు స్వామికి అభిషేకార్చనలు , అలంకారం , పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ! అవన్నీ చూసి పులకించిపోయారు రాజు, పరివారం !
🌸వాళ్లను చిరునవ్వుతో పలకరించి తీర్థ , ప్రసాదాలు ఇచ్చారు అర్చక తాంత్రులు ! ‘‘భక్తులారా ! స్వామిని మీరీవిధంగా రోజూ దర్శించుకోవచ్చును ! మీరు తనివితీరా దర్శించుకుని మీ నివాసాలకు తిరిగి వెళ్లి మీ గృహాలలో స్వామి రూపాలను చిత్రపటాలుగా గానీ , విగ్రహాలుగా గానీ పవిత్రమైన స్థలంలో వుంచుకుని పూజించుకోండి !’’ అంటూ వాళ్లకు చిత్ర పటాలు , విగ్రహాలు ఇచ్చారు!
🌿 ‘‘రాజా ! పరశురాములవారు , అగస్త్య మహర్షి మీ అందరికోసం ఈ పటాలను , విగ్రహాలను ఇచ్చి వెళ్లారు ! స్వామికి రోజూ పూజార్చనలు చేసుకోండి ! మీకు మనస్సు కలిగినప్పుడు వచ్చి ఈ శబరిగిరి క్షేత్రంలో స్వామిని దర్శించుకోండి ! మీకు పూజా విధానం తెలియజేస్తాము !
🌸 మీరు మీ రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ కూడా స్వామికి ఆలయం నిర్మింపజేయండి నిపుణులైన శిల్పులతో ! స్వామి విగ్రహ ప్రతిష్ఠ మేము కావించుతాము !’’ అంటూ ప్రధాన తాంత్రి చెప్పినది విని ‘‘తప్పకుండా అట్లాగే చేస్తాను ! అర్చకస్వాములారా ! నాదొక విన్నపం !
🌿మణికంఠుడు మా కన్నుల వెలుగు రాజకుమారునిగా అమూల్యమైన ఆభరణాలు ధరించి ఆనందాన్ని పంచిన రోజులు ఇంకా మా కళ్లముందు కదలాడుతూనే వున్నాయి ! పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆభరణాలు తీసివేసి నార బట్టలు ధరించి వెళ్లాడు ! ఆ నగలు రాజభవనంలో జాగ్రత్త చేయబడి వున్నాయి ! వాటిని స్వామి విగ్రహానికి అలంకరింప జేయాలని ఆశిస్తున్నాను !’’ అన్నాడు ప్రార్థన పూర్వకంగా నమస్కరించి !
🌸 ‘‘తప్పకుండా ! ప్రతి సంవత్సరం మకరజ్యోతిగా స్వామి దర్శనమిచ్చే సమయంలో మీరు ఆ ఆభరణాలను స్వయంగా తీసుకుని వచ్చి మాకందిస్తే వాటిని విగ్రహనికి అలంకరిస్తాము ! మీరు తృప్తితీరా చూడవచ్చును ! తిరిగి వాటిని మర్నాడు తీసుకువెళ్లి మీ రక్షణలో వుంచి మరు సంవత్సరం తిరిగి తీసుకుని రావాలి ! ప్రతి రోజూ విగ్రహానికి స్వామి స్వయంగా వ్యక్తమైనపుడు వుండిన ఆభరణాలు మాత్రమే అలంకరింపజేయడం జరుగుతుంది’’ అని వాళ్ళు చెప్పింది విని తృప్తిగా నిశ్వసించాడు రాజు !
🌿‘‘శౌనకాది మునులారా ! ఆ విధంగా అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ! ప్రధాన తంత్రుల ద్వారా స్వామి పూజా విధానం సామాన్యజనులు నేర్చుకుని వ్యాప్తి కావించారు. పందళ రాజ్యంలోనూ, చుట్టుప్రక్కల క్రమంగా ఆలయాలు వెలసి స్వామి విగ్రహ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి.
🌸ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ! ఇండ్లలో తమ ప్రాంతాలలోని గుడులలో స్వామి అర్చించుకుంటున్నా శబరిగిరి మీది స్వామిని దర్శించుకోవడంలో లభించే ఆనందం, తృప్తి వర్ణనాతీతమైవని గ్రహించారు పందళ ప్రజలు !
🌿అందుకే శబరిగిరి కి ప్రయాణమవాలని ఉబలాటపడేవారు ! మెట్లెక్కి వెళ్లి స్వామి సన్నిధానం చేరాలన్న ఆశే అందరిలో ! అది గమనించి ప్రధాన తాంత్రులు (మేల్‌శాంతి) వారి ఆశ నెరవేరడానికి అయ్యప్ప స్వామి నిర్దేశించిన దీక్షావిధి, నియమాలు పాటించవలసి వుంటుందనీ, అప్పుడే ఆ స్వామిని మెట్లెక్కి వెళ్లి దర్శించే అర్హత కలుగుతుందని చెప్పడంతో అందరూ భక్తివిశ్వాసాలకు, ఉత్సాహం తోడుకాగా ప్రధాన తంత్రులనుండి ఆ విధుల గూర్చి
🌸ఉపదేశం పొంది ఆ ప్రకారం ఆచరించి స్వామిని పద్దెనిమిది మెట్లెక్కి వెళ్లి దర్శించుకుని జీవితాలు ధన్యం కావించుకునేవారు ! ఇహపర సౌఖ్యాలు ప్రసాదించి మెల్లగా చూసేవాడు అయ్యప్ప.
🌿పంబళ రాజు రాజశేఖరుడు మరు సంవత్సరం మణికంఠుని ఆభరణాలను ఉత్సవంగా మకర జ్యోతిగా దర్శనమిచ్చే రోజున శబరిగిరికి తీసుకువెళ్లి ప్రధాన తంత్రులు వాటిని స్వామి మూల విగ్రహానికి ధరింపజేయడం కన్నుల కరువు తీరా చూసి పులకించిపోతాడు ! ఆయనకు జీవితంలో ఇక కావలసినదేమీ లేదనిపించింది ! తనకు తిరిగి జన్మ లేకుండా స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాలని తహతహలాడాడు ! స్వామికి మొరపెట్టుకున్నాడు !
🌸 ‘‘ఆర్తితో నీవు నన్ను మోక్షప్రాప్తిని అనుగ్రహించమని కోరుతున్నావు ! రాజా ! నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ! ఇకపై ప్రతి సంవత్సరం నీ వంశీయులు నా ఆభరణాలను మకర సంక్రమణం రోజున తీసుకురావడం , వాటిని నా విగ్రహానికి ధరింపజేయడం జరుగుతుంది !
🌿నీ పేరు భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని
స్వామి విగ్రహం నుండి పలుకులు వినరావడంతో ‘‘ధన్యుడిని స్వామి ధన్యుడిని ! అయ్యప్ప స్వామి ! నీ పాదాలే భక్తులందరికీ ఆశ్రయమిచ్చి కాపాడాలి ! స్వామి శరణం ! అయ్యప్ప.శరణం !’’ అని భక్తి పారవశ్యంతో భజిస్తూ వుండగా , ఆయనలోనుండి జీవాత్మ జ్యోతిరూపంలో వెలువడి పరమాత్మలో లీనమైంది ! రాజశేఖరుడికి మోక్షప్రాప్తి లభించింది ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
🌸‘‘మహర్షి ! మీ నోట అయ్యప్పస్వామి దివ్యచరితాన్ని విని ధన్యులమైనాము ! దుష్టశిక్షణ , శిష్టరక్షణ అవతార లక్ష్యాలుగా హరిహర పుత్రునిగా జన్మించిన మణికంఠుడు అయ్యప్పస్వామిగా శబరిగిరిమీద వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యచరితాన్ని ఎన్నిసార్లు విన్నా తనివితీరదినిపిస్తున్నది ! శబరిగిరి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఆచరించవలసిన దీక్షా విధులగూర్చి గూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అంటూ అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు.
🌿 అలా వారు అడుగుతున్న తీరు చూసి ‘‘తప్పకుండా చెబుతాను ! అయ్యప్పస్వామి దివ్య చరితంతోపాటు ఆ స్వామి భక్తులకోసం ఏర్పరిచిన దీక్షా నియమాలను గూర్చి తెలుసుకోవడంవల్ల అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతితో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాలతో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామిని స్తుతించండి !’’ అన్నారు.
🌸‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య నిర్మలం హరహరాత్మజం స్వామి దేవ మాశ్రయేత్ !’’* అని అందరూ భక్తి పూర్వకంగా భజన చేస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తిపూరిత ప్రశాంత వాతావరణంతో విలసిల్లింది !
🌹దీక్ష - వ్రత నియమాలు గురు ప్రార్థన:
🌸‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్ద్రేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీగురవే నమః’’
అంటూ గురు పరంపరకు మూలపురుషుడు , త్రిమూర్త్యాత్మకుడు అయిన దత్తాత్రేయస్వామికి ముందుగా నమస్కరించారు సూత మహర్షి ! ముని ముఖ్యులను కూడా స్మరించారు.
🌿‘‘జ్ఞాన విజ్ఞాన సిద్ధర్థ్యం భజేహం నారదమునిం
వ్యాసం వాల్మీకి వౌనీంద్రం వశిష్టం బ్రహ్మవాదినమ్!
సర్వశాస్త్రార్థ యోగ్యార్థం సర్వగ్రంథి విభేదనమ్
బ్రహ్మ విష్ణు శివం మూర్తింగురు రూపముపాస్మహే’’ అంటూ స్తుతించి చెప్పసాగారు.
🌸సద్గురువు ఆవశ్యకత
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లడానికి గురువు అనుజ్ఞ , దీక్ష , నియమాలు ఆవశ్యకం కావు ! కాని అయ్యప్పస్వామి దర్శనానికి ఆయన ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లమీద నుండి ఎక్కి వెళ్లడానికి మాత్రం గురువు , వ్రతదీక్ష , మాలధారణ మొదలైనవి తప్పక అవసరమౌతాయి.
🌿గురువులలో చదువు నేర్పే గురువులు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సద్గురువుల వల్ల పొందే మంత్రోపదేశం అయ్యప్పస్వామి వ్రతదీక్షకులకు సత్ఫలితాలనిస్తుంది ! ప్రధాన అర్చకుల నుండి మంత్రోపదేశం పొంది దీక్ష స్వీకరించి మెట్లెక్కి వెళ్లి స్వామి దర్శనం చేయటంవల్ల ఆ మనిషిలో దైవభక్తి , ఆధ్యాత్మికచింతన పెంపొందుతాయి ! సద్గుణాలు అలవడతాయి ! రాగద్వేషాలు విడిచిపెట్టి , అహంకారం, ఆడంబరం లేకుండా అందరిపట్ల దయాభావంతో సమానతలు దృక్పథంతో చూడగలుగుతారు.
🌸 భగవంతుడే పరబ్రహ్మ ! ఆ పరబ్రహ్మను చేరడానికి సద్గురువు ఉపదేశం పొందడమే మార్గం అన్న వివేచన కలుగుతుంది ! అప్పయ్యస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అర్చకస్వాములు, పది సంవత్సరాలు వరుసగా దీక్ష స్వీకరించి పద్ధెనిమిది మెట్లక్కి స్వామి దర్శనం చేసుకువచ్చిన గురుస్వాములు ఇతరులకు దీక్ష ఇవ్వడానికి అర్హతను కలిగి వుంటారు ! వీరు మానసిక పరిపక్వత కలిగిన

🌿పరబ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని వుండగలరు !
🌹మాలధారణ :🌹
🌸దీక్ష స్వీకరించాలని సంకల్పం చేసుకున్నవాళ్ళు ముందురోజు తాము ఎంచుకున్న గురుస్వామివారిని దర్శించి తమకు దీక్ష ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి ! ఆ సద్గురువు ఆశీర్వాదం చేసి మాలను ధరింపజేయడానికి అంగీకరించి స్థల నిర్ణయం చేస్తారు .
🌿గురువు ఆశ్రమము , ఇంట్లో పవిత్రంగా , ప్రత్యేకంగా వుంచుకునే పూజాగృహం , అయ్యప్పస్వామి దేవాలయం , ఇతర దేవీ దేవతల దేవాలయాలు దీక్షాస్వీకారానికి అనుకూలమైనవి !
🌹కాలవ్యవధి :🌹
🌸వృశ్చిక మాసం (వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే నెల రోజులు) మొదటి రోజునుండి 41 రోజుల కాలాన్ని మండల కాలంగా వ్యవహరిస్తారు ! ఈ 41 రోజులు దీక్షాకాలం వ్రతకాలాన్ని పరమ పవిత్రంగా గడపాలి !
🙏దీక్ష స్వీకారం:🌹
🌿ముందు రోజు గురుస్వామిని కలుసుకుని ఆయన చెప్పిన స్థలానికి (సాధారణంగా అయ్యప్పస్వామి గుడిలో దీక్ష ఇచ్చి మాలధారణ జరుపుతారు) పగటిపూట గుడి మూయడానికి పూర్వం గురుస్వామి నిర్ణయించిన సమయానికి చేరుకోవాలి ! ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని చల్లని నీటితో తలస్నానం ఆచరించి శుభ్ర వస్త్రాలు ధరించాలి ! దీక్ష స్వీకరించేవారు నల్లనిరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి !
🌹అయ్యప్ప నల్లరంగు వస్తధ్రారణ ఆంతర్యం:🌹
🌸తెలుపు , ఎరుపు , పసుపు రంగుల కలయికవల్ల నల్లరంగు ఏర్పడుతుంది ! వీటిలో సత్వగుణానికి తెలుపు రంగు , రజోగుణానికి ఎరుపు రంగు , తమోగుణానికి పసుపు రంగు ప్రతీకలు ! ఈ మూడు రంగుల కలయికతో ఏర్పడే నల్లని వస్త్రాలను ధరించటం వల్ల మనిషిలోని ఈ మూడు గుణాలను తగిన రీతిలో అదుపులో ఉంచుకోవాలని నలుపు రంగు గుర్తుచేస్తుంటుంది.
🌿నల్ల రంగు వస్త్రాలను ధరించి నుదుట విభూది , చందనము , కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
🌹మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు :🌹
🌸నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు 108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి !
🌹పూజాద్రవ్యాలు🌹
🌿కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి వారు దేవాలయాలలో పూజ జరిపి మెడలో మాలలు వేసి చెవిలో అయ్యప్పస్వామి మంత్రం ఉపదేశించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది !
🌹మాలాధారణ మంత్రం:🌹
మాలను ధరింపజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠింపచేస్తారు గురుస్వామి !
🌸‘‘జ్ఞానముద్రాం , శాస్తమ్రుద్రాం ,
గురుముద్రాం నమామ్యహం
వనముద్రాం , శ్రద్ధాముద్రాం ,
రుద్రముద్రాం , నమామ్యహం ,
శాంతముద్రాం , సత్యముద్రాం ,
వ్రతముద్రాం నమామ్యహం
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం
పాతు సదాపిమే గురు దక్షిణాయా ,
పూర్వ తస్మానుగ్రహకారిణే శరణాగతముద్రాఖ్యం ,
తన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం ,
భద్రముద్రాం నమామ్యహం శబర్యాచలముద్రాయై ,
నమస్త్భ్యుం నమో నమః
‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’
అంటూ దీక్ష ముద్ర వున్న మాలను ధరింపజేస్తారు గురుస్వామి !
🌿 మండల దీక్షా స్వీకారానికి ఆశీర్వాదం , ఆమోదం తెలియజేస్తారు ! దీక్ష ముద్ర మాలను ధరించినవారు అప్పటినుండి మండలకాలంలో ఎంతో పవిత్రంగా , నియమ నిష్ఠలతో గడపవలసి వుంటుంది!
🌹అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాముల దినచర్య🌹
🌸ఉదయం: బ్రాహ్మముహూర్తంలో (తెల్లవారు జామున గం.3.30) లేచిn సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు పూర్తిచేసి , చల్లనీళ్ళతో తలస్నానం ఆచరించాలి ! శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి నుదుట విభూతి , చందనము , కుంకుమ బొట్లు ధరించాలి ! మెడలో వున్న మాలలోని ముద్రకు కూడా విభూది , కుంకుమ , చందనము అద్ది కళ్లకద్దుకోవాలి !
🌿 సూర్యునికి నమస్కరించి పూజ గదిలోకి ప్రవేశించాలి ! పూజాగృహంలో అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మధ్యలో అమర్చిన పీఠంమీద అరిటాకు వేసి , దానిమీద వుంచి చందనపు బొట్టు పెట్టి , కుంకుమ అద్ది పూలమాలలతో అలంకరించి రెండు వైపులా దీపపు కుందులు వుంచి దీపారాధన చేయాలి !
🌸 స్వామిని షోడశోపచారాలతో పూజించాలి ! నైవేద్యంగా అరటిపండ్లు , బెల్లం , అటుకులు మొదలైనవి సమర్పించి హారతి చూపుతూ 108 నామాల శరణు ఘోష చదివి , సాష్టాంగ నమస్కారాలు చేయాలి !
🌿 మెడలోని ముద్రమాలకు హారతి చూపించాలి ! పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేసుకుని ఇంటికివచ్చి పాలు , పండ్లు స్వీకరించాలి .
( వయసు , ఆరోగ్యరీత్యా ) అల్పాహారం (భిక్ష) స్వీకరించవచ్చు !
🌸మధ్యాహ్నం: రోజువారీ పనులు చేసుకుని మధ్యాహ్నం తిరిగి స్నానం చేసి సద్ది (భోజనం) స్వీకరించాలి !
సాయంత్రం: సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి పూజ చేయాలి. ఉదయం చేసిన విధంగానే ! స్వామికి భజన ప్రీతికరం ! అందుచేత రాత్రి కొంతసేపు భజన నిర్వర్తించాలి ! ఆపైన దేవాలయాన్ని , గురుస్వామిని దర్శించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అల్పాహారం స్వీకరించాలి !
🌿రాత్రి: నిద్రించడానికి కొత్తచాప , దుప్పటి నేలపై పరుచుకుని నిద్రించాలి ! ఈ విధమైన దినచర్యను మండల కాలంలో పాటించాలి !
🌹ఆహార నియమాలు:🌹

దీక్ష స్వీకరించిన స్వాములు ఆహార నియమాలను సక్రమంగాపాటించవలసి వుంటుంది ! వారికి ఆహారం తయారుచేసేవారు స్నానం చేసి శుచిగా వంట చేయాలి ! సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి ! ఎక్కువగా తీపి , ఉప్పు , పులుపు , కారం , ఉల్లి , వెల్లుల్లి , మసాలా దినుసులు కలిపిన ఆహారాన్ని భుజించకూడదు ! అపరిశుభ్రమైన పదార్థాలు అకాలంలో , అమితంగా తినకూడదు !...సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞

No comments:
Post a Comment