Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 7 వ అధ్యాయం

 శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 7 వ అధ్యాయం.. ప్రారంభం..!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸భూలోకంలో మహిష రూపంలో మహిషిని ఆనందపరుస్తున్న సుందరదత్తుడు భూతనాధుని ఆవిర్భావం జరగగానే మోక్షాన్ని పొందాడు.  అతని మరణంతో మహిషిలో తిరిగి క్రోధావేశాలు కట్టలు త్రెంచుకుని పొంగివచ్చాయి.

🌿గుహలోనుండి వెలికివచ్చి పాతాళంలోని రాక్షసులను కూడకట్టుకుని దేవతలమీద యుద్ధం ప్రకటించి స్వర్గాన్ని స్వాధీనపరచుకుని ముల్లోకాలలో తిరిగి రాక్షస పాలన నెలకొల్పింది.

🌸దేవతలు దీన వదనాలతో కైలాసానికి వచ్చారు. కళావిహీనులై కనిపిస్తున్న వాళ్లకు వూరట కలిగించాయి పరమేశ్వరుని వాక్కులు. ‘‘ఇంద్రాది దేవతలారా ! మీ కష్టాలు త్వరలోనే తీరగలవు ! భూతనాధుడు భూలోకానికి వెళ్లి ఆ మహిషిని వధించే సమయం ఆసన్నమైంది’’.

🌿మేఘ గంభీర స్వరంతో పరమేశ్వరుడిచ్చిన అభయానికి కలతదేరారు దేవతలు. ‘‘ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాము స్వామీ !  భూతనాధుడు వెంటనే బయలుదేరి భూలోకాన్ని చేరి మహిషిని ఎదుర్కొని హతం కావిస్తాడని అనుకుంటున్నాము. మా అంచనా సరైనదేనా స్వామీ?’’ అంటూ ప్రశ్నించాడు ఇంద్రుడు ఆతురత నిండిన స్వరంతో !

🌸‘‘అంతటి తొందరపాటు తగదు ఇంద్రా !  మహిషి అంతం కావడానికి మరికొంత కాలం వేచి వుండక తప్పదు ! ఆమె పొందిన వరానుసారం హరిహర పుత్రుడు భూలోకంలో పన్నెండు సంవత్సరాలు రాజవంశంలో పెరగవలసి వుందన్న విషయం మరవవద్దు!’’ అని గంభీరంగా గర్తుచేశాడు పరమేశ్వరుడు. 

🌿  ‘‘క్షమించండి స్వామీ ! నా తొందరపాటుతనాన్ని మన్నించండి!’’ అంటూ చేతుల జోడించి నమస్కరించాడు ఇంద్రుడు. ‘‘పితృదేవులకు ప్రణామాలు’’ అంటూ అప్పుడే పత్నులతో సహా వచ్చి నమస్కరించాడు భూతనాధుడు ! అతనివైపు ప్రసన్నంగా చూసి ‘‘పుత్రా ! రాక్షస సంహారం కావించడానికి నీవు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది!’’ అన్నాడు పరమేశ్వరుడు.

🌸 ఇంద్రుడు భక్తిపూర్వకంగా భూతనాథునికి నమస్కరించాడు ! పరిపరి విధాలుగా స్తుతించాడు , భూతనాధుని స్తుతి.

🌹పంచ బాణకోటి కోమలాకృతే కృపానిధే
పంచగవ్య పాయసాన్న పావకాది మోదకా
పంచభూత సంచయ ప్రపంచ భూతపాలకా! 
పూర్ణ పుష్కళ సమేత భూతనాథ పాహిమాం!
🌹

🌿(కోటి మన్మథుల సౌందర్యం కలవాడివి ! దయానిధివి ! పాయసం , పానకాలు ఇష్టపడే స్వామి ! పంచభూతాత్మకం అయిన ప్రపంచాన్ని పాలించేవాడవు ! పూర్ణ , పుష్కళ అనే దేవేరులతో కూడిన భూతనాధా ! మమ్మల్ని కాపాడు)

‘🌹‘
వీర బాహు వర్ణనీయ వీర్య శౌర్య వారిధే 
వారిజాసనాది దేవవంద్య సుందరాకృతే
వారణేంద్ర వాజి సింహ వాహ భక్త సేవధే
పూర్ణ పుష్కళ సమేత భూతనాధ!
పాహిమామం’’
🌹

  🌸(వీరత్వంతో నిండిన బాహువులతో వీర్య శౌర్యాలు మూర్తీభవించిన సముద్రానివి! ఓ భూతనాధా! దేవతలందరికీ వందనీయుడవు! గజ , అశ్వ , సింహాలు వాహనాలుగా కలిగినవాడవు ! భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చేవాడవు ! పూర్ణా , పుష్కళ దేవేరులతో కూడిన స్వామీ ! మమ్మల్ని కాపాడు)

🌿
🌹‘‘సామగానలోల శాంతశీల ధర్మ పాలకా సోమ సుందరాస్య సాధు పూజనీయ పాదుకా
సామ దాన భేద దండ శాస్త్ర నీతి భూతకా పూర్ణ పుష్కళా సమేత భూతనాధ పాహిమాం! 🌹

🌸  (సామగాన ప్రియుడవు ! శాంతి స్వభావుడవు ! చంద్రునిలా సుందర రూపం గలవాడవు ! నీ పాదాలను సాధుజనం పూజిస్తారు. చతురోపాయాలు - సామ , దాన , భేద , దండోపాయాలు తెలిసిన ధర్మశాస్తవు ! పూర్ణ , పుష్కళా సమేతుడవైన భూతనాధా! మమ్మల్ని కాపాడు!)
అంటూ ఇంద్రుడు చేసిన స్తుతులకు మెచ్చి అభయం ప్రసాదించాడు భూతనాథుడు.

🌿‘‘ఇంద్రాది దేవతలారా! త్వరలోనే స్వర్గ భోగాలు మీకు లభించగలవు! నిశ్చితంగా ఉండండి’’ అన్నాడు. భూతనాథునికి , పరమేశ్వరునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని బయలుదేరారు దేవతలు ! వారు వెళ్ళాక తనను చూడవచ్చిన బ్రహ్మ , విష్ణువులవైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘భూతనాథుడు భూలోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అన్నాడు పరమేశ్శరుడు.

🌸అందరినీ కలియజూశాడు సూతమహర్షి ! 
‘‘మహర్షి ! గణపతి , కుమారస్వాములకు ఇద్దరిద్దరు పత్నులున్నట్లుగానే భూతనాధునికి ఇద్దరు పత్నులున్నట్లు తెలిపారు గదా ! భూతనాథుడే భూలోకానికి వచ్చి అయ్యప్పస్వామిగా అవతరిస్తాడని అనుకుంటున్నాము !

🌿ఆ స్వామి ఎందుకు వివాహం చేసుకోలేదు ? ఆ సంగతులు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ వింటున్న వారిలో కొందరు మునులు అడిగాడు ! ‘‘మీరనుకుంటున్నట్లు భూతనాధుడే భూలోకంలో అయ్యప్పగా పూజింపబడతాడు ! మునులారా ! పురుషుని చేరే ప్రకృతిలో రెండు భాగాలు విలీనమై ఉంటాయి.  వాటిని పరాప్రకృతి , అపరాప్రకృతి అంటారు .

🌸  భక్తులకోసం ఈ రెండు భగవంతునికి పత్నులై భక్తుల కోరికలు సంపూర్ణంగా నెరవేర్చి వారి సుఖజీవనానికి కావలసిన ధన , ధాన్య భోగాలను పుష్కళంగా అనుగ్రహిస్తారు ! పూర్ణ , పుష్కళములు అయిన పరా , అపరా ప్రకృతులను తనలోనే విలీనం కావించుకుని భూతనాధుడు భూలోకంలో అవతరించడం జరిగింది.

🌿 చిత్ర విచిత్రమైన సంఘటనలతో పన్నెండు సంవత్సరాలపాటు భూమిపై ఆ స్వామి కావించిన లీలల గూర్చి చెబుతాను !  సావధానులై వినండి !

🌹‘‘విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం!!’’🌹
అంటూ కళ్లు మూసుకుని ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !

🌹భూలోకంలో మణికంఠునిగా భూతనాథుని అవతరణం ! హరిహర స్తుతి: 🌹

🌸రాజశేఖరుని వృత్తాంతం ‘‘అభ్రంకశంబైన యాలబోతు నీతండు ద్రుంచినాడీతండు పెంచినాడు ! సాధుసమ్మతంబుగ సారుజంబు నీతండు గాచినాడీతండు ద్రోచినాడు! బర్హిర్ ముఖార్ధమై పర్వతేశునీతండు దాల్చినాడీతండు వ్రాల్చినాడు !  ఫణి పరంపర తోడి పన్నగేంద్రుడు నీతండు మెట్టినాడీతండు సుట్టినాడు ! నేడు నాడును , నాడును నేడు జూడ జెప్పంగ జెప్పంగ జూడగలిగెననుచు గొనియాడు సంయమి జనులకొదవె రజతగిరి మీద హరిహారారాధనంబు పూజా కార్యక్రమం ముగించి లేచారు రాజశేఖరుడు , ఆయన పత్ని !

🌿పాండ్య వంశస్థుడు , పందల రాజ్యాన్ని పాలిస్తున్న ఆ రాజును సంతానం లేని కొరత ఎంతగానో బాధిస్తున్నది ! ‘‘రాకుమారుడు స్వస్థుడైనాడు ! ఇక మనకే చింతా లేకుండా చూస్తాడు !’’ వాళ్ళలో వాళ్లనుకుంటుంటే చిరునవ్వు నవ్వి ‘‘అవును ! ఇక ఏ చింతా దరిచేరదు. మీ ప్రియతమ నాయకుడిని’’ అంటూ అందరిని ఆశీర్వదించి బయలుదేరుతున్న వృద్ధుడికి పళ్ళెరం నిండా బంగారు నాణాలు పోసి బహూకరించబోయాడు రాజు !

🌸 ‘‘మహారాజా ! వాటిని మీ ప్రజలకే దానం చేయండి ?’’ అని వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు వృద్ధుడు !
విషయం తెలిసిన మంత్రి , సేనాపతులలో పరివర్తన కలగకపోగా మణికంఠునిపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైనాయి. అతనిని తుదముట్టించడానికి మరో పథకం ఆలోచించసాగారు!

🌿మంత్రి దురాలోచన
మణికంఠుడు ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకునేవాడు ! పన్నెండు  సంవత్సరాల ప్రాయంలోనే ఎంతో పరిణతి చెందిన వ్యక్తిత్వంతో ప్రజాక్షేమం కోసం అతను తీసుకునే నిర్ణయాలు , జరిపే కార్యక్రమాలు దక్షతగల పాలకునిగా గుర్తింపు కలిగించాయి !

🌸ఒక రోజు నిండు సభలో.. ‘‘మణికంఠుడు లేత వయస్సులోనే మాకంటే ముందుచూపుతో ప్రజారంజకమైన కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందటం తండ్రిగా నాకెంతో ఆనందం కలిగిస్తున్నది ! ఇక ఆలస్యం చేయకుండా అతనికి పరిపాలనా బాధ్యత అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలను కుంటున్నాను ! శుభముహూర్తం నిర్ణయించి త్వరలోనే పట్టాభిషేక  మహోత్సవం వైభవంగా జరిపించాలని సంకల్పించాను ! నా నిర్ణయం అందరికీ ఆనందం కలిగిస్తుందని నమ్ముతున్నాను’’ అంటూ ప్రకటించాడు రాజశేఖరుడు సభాసదుల సమక్షంలో ! 

🌸అందరూ హర్షాధ్వానాలతో సమ్మతిని తెలియజేశారు...సశేషం... 🙏


🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...🌞

No comments: