Adsense

Showing posts with label Badrachalam sitarama kalyanam. Show all posts
Showing posts with label Badrachalam sitarama kalyanam. Show all posts

Thursday, March 30, 2023

భద్రాచలం'లో మూలమూర్తులకు కూడా కళ్యాణం జరుగుతుందని తెలుసా?..!!




🌿మూలమూర్తికి వివాహం అన్నది ప్రపంచములో మరెక్కడా లేదు, ఒక్క భద్రాచలంలో తప్ప..

🌸ఔరంగజేబు కాలంలో ఆతనిసైన్యం భద్రాద్రిరామయ్య మీదకూడా దండెత్తారు. అప్పుడు అక్కడి అర్చకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎనలేనివి.

🌿 ఔరంగజేబ్ సైన్యం వస్తున్నది అనేవార్త తెలియగానే, "కాకుళ్ళ రామానుజాచార్యులు" అనే స్వామి, ఆలోచించి వెంటనే మూలవరులకు ముందు అడ్డంగా, వారు
కనపడకుండా ఒక గోడ 
కట్టించేసారు.

🌸ఉత్సవార్లను, మిగిలిన పరివారవిగ్రహాలనూ ఒక పెట్టెలో పెట్టి, గోదావరినదిలో ఒకచోట భద్రపరిచి, అక్కడ ఒక రహస్యగుర్తు ఏర్పాటు చేసుకున్నారు.

🌿 దండయాత్ర అయిపోయి, అంతా మామూలు అయ్యాక, మూలవిగ్రహాల ముందు కట్టిన గోడ పడగొట్టించారు. గోదావరిలో ఉన్న, ఉత్సవ విగ్రహాలను బయటకు తీయగా, అందులో అందరూ ఉన్నారు గానీ, సీతమ్మ కనపడలేదు.

🌸అది బ్రహ్మోత్సవ సమయం. సీతమ్మ లేకుండా కళ్యాణం ఎలా చేయాలని ఆలోచించి, ఇక ఆ ఆప్షన్ లేదు కనుక, మూలమూర్తులకు కళ్యాణం చేసారు.

🌿తరువాత సీతమ్మవిగ్రహం దొరకినా, మూలమూర్తుల కళ్యాణం ఆనాడు పూర్వాచార్యులు రామయ్యని రక్షించడానికి చేసిన త్యాగానికి, శ్రమకీ, గుర్తుగా ప్రతిఏటా చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది...
జై శ్రీరామ్.