Adsense

Showing posts with label Real Estate Business. Show all posts
Showing posts with label Real Estate Business. Show all posts

Sunday, January 12, 2025

ఇంటి నిర్మాణానికి బిల్డర్ తో అగ్రిమెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

ఇంటి నిర్మాణం కోసం బిల్డర్ తో అగ్రిమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు :

1. ప్రాజెక్టు వివరాలు:

- స్థల వివరాలు, నిర్మాణం కొలతలు, డిజైన్‌లు మరియు ప్లాన్ల వివరాలు స్పష్టంగా పొందండి.

- బిల్డింగ్ యొక్క మొత్తం స్థలం, ప్రతి ఫ్లోర్ ప్లాన్ వివరాలు మరియు యాక్సెసరీల లిస్టు పొందండి.

2. కాంట్రాక్ట్ రకాలు:

- నిర్మాణం చేయబడే పనుల రకం మరియు కాంట్రాక్ట్ రకం (లంప్ సమ్, కోస్ట్ ప్లస్, టైం మరియు మెటీరియల్) ఎంచుకోండి.

- ఈ కాంట్రాక్ట్‌లో చేర్చబడిన మరియు చేర్చబడని పనుల వివరాలు క్లియర్ గా ఉండాలి.

3. పూర్తి చేయడానికి సమయం:

- ప్రారంభ తేదీ మరియు నిర్మాణం పూర్తి చేయడానికి అంచనా సమయం స్పష్టంగా అగ్రిమెంట్‌లో చేర్చాలి.

- ఆలస్యం జరిగినట్లయితే జరిమానా మరియు పరిహారం వివరాలు ముందుగానే నిర్ణయించుకోవాలి.

4. మొత్తం ఖర్చు:

- నిర్మాణానికి అవసరమైన మొత్తం ఖర్చు, చెల్లింపు షెడ్యూలు మరియు మైలిస్టోన్‌లు స్పష్టంగా ఉండాలి.

- అదనపు ఖర్చులు మరియు అవి ఎప్పుడు చెల్లించబడతాయో గూర్చి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి.

5. క్యాంసిలేషన్ మరియు టెర్మినేషన్ క్లాజ్:

- ఏవైనా కారణాల వల్ల ప్రాజెక్టు క్యాన్సిల్ లేదా టెర్మినేట్ అయినప్పుడు ఏవిధంగా పరిహారం చేయబడుతుందో స్పష్టంగా కాంట్రాక్ట్‌లో పొందుపర్చాలి.

6. నాణ్యత ప్రమాణాలు:

- వాడే మెటీరియల్స్ మరియు వాటి నాణ్యత ప్రమాణాలు వివరించండి.

- వాడే బ్రాండ్స్, సర్టిఫికేషన్ మరియు ప్రమాణాల గురించి వివరాలు పొందుపర్చాలి.

7. వారంటీ మరియు మెయింటెనెన్స్:

- నిర్మాణం పూర్తి తరువాత బిల్డర్ అందించే వారంటీ, మెయింటెనెన్స్ మరియు సర్వీస్ వివరాలు పొందుపర్చాలి.

- డిఫెక్ట్ లైయబిలిటీ పీరియడ్ (DLP) గురించి వివరాలు చేర్చండి.

8. ఇన్సూరెన్స్:

- ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బిల్డర్, సైట్ మరియు వర్కర్స్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ వివరాలు పొందుపర్చాలి.

9. లైసెన్స్ మరియు అనుమతులు:

- నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్లు బిల్డర్ వద్ద ఉన్నాయో లేదా బిల్డర్ అందిస్తాడో లేదో నిర్ధారించుకోవాలి.

10. లీగల్ కాంప్లైయెన్స్:

- కాంట్రాక్ట్ లీగల్ పాయింట్స్ పరిశీలించడానికి మరియు వాటిని సమర్థంగా తియ్యడానికి లీగల్ కన్సల్టెంట్ లేదా అడ్వకేట్ సాయం తీసుకోవడం మంచిది.

ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు బిల్డర్ తో మంచి అగ్రిమెంట్ చేసుకోవచ్చు మరియు భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.


ఆంధ్రప్రదేశ్ లో 4 సెంట్లలో 3 బీహెచ్‌కే ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది?

ప్రాక్టికల్ గా చెప్పాలంటే మీరు కట్టే ఇంటి యొక్క శ్లాబ్ ఏరియా బు బట్టి మనం ఖర్చును ముందే అంచనా వెయ్య వచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో శ్లాబ్ ఏరియా 1 చ.ఆ. కు రు.1500 ఖర్చు వస్తుంది.

అంటే మీరు మీ 3 bhk ఇంటిని 30 x 30 చ.ఆ. లో కడితో మొత్తం 900 చ.ఆ. శ్లాబ్ ఏరియా వస్తుంది

అంటే 900 x 1500 = 13,50,000 రూపాయలు (construction మేస్త్రీ కూలీలతో కూడా కలిపి) ఇక మీరు వేసుకునే ఫ్లూరింగ్, రంగులు అదనం,

మొత్తానికి 15,00,000 ల్లో ఎంచక్కా 3 bhk ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చెయ్యవచ్చు. అయితే మీరు మేస్త్రీల మాట విని వారు చెప్పిన రీతిలో పొడిగింపులు చేసుకుంటూ పోతే వారీ కూలీలు పెరిగిపోతాయి, మీ మెటీరీయల్ ఖర్చూ పెరిగిపోయి మీకు తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి ప్రతి అంశాల్ జాగ్రత్తగా లెక్కలు వేసుకొని కట్టుకుంతీ నేను పైన చెప్పిన ఖర్త్చుతో అందమైన ఇల్లు కట్టుకోవచ్చు.

నేను ఒక ఛ..ఆ కు 1200 రూపాయల ఖర్చుతో (POP కూడా కలిపి) అందమైన ఇల్లు కట్టుకున్నాను. నా ప్లాను, నా ఆలోచన ... ఎవరేం చెప్పినా పట్టించుకునే ప్రశక్తే లేదు. ఖచ్చితమైన కొలతలు. మేస్త్రీని నోరు మెదపనివ్వలేదు, పక్కవాళ్ళ, స్నేహితుల ఉచిత సలహాలు పట్టించుకోలేదు


ఇక్కడ మనం ఒక్కటే సిద్ధాంతం పాటించాలి: 1. ఇల్లు మీది, జీవితాంతం ఆ ఇంటిలో నివసించేది మీరు

2. ఆ ఇంటిపైన ఖర్చు పెడుతున్న డబ్బు మీది

3. ఆ ఇంటికి యజమాని మీరు (మేస్త్రీ అంటే కేవలం ఇల్లు కట్టేవాడు మాత్రమే, కాబట్టి అతడి పని మీరు చెప్పినట్లు ఇల్లు కట్టడమే. ఉచిత సలహాలు ఇవ్వడానికి అతను కానీ, మీరు ఇల్లు కడుతున్నపుడు చూడడానికి వచ్చే వ్యక్తులు గానీ కన్సల్టెంట్లు కాదు, నిపుణులు కాదు.)

కాబట్టి అది మీకు నచ్చినట్లు ఉండాలి. వేరేవాళ్ళ సలహాలు అవసరం లేదు. ఇది నేను ఖచ్చితంగా పాటించి ఇల్లు కట్టాను. నా చుట్టుపక్కల కమ్యూనిటీలో నాదే అందమైన ఇల్లు, కానీ వారందరికంటీ తక్కువ ఖర్చు తో పూర్తి చేసుకున్న ఇల్లు నాదే.

సేకరణ

రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంబించాలంటే, కనీస పెట్టుబడిగా ఎంత భూమి ఉండాలి?

రియల్ ఎస్టేట్ అంటే మీరనేది?

రియల్ ఎస్టేట్ లో రక రకాలు ఉన్నాయి.

(1) భూమిని స్థలాలుగా విభజించి అమ్మడం

(2) విడి ఇళ్ళు (independent houses) కట్టించి అమ్మడం

(3) అపార్టుమెంట్లు కట్టించి అమ్మడం

సొంతంగా ఏమీ చెయ్యకుండా ఒకఱి మోచేతి నీళ్ళు త్రాఁగుతూ బ్రతికే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు :

(4) ఎవఱో కట్టినవాటికి కమిషన్ తీసుకుని మనం మార్కెటింగ్ లాంటివి చేయడం మొ॥

(5) సెకండ్స్ సేల్ ఇన్వెస్టుమెంట్ : అంటే - ఒక Housing venture లో ముందే కొన్ని ఇళ్ళు బుక్ చేసేసుకుని ఆ వెంచర్ కట్టడం పూర్తయ్యాక 50% - 100% లాభానికి ఆ ఇళ్ళని అమ్మేయడం. ఇందుకు కొద్ది సంవత్సరాలు (3 - 6 ఏళ్ళు) పట్టుతుందనుకోండి. అంటే మొదటే కొన్న ఆ మదుపరి (investor) తాను కొన్న ఆ ఇళ్ళలో కనీసం పాలు కూడా పొంగింౘఁడు. అక్కడ కాఁపరం ఉండఁడు. కేవలం కొనడం, అమ్మడం, అంతే. కోట్లాది రూపాయల నగదు (cash) ఉండి- ఓర్పుగా ఎదురుచూడఁగల - బహు బలిసిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి వ్యాపారం చేయఁగలరు. మామూలువాళ్ళ వల్ల కాదు.


మీరంటున్నది మొదటి రకం గుఱించి అయితే - కనీసం 5 - 6 ఎకరాల భూమి కావాలి.

ఎకరం అంటే 4840 గజాలు (లేక 100 సెంట్లు)…

(గజం = 3' × 3' = 9 ౘదరపు అడుగులు)

ఒక ఎకరంలో 150 గజాల (36' × 36') ప్లాట్లు 20 వస్తాయి. 150 గజాలంటే 3 సెంట్ల మీఁద ఒక పిసరుంటుంది. అలాంటి 20 ప్లాట్లు 3,000 గజాల్లో ఇముడుతాయి. మిగితా స్థలాన్ని (సగటున ఎకరానికి - 1480 గజాలు) ప్రభుత్వ నిబంధనల మేరకు తూపరాణ (డ్రెయినేజి), విద్యుత్ స్తంభాలూ, రోడ్లూ, పేవుమెంట్లూ, పచ్చదనం కోసం వదిలేయాల్సి వస్తుంది.

ఇలా 5 ఎకరాల్లో 100 ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేయవచ్చు. ఇంకో ఎకరం ప్రభుత్వ నిబంధనల మేరకు వేఱే అవసరాల కోసం వదలాలి.

కనుక మీ దగ్గర 6 ఎకరాలు ఉన్నా కూడా అందులో మీరు అమ్ముకుని సొమ్ము చేసుకోఁగల భాగం దాదాఁపు 4 ఎకరాలు మాత్రమే. నష్టదాయకమైన ఈ అంశాన్నీ మఱియూ మీకైన ఖర్చుల్నీ, ప్రభుత్వ పన్నుల్నీ దృష్టిలో ఉంచుకుని మీరు ఒక్కో గజం వెల, ఒక్కో ప్లాటు వెల నిర్ణయించాలి.

_______________

ఒకవేళ మీ దగ్గర సొంతంగా అంత భూమి లేకపోయినా, లేక అంత భూమిని మీరు డబ్బిచ్చి కొనలేకపోయినా - రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఇంకో మార్గం ఉంది.

భూమిని లాభసాటిగా అమ్ముకోవాలనుకునే రైతులుంటారు. కాని ఎవఱికి ఎలా అమ్ముకోవాలో వారికి తెలీదు. అలాంటివారి దగ్గర "నేను అమ్మిపెడతా"నని పవర్ పట్టా తీసుకోండి. ఆ తరవాత ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మండి. అమ్మఁగా వచ్చిన దాంట్లో కొంత మీరూ, కొంత ఆ రైతులూ పంచుకోండి.

ఇలా చేయాలంటే కొన్ని ముందస్తు జాగ్రత్తలూ, నిబంధనలూ పాటించాలి. మీరొక కంపెనీగా రిజిస్టర్ అయితే మంచిది. కాకపోయినా ఈ వ్యాపారం చేయొచ్చు.

(1) మీ అమ్మకం పద్ధతీ, ఉద్దేశాలూ కల్లా కపటం లేకుండా ఆ రైతులతో పంచుకోండి. కస్టమర్లతో ఒక వెల, రైతులతో ఇంకో వెల చెప్పొద్దు. నిఖారసుగా నిజాయితీగా ఉండండి. వాళ్ళలో ఒక్కడికి మండినా సరే, మర్నాడు మీ వ్యాపారం కోర్టులో… మీరు జైల్లో… !!

(2) మీరు ఆ రైతులతో ఒక లిఖిత ఒప్పందం (written agreement) చేసుకోండి. అందులో "ఎవఱికెంత, చెల్లింపులు ఎప్పుడు ఏ రూపంలో?" అనేవి స్పష్టంగా వ్రాసుకోండి. ఆ ఒప్పంద పత్రాన్ని వెంటనే రిజిస్టర్ చేయింౘండి.

(3) సాధారణంగా మనకు దొరికేవన్నీ సాఁగుభూములే కనుక Land conversion చేయింౘండి. అంటే వ్యవసాయ భూమిని ఆవాస భూమి (residential land) గా ప్రభుత్వ రికార్డుల్లో మార్పు చేయింౘండి. ఇది చెయ్యకపోతే మీ వ్యాపారం ౘట్ట విరుద్ధమవుతుంది. మీరు దాని మీఁద సంపాదించిన దాన్ని ప్రభుత్వంవారు అక్రమ సంపాదనగా పరిగణిస్తారు.

(4) మీరు విభజించిన ప్లాట్లకు ఒక స్థలనామం పెట్టండి. సూర్యానగర్, చంద్రానగర్, తారానగర్ ఇలా ఏదో ఒకటి.

(5) ఒక లేయౌట్ తయారు చేయించి దానికి మునిసిపల్, ఉడా లేక DTCP అప్రూవల్స్ తీసుకోండి. ఇది చేయకపోతే కూడా మీ వ్యాపారం అక్రమం అవుతుంది.

(6) ప్లాట్లని అమ్మకానికి పెట్టే ముందే మీ వెంచర్ లో రోడ్లూ విద్యుత్ కనెక్షనూ, నీళ్ళ కనెక్షనూ, డ్రెయినేజి కాలవలూ ఏర్పాటు చేయండి. లేకపోతే ఈ రోజుల్లో మీ ప్లాట్లు ఎవఱూ కొనరు.

________________

లేదూ, మీరు ఇళ్ళు కట్టించి అమ్మాలనుకున్నారు. మీ దగ్గర భూమి మాత్రమే ఉందనుకోండి. అందులో ఇళ్ళు కట్టింౘడానికి మటుకూ డబ్బు లేదనుకోండి. అప్పుడు కూడా మీరు Housing వ్యాపారం చేయడానికి అడ్డంకి ఏమీ లేదు.

(1) ముందు అన్ని ప్రభుత్వ అనుమతులూ సంపాదింౘండి.

(2) స్థానిక పత్రికల్లో మీ గృహనిర్మాణ వెంచర్ గుఱించి Pre-launch offer ప్రకటనలు వేయండి. మీరు కట్టదల్చుకున్న ఇళ్ళ ప్లాన్ కూడా వాటిల్లో ప్రచురింౘండి. వెంచర్ వివరాలతో ఒక రంగురంగుల బ్రోషూర్ అచ్చువేయించి పంౘండి. మీ కార్యాలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కఱి చేతిలోనూ అది పెట్టండి. దానికి ఆకర్షితులైన వారి నుంచి మొత్తం వెంచర్ ఖర్చులో 10% డబ్బు సంపాదింౘండి.

(3) ఆ డబ్బుతో మీ భూమిలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. కొన్ని ఇళ్ళకైనా పునాదులు కట్టండి. ఒక మోడల్ హౌస్ పూర్తిగా కట్టండి (బ్యాంకువాళ్ళకూ, భావి కస్టమర్లకూ చూపడం కోసం).

(4) ఇవన్నీ చూపించి బ్యాంకు ఋణం పొందండి.

(5) ఆ ఋణంతో మీ Housing వెంచర్ కట్టడం సాధ్యమైనంత తొందఱగా పూర్తి చేయండి.