Adsense

Showing posts with label Sitadevi. Show all posts
Showing posts with label Sitadevi. Show all posts

Thursday, March 30, 2023

సీతమ్మ మాయమ్మ

సీతమ్మ మాయమ్మ అనే వాగ్గేయకారుల పదప్రయోగం చాలా లోతైన విశ్లేషణ తో కూడుకున్నది ఆమె ఎవరయ్యా అంటే.....!!


🌿జనకుడి కుమార్తె, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు.

🌸కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి
జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యకు  పట్టపురాణి కాక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!!

🌸ఐదు వేలమంది బలిష్టులైన సైనికుల చేత  తీసుకరాబడిన శివధనుస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుని ఆటలాడుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. మహామాయా స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి సీతమ్మ!!

🌿అంతే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది!
అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!!

🌸సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!!

🌿" మూల ప్రకృతి రూపత్వాత్
సా సీతా ప్రకృతి స్మృతా " !
" ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " !
" సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్ "మహామాయా" భవేత్" !

🌸సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూప!!
లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమః!

🌿సీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపం!!
రామయ్య పురుషస్వరూపం!!
సీతమ్మ ప్రకృతిస్వరూపం!!

🌸ప్రకృతిపురుషులకు ప్రతిరూపాలు సీతారామచంద్రులు
అంతే కాదు ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే!!

🌿సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకార, ఇకార, తకారాల సంగమం!

🌸సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం! తకారం తారా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మగారు వివరించారు!! ఆ కీట బ్రహ్మ పర్యంతం సమస్త  సృష్ఠికీ, సమస్త జగత్తుకూ తల్లి సీతమ్మతల్లి!!

🌿సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!!

🌸రెండోరూపం జనకుడు భూమిని  దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!!

🌿మూడోరూపం  అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!!

🌸ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల
రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా
సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!

🌿రామభక్తులను  హనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!!
అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప,
హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి!!

🌸 భక్తరామదాసస్వామి భక్తితో పాడారు నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి!!
నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి! జనకుని కూతుర జననీ
జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!!

🌿మనందరిపై సీతారామచంద్రస్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ....స్వస్తి..